Saturday, August 16, 2025

వినాయక చవితి పూజా విధానం

 వినాయక చవితి పూజా విధానం 

సేకరణ, కూర్పు : గోగులపాటి కృష్ణమోహన్




గణపతి పూజా సామాగ్రి 

 పసుపు 200 గ్రాములు 

 కుంకుమ మెరూన్ కలర్ 200 గ్రాములు 

 గంధం పెద్దది ఒక డబ్బా

 కర్పూరం 200 గ్రాములు

 అగరవత్తులు పెద్దది ఒకటి

 వక్కలు 100 గ్రాములు 

 ఖర్జూరాలు 100 గ్రాములు

 చిల్లర కాయిన్స్ 51

 తమలపాకులు 50

 విడిపూలు 

 గరిక మారేడు దళాలు బిల్వ దళాలు 

 పూలదండలు 

 పూల మూరలు 3

 పాలు

 పెరుగు

 తేనె 

 నెయ్యి

 చక్కెర

 కొబ్బరికాయలు ఐదు 

 పంచ 9x5 

 జాకెట్ ముక్కలు 3

 అఖండ దీపారాధనకి మట్టి కంచిడి 

 పెద్ద వత్తి 

 అగ్గిపెట్టె 

 రాగి చెంబు రెండు 

 ఆచమ్య పాత్రలు

 దోస పండు 

 అటుకులు బెల్లం కేజీ

 చెరుకు మొక్కలు 

 బియ్యం 5 ki

 వడ్లు 100 గ్రాములు

 యజ్ఞోపవీతం 

 వైట్ కలర్ టవల్స్ 2

 నూనె బాటిల్ 1

 మామిడి కొమ్మలు

 కంకణానికి దారం బంతి 2

 ఐదు రకాల పండ్లు 

 గణపతి కి ఉండ్రాళ్ళు ( మోదుకలు)

కొబ్బరికాయలు, 

తోరం, 

కుందులు, నెయ్యి, నూనె, వత్తులు, 21 రకాల పత్రి, 

నైవేద్యాలు. 

గంట, హారతిపళ్ళెం,  తీర్థం గిన్నె, మంగళ హారతి 

వినాయక చవితి పూజా విధానం

సేకరణ, కూర్పు : గోగులపాటి కృష్ణమోహన్

ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.(వినాయకుని ధ్యానించవలెను).

(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)

శ్లో అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచిః 

ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః

(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో - ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)

దీపం

ఓం గురుభ్యో నమః

దీపమును వెలిగించి - గంధ పుష్పాదులతో అలంకరించి - దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.

దీప శ్లోకం : ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ

శ్లోకం: ‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి.. సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ 

య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం’ అని చదువుకోవాలి.

ఆచమనం

ఓం కేశవాయ స్వాహాః, ఓం నారాయణాయ స్వాహాః, ఓం మాధవాయ స్వాహాః అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి.

గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యోం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యోం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యోం నమః, ఓం శచీపురందరాభ్యోం నమః, ఓం అరుంధతీ వశిష్ఠాభ్యోం నమః, ఓం శ్రీ సితారామాభ్యోం నమః, నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు

ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే మంత్రాన్ని చదువుతూ అక్షతలు ఎడమవైపు నుంచి వెనుక వేసుకొవాలి.

ప్రాణాయామం: ఓం భూః, ఓం భువః, ఓగ్ సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓగ్ సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్|, |ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్లు చల్లి శుద్ధిచేయాలి.

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ… క్రోధి నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ……శుభ వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర (కుటుంబ గోత్రం): ……….నామధేయ (వారి పేరు చదువుకోవాలి): ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కుడిచేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి.

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం. శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి 

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ శ్రీ మహా గణాధిపతయే నమః ఆవాహయామి:

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం. శ్రీ మహా గణాధిపతయే నమః ఆసనం సమర్పయామి:

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం. శ్రీ మహా గణాధిపతయే నమః ఆర్ఘ్యం సమర్పయామి:

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన. శ్రీ మహా గణాధిపతయే నమః పాద్యం సమర్పయామి:

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో. శ్రీ మహా గణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి:

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే. శ్రీ మహా గణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి:

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. శ్రీ మహా గణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి:

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే. శ్రీ మహా గణాధిపతయే నమః శుద్దోదక స్నానం సమర్పయామి:

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. శ్రీ మహా గణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి:

రాజితం బహ్మసూత్రంచ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీ మహా గణాధిపతయే నమః ఉపవీతం సమర్పయామి:

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం. శ్రీ మహా గణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి:

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ మహా గణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి:

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే.

వినాయక అథాంగపూజ

గణేశాయ నమః - పాదౌ పూజయామి

ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి

శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి

విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి

అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి

హేరంబాయ నమః - కటిం పూజయామి

లంబోదరాయ నమః - ఉదరం పూజయామి

గణనాథాయ నమః - నాభిం పూజయామి

గణేశాయ నమః - హృదయం పూజయామి

స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి

గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి

విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి

శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి

ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి

సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి

విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి


ఏకవింశతి పత్ర పూజ 

సుముఖాయనమః - మాచీ పత్రం/మాచిపత్రి పూజయామి।

గణాధిపాయ నమః - బృహతీ పత్రం/ములక పూజయామి।

ఉమాపుత్రాయ నమః - బిల్వ పత్రం/మారేడు పూజయామి।

గజాననాయ నమః - దూర్వా పత్రం/గరిక పూజయామి

హరసూనవేనమః - దత్తూర పత్రం/ఉమ్మెత్త పూజయామి।

లంబోదరాయనమః - బదరీ పత్రం/రేగు పూజయామి।

గుహాగ్రజాయనమః - అపామార్గ పత్రం/ఉత్తరేణి పూజయామి।

గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,

ఏకదంతాయ నమః - చూత పత్రం/మామిడి పూజయామి,

వికటాయ నమః - కరవీర పత్రం/గన్నేరు పూజయామి।

భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంత పత్రం/శంఖపుష్పం పూజయామి,

వటవేనమః - దాడిమీ పత్రం/దానిమ్మ పూజయామి,

సర్వేశ్వరాయనమః - దేవదారు పత్రం/దేవదారు పూజయామి,

ఫాలచంద్రాయ నమః - మరువక పత్రం/ధవనం, పూజయామి,

హేరంబాయనమః - సింధువార పత్రం/వావిలి పూజయామి

శూర్పకర్ణాయనమః - జాజి పత్రం/జాజిమల్లి పూజయామి,

సురాగ్రజాయనమః - గండకీ పత్రం/లతాదూర్వా (కామంచి ఆకులు) పూజయామి,

ఇభవక్త్రాయనమః - శమీ పత్రం/జమ్మి పూజయామి,

వినాయకాయ నమః - అశ్వత్థ పత్రం/ రావి పూజయామి,

సురసేవితాయ నమః - అర్జున పత్రం/ తెల్ల మద్ది పూజయామి।

కపిలాయ నమః - అర్క పత్రం/జిల్లేడు. పూజయామి।

శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.


గణపతి అష్టోత్తర శతనామ పూజ

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్వైమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీప్తాయ నమః

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రితవత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బల్వాన్వితాయ నమః

ఓం బలోద్దతాయ నమః

ఓం భక్తనిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం భావాత్మజాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వకర్త్రే నమః

ఓం సర్వ నేత్రే నమః

ఓం నర్వసిద్దిప్రదాయ నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః

ఓం కుంజరాసురభంజనాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థఫలప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళసుస్వరాయ నమః

ఓం ప్రమదాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షికిన్నరసేవితాయ నమః

ఓం గంగాసుతాయ నమః

ఓం గణాధీశాయ నమః

ఓం గంభీరనినదాయ నమః

ఓం వటవే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః

ఓం అభీష్టవరదాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం అవ్యక్త రూపాయ నమః

ఓం పురాణపురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అపాకృతపరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః

ఓం సఖ్యై నమః

ఓం సారాయ నమః

ఓం సరసాంబునిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం విశదాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖలాయ నమః

ఓం సమస్తదేవతామూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం విష్ణువే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్తజీవితాయ నమః

ఓం ఐశ్వర్యకారణాయ నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విష్వగ్దృశేనమః

ఓం విశ్వరక్షావిధానకృతే నమః

ఓం కళ్యాణగురవే నమః

ఓం ఉన్మత్తవేషాయ నమః

ఓం పరజయినే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

శ్రీ మహా గణాధిపతయే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి


అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ.. శ్రీ గణేశ్వరాయనమః ధూపమాఘ్రాపయామి

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే.. శ్రీ గణేశ్వరాయనమః దీపందర్శయామి।

సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్, భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.. శ్రీ గణేశ్వరాయనమః నైవేద్యం సమర్పయామి.

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక.. 

 శ్రీ గణేశ్వరాయనమః సువర్ణపుష్పం సమర్పయామి.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం.. శ్రీ గణేశ్వరాయనమః తాంబూలం సమర్పయామి.

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ.. శ్రీ గణేశ్వరాయనమః నీరాజనం సమర్పయామి.

అథ దూర్వాయుగ్మ పూజ..

("దూర్వాయుగ్మం" అంటే రెండు గరిక పోచలు లేదా రెండు ఆకుల గరిక అని అర్థం.)

గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

శ్రీ గణేశ్వరాయనమః అథ దూర్వాయుగ్మ పూజ సమర్పయామి


ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం శ్రీ గణేశ్వరాయనమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన.. శ్రీ గణేశ్వరాయనమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన.. శ్రీ గణేశ్వరాయనమః పునరర్ఘ్యం సమర్పయామి,

ఓం బ్రహ్మవినాయకాయ నమః

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్.

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ.. నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

వినాయక వ్రత కథ

సేకరణ, కూర్పు : గోగులపాటి కృష్ణమోహన్

వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. 

పూర్వం చంద్ర వంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని, పోగొట్టుకుని.. భార్య, సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి.. తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు. అంతట ఆ సూతమహర్షి.. శకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. 

విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోషకారణం, శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగేను. 

విఘ్నేశ్వరోత్పత్తి:-

గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుడ్ని మెప్పించి.. తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. దీంతో అసరుడు అతడు అజేయుడైనాడు.

తన భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీ దేవి చాలా దుఃఖితురాలైంది.. దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి.. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు. గంగిరెద్దును ఆడించి గజాసరుడ్ని మెప్పించాడు ఈ ఆనందంలో ‘ఏమి కావాలో కోరుకో’ అని గజాసరుడు అనగా.. అదే సమయం కోసం ఎదురుచూస్తోన్న శ్రీమన్నారాయణుడు.. నీ ఉదరమందున్న శివుడ్ని తమ వశం చేయమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షియందున్న శివుని ఉద్దేశించి ‘ప్రభూ శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది.. ప్రాణం విడిచిన తర్వాత "నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు.. నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు" అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కల్గించాడు. శివుడు గజాసురుని దీవించి స్వస్థానోన్ముఖుడైనాడు.

తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.

దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు....ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు...గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు.

గణనాయకుడు:-

సర్వవిఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుని కోరతారు. ఈ విషయంలో గణపతి, కుమారస్వామి ఎవర్ని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు.. ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలివాహనంపై రువ్వున ఎగిరిపోగా.. వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆవిధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి, మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు.

చంద్రదర్శన దోషకారణం:-

గణేశుడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.

శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు.. గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయి.. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

వినాయక చవితి శాపమోక్షం

పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషి పత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్తఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వ‌తీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.


శమంతకోపాఖ్యానము:-

ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని ఓ నారద మహర్షి కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.

శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు. ‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి... అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.


పునఃపూజ

కొంచే నీటిని అక్షతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి.

యస్యస్మృత్యాచ నామోఖ్య తపః పూజా క్రియాదిషు 

న్యూనం సంపూర్ణం తాం యాతి సద్యో వందే తం గణాధిపం 

మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం మయాదిప 

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ, అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహా నివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు

అంటూ అక్షతలు, నీటిని పళ్ళెంలో వదలాలి. 

 

ఉద్యాపన

యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ 

తే హనాకం మహిమానః సచంతే యత్రపూర్వే సాధ్యా సంతి దేవాః

శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి.. 

శోభనార్థం పునరాగమనాయచ.

అనే మంత్రం చదువుతూ విఘ్నాధిపతిని ఈశాన్యం దిశగా కదిలించి స్వామివారికి ఉద్యాపన చెప్పుకోవాలి. 

 (వినాయక చవితి రోజునే విగ్రహం నిమజ్జనం చేయాలంటే పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పొచ్చు.. లేదంటే ఏ రోజు విగ్రహం నిమజ్జనం చేస్తారో అప్పుడు మాత్రమే ఉద్వాసన చెప్పాలి)

సేకరణ, కూర్పు : గోగులపాటి కృష్ణమోహన్

గణపతి దండకం

పార్వతీ పుత్రా, లోకత్రయీస్త్రోత్ర, సత్సుణ్య చరిత్ర, సర్వార్థసంపత్ప్రదా! ప్రత్యబ్దసంపూజితా! నిన్ను విద్యాలయంబందు విద్యార్థిసంఘంబులౌ మేము సద్భక్తితో స్థాపనం జేసియున్నార మీవేళ నీవద్ద బద్ధాంజలీయుక్తమౌ ముద్రలందాల్చి సప్తాహపర్యంత మాపైన రెన్నాళ్లు నిత్యంబు వేళాద్వయంబందు శ్రద్ధాఢ్యతంబూని పూజించగా నిల్చియున్నార మోదేవ! మున్ముందుగా నాచతుర్థిన్ సుకల్పోక్తరీతిన్ విశేషంబులైనట్టి పత్రాదిసామగ్రినిం దెచ్చి, టెంకాయలున్ పుష్పముల్, మాలలున్, ధూపముల్, దీపముల్ గూర్చి, సత్పూజలం జేసి, యుండ్రాళ్ళు, వడ్పప్పు, బెల్లంబు, పండ్లప్పముల్, గారెలున్, బూరెలున్ దెచ్చి రుచ్యంబుగా నీకు నైవేద్యముల్ చూపి, విఘ్నేశ్వరోత్పత్తియు న్నాశ్యమంతాఖ్యమై యొప్పు నాఖ్యానమున్ శ్రద్ధతో నేకచిత్తంబునుంబూని చెప్పించుకొన్నాము, మంత్రోక్తరీతిన్ సుపుష్పంబు లందించియున్నాము, ఛత్రాదులున్, చామరంబుల్, సుగీతంబులున్నీకెయర్పించియున్నార మోదేవ! యీదీక్షలో నిత్య మీరీతి సూర్యోదయంబందు, సాయాహ్నకాలంబునన్ నిన్నె యర్చించుచున్నాము, పూజావిధానంబు, మంత్రంబులం నేర్వలేమైతి అత్యుత్తమంబైన సద్వాక్య సంపత్తి యింతేనియున్ లేని యజ్ఞాన మందున్న మేమిచ్చటన్ జేయుచున్నట్టి పూజాదిసర్వోపచారంబులం స్వీకరించంగ నిన్వేడుచున్నాము, 

మాపైని కారుణ్యముంజూపుమా, యజ్ఞానమున్ ద్రుంచుమా, దోషముల్ సైచి, సద్విద్యలందించుమా, ధాత్రిలో మాకు సద్బుద్ధి, విజ్ఞానసంపత్తి, సత్కీర్తి, యారోగ్యభాగ్యంబు, సత్త్వంబు, సన్మార్గసంచారధైర్యంబు, సత్పాత్రతాదీప్తితోడన్ జయం బెల్లకాలంబులం గూర్చి, సత్పౌరులం జేయుమా, దేశభక్తిన్ సదానిల్పి విద్యాభివృద్ధిన్ ప్రసాదించి మమ్మున్ వివేకాఢ్యులం జేయుమా, దేవదేవా! మహాకాయ! లంబోదరా! ఏకదంతా! గజాస్యా! సదావిఘ్ననాశా! మహేశాత్మజాతా! ప్రభూ! నాగయజ్ఞోపవీతా! భవానీతనూజా!త్రిలోకైకనాథా! సదామందహాసా! సురేంద్రా! గజేంద్రాననా! శూర్పకర్ణా! నమస్తే నమస్తే నమస్తే నమః


సమాప్తం 

సేకరణ, కూర్పు : గోగులపాటి కృష్ణమోహన్

Wednesday, May 28, 2025

సంక్షిప్త శివ పంచాయతన పూజ

 సంక్షిప్త శివపంచాయతన పూజ

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్ 

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః !!! ఓం శ్రీ గురుభ్యో నమః !!!  

హరిః ఓం !! ఓం నమః శివాయ: !!!

అపవిత్ర : పవిత్రోవా సర్వావస్థాఙ్గతో పివా !!! య స్మరేత్పుణ్డరీకాక్షం సబాహ్యాభ్యంతర స్సుచి: !!!

పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీక్షాయనమః

(పై మంత్రం చెపుతూ తలమీద మూడు సార్లు నీళ్లు చల్లుకోవాలి )

తరవాత నమస్కరిస్తూ ఈ క్రిందిశ్లోకం చదువుకోవాలి

ఓం దేవీం వాచ మజనయంత దేవా !!! స్తాం విశ్వరూపా: : పసవో వదన్తి !!! సానో మంద్రేష మూర్జందుహానా!!

ధేనుర్వాగ స్మా నుపసుష్టుతైతు !!!

అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు

ప్రాణప్రతిష్టాపన మంత్రం :-  

పూజావిధానం

ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !! ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే !!

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ !! విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే జీన్ఘ్రియుగం స్మరామి !!

లాభస్తేషాం జయస్తే షాo కుతస్తేషాం పరాభవ !! యేషా మిందీవరశ్యామో హృదయ స్థో జానార్ధనః !!

ఆపదాపహర్తారం దాతారం స్వర్వసంపదామ్ !! లోకాభిరామం శ్రీ రామం భూయోభూయో నమామ్యహమ్!!

సర్వమంగళ మాంగళ్హ్యే శివే సర్వార్ధ సాధికే ! శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే !!

యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్ధ్ర్డోధనుర్ధరః !! తత్రశ్రీ ర్విజయోభూతి ద్ధ్రువానీతి ర్మతిర్మమ !!

ఓం శ్రీ లక్ష్మి నారాయణాభ్యాం నమః !! ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః !! ఓం శ్రీ వాణిహిరణ్య గర్భాభ్యాం నమః !! ఓం శ్రీ శచీ పురంద రాభ్యాం నమః !! ఓం శ్రీ ఇంద్రా ద్యష్ట దిక్పాలక దేవతాభ్యోనమః !! ఓం శ్రీ ఆదిత్యాది నవగ్దవతాభ్యోనమః !! ఓం శ్రీ గ్రామదేవతాభ్యోనమః !! ఓం శ్రీ క్షేత్రాధిష్ఠాన దేవతాభ్యోనమః !! ఓం శ్రీ కులదేవతాభ్యోమమః !! ఓం శ్రీ అరుంధతీ వసిస్తాభ్యాంనమః !! ఓం శ్రీ మాతా పితృభ్యాంనమః !!

 ఓం శ్రీ సర్వేభ్యోమహాజనేభ్యోనమః !! ఓం శ్రీ సద్గురుభ్యోనమః !!

ఓం ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్ !! కురుఘంటారవం తత్రదేవతాహ్వాన లాంచనమ్ !!

(ఘంట వాయించవలెను)

ఓం భోదీప ! బ్రహ్మరూపేణ సర్వేషాం హృదిసంస్థితః ! అతస్త్వామ్ స్థాపయామ్యద్యమద జ్ఞానమపాకురు !!

(దీపము వెలిగించి పుష్పాక్షతలచే అలంకరించండి )

పృథ్వి ! త్వయాధృతా లొకాః దేవి ! త్వం విష్ణునాధృతా ! త్వంచ ధారయ మాందేవి ! పవిత్రం కురుచాసనమ్ !!

(కూర్చున్న ఆసనం క్రింద కొంచెం అక్షతలను వేయండి భూదేవికి నమస్కరించండి )

ఆచమనము

(ఈ క్రింది నామములు చెప్పి మూడు సార్లు జలము తీసుకోండి )

ఓం కేశవాయస్వాహా ! ఓం నారాయణాయ స్వాహా ! ఓం మాధవాయ స్వాహా !

ఓం గోవిందాయ నమః (అని చేతులు కొంచెం జలం తీసుకొని చేతులు కడుగుకొండి )

ఓం విష్ణవే నమః ! ఓం మధుసూదనాయ నమః ! ఓం త్రివిక్రమాయ నమః !

ఓం వామనాయ నమః ! ఓం శ్రీధరాయ నమః !ఓం హృషీకేశాయ నమః !

ఓం పద్మనాభాయ నమః ! ఓం దామోదరాయ నమః ! ఓం సంకర్షణాయ నమః !

ఓం ప్రద్యుమ్నాయ నమః ! ఓం వాసుదేవాయ నమః ! ఓం అనిరుద్ధాయ నమః !

 ఓం పురుషోత్తమాయ నమః ! ఓం అధోక్షజాయ నమః ! ఓం నరసింహాయ నమః !

ఓం అచ్యుతాయ నమః ! ఓం జనార్ధనాయ నమః ! ఓం ఉపేంద్రాయ నమః !

ఓం హరయే నమః ! ఓం కృష్ణాయ నమః !

!!శ్లో !! ఓం ఉత్తుష్టంతు భూతపిశాచా : ఏతే భూమిభారకాః !

  ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే !!

(అక్షతలు వాసనా చూసి ఎడం వైపుగా వెనుకవేసుకోవాలి )

ప్రాణాయామము 

ఓం భూ :, ఓం భువః , ఓం సువః , ఓం మహః , ఓం జనః , ఓం తపః , ఓగ్o సత్యం ,

ఓంతత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి ! ధియోయోనః ప్రచోదయాత్ !

ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ !!

( పై మంత్రం చెపుతూ బొటనవేలు , మధ్యమ, ఉంగరం వ్రేళ్ళతో ముక్కు పట్టుకొని శ్వాస పీల్చి కొంచెం సేపు నిలిపి తరవాత వదిలేయాలి తరవాత ఉద్దరిని తో నీటిని తీసుకొని చెయ్యి కడుగుకోవాలి )

సంకల్పము 

( చేతిలో పుష్పాక్షతలు తీసుకొని కుడికాలి తొడమీద ఎడమ చేయి క్రింద, కుడిచేయి పైన ఉండేలా సంకల్పము అయ్యేవరకు పట్టుకోవాలి)

మమో పాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్జ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరత వర్షే భరత ఖండే మేరో: దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య _____(ఈశాన్య) ప్రదేశే కృష్ణా గోదావరి(కావేరి) మధ్య దేశే స్వగృహే(శోభనగృహే) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరగురు చరణ సన్నిదౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ______(దుర్ముఖి నామ) సంవత్సరే _______(దక్షిణాయనే) _____(శరత్ఋతౌ ) _______(కార్తీకమాసే ) _______పక్షే (అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుక్ల పక్షం -- పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణ (శుద్ధ) పక్షం) ________తిదౌ _______వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ __________ గోత్ర:(గోత్రస్య /గోత్రావతి ) శ్రీమాన్/శ్రీమాత _________(పేరు) నామధేయస్య /నామధేయవతి (మమ యజమానస్య (భర్త పేరు ) / మమ ధర్మపత్ని సమేతస్య ) అస్మాకం సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య , ధైర్య, విజయ, అభయ, ఆయు , ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ద్యర్ధం, మనోవాంఛా ఫల సిద్ధ్యర్ధం, భక్తి, జ్ఞాన , వైరాగ్య , యోగ ప్రాప్యర్ధం, యే యే గ్రహా : అరిష్టస్థానేషుస్థితా: తేషాం నవానాం, గ్రహాణాం శుభ ఏకాదశ స్థానఫల ప్రాప్యర్ధం శ్రీ సాంబసదాశివ దేవతా, శ్రీ ఉమామహేశ్వర దేవతా ప్రీత్యర్ధం అవాహతేభ్య స్సర్వేభ్యో దేవేభ్య: -- సంభవద్భి: ద్రవ్యై:, సంభవద్భ: పదార్డయై , సంభవద్భి ఉపచారై: సంభవిత నియమేన శ్రీ రుద్రసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యాన అవాహనాది షోడశోపచార పూజామహంకరిష్యే .

(చేతిలోని పుష్పాక్షతలు దేవునిపై వేసి నమస్కరించవలెను )

ధ్యానం 

!!శ్లో !! శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం 

                       శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయధం దక్షభాగే వహంతమ్ 

                       నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే 

                       నానాలంకారయుక్తం స్పటికమణినిభం పార్వతీశం నమామి !!


!!శ్లో !! ఆ పాతాళ నభ: స్థలాన్త భువన బ్రహ్మాండ మావి: స్పుర

                       జ్యోతి స్పాటిక లింగ మౌళి విలస త్పూ ర్ణేందు వాన్తామృతైః

                       అస్తోకాప్లుత మేక మీశ మనిశం - రుద్రానువాకా ఙ్ఞపేత్   

                        ద్యాయే దీప్సిత సిద్ధయే ద్రువపదం; విప్రోభిషించే చ్చివమ్ 

                       బ్రహ్మాండ వ్యాప్తదేహా, భసిత హిమరుచా, భాసమానా భుజంగైః

                        కంఠేకాలాః , కపర్దా, ;కలితశశికలా , శ్చన్డ్ కోదండ హస్తాః

                         త్ర్యక్షా రుద్రాక్షమాలా , సులలితవపుష , శ్శాంభవా , ముర్తిభేదా:

                        రుద్ర శ్రీ రుద్ర సూక్త - ప్రకటితవిభవా: - నః ప్రయచ్ఛన్తు సౌఖ్యమ్  

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! ధ్యాయామి ! ధ్యానం సమర్పయామి !

ప్రాణప్రతిష్టాపన మంత్రం :-  

 అసునీతే పునరాస్మాసు చక్షుః పునః ప్రాణ మిహినో హి భొగమ్

జ్యోక్ప శ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి

అమృతం వై ప్రాణా అమృత మాపః ప్రాణానేవ యధా స్థాన ముపహ్వ్యతే

స్థిరోభవ ! వరదోభవ ! సుప్రసన్నోభవ ! స్థిరాసనం కురు !

ఆవాహనం 

 !!మ !! సద్యోజాతం ప్రపద్యామి 

స్వామిన్ సర్వ జగన్నాధ యావత్ పూజా వసావకం ! తావత్ త్వం ప్రీతిభావేన బింబే (లింగే) స్మిన్ సన్నిధిం కురు!

స్థిరోభవ ! వరదోభవ ! సుముఖోభవ ! సుప్రసన్నొభవ ! స్థిరాసనం కురు ! (అక్షతలు)

ఆసనం 

!!మ !! సద్యో జాతాయ వై నమోనమః !! 

భాస్వన్మౌక్తిక తొరణే , మరకత స్తంభాయుతాలంకృతే ! సౌదే దూపే సువాసితే, మణిమయె, మాణిక్య దీపాంచితే !

మాణిక్య సింహాసనే ! సుస్థిరొ భవ ! శ్రీ మహేశ్వరాయ నమః ! సువర్ణ రత్నఖచితసింహాసనం సమర్పయామి !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః ! ఆసనం సమర్పయామి

పాద్యమ్

!!మ !! ! భవే భవే నాతి !

పాద్యం గృహాణ దేవేశ ! మమ సౌఖ్యం వివర్దయ ! భక్త్యా సమర్పితం దేవ ! లోకనాధ నమోస్తుతే !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! ఓం శంభవే నమః ! పాదయోః పాద్యం సమర్పయామి


అర్ఘ్యం 

!!మం !! భవే భవస్వ మామ్ !!

వ్యక్తా, వ్యక్త స్వరూపాయ, హృషీకపతయే నమః ! మయా నివేదతో భక్త్యా అర్ఘ్యోయం ప్రతిగ్రుహ్యతామ్ !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! హస్తయోః అర్ఘ్యం సమర్పయామి !


ఆచమనీయమ్ 

!!మ!! భవోద్భావాయ నమః !

కర్పూర వాసితం తోయం మన్దాకిన్యాః సమావృతం

మృత్యుంజయ, మహాదేవ, శుద్ధ ఆచమనం సమర్పయామి !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! ముఖే ఆచమనీయం సమర్పయామి !


మధుపర్కం 

గుడ దదిసహితం, మధుప్రకీర్ణ, సుఘృత సమన్విత దేను దుగ్ధయుక్తం !శుభకర మధుపర్కం సమర్పయామి


స్త్నానం, పంచామృతస్త్నానం , అభిషేకం

!!మ !! వామదేవాయ నమః !! స్నపయామి !! (రుద్రనమకం)

!!మ !! ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరయ, మహాదేవాయ, త్ర్యంబకాయ , త్రిపురంతకాయ, త్రికాలాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుం జయాయ, సర్వేశ్వరాయ, సదా శివాయ, శ్రీమన్ మహాదేవాయ నమః !


హర హర మహాదేవ శంభో శంకర (గంట వాయిస్తూ )

 !!మం !! నమ స్సోమాయ చ రుద్రాయ చ, నమ స్తామ్రాయ చారుణాయ చ. నమ శ్సంగాయ చ పశుపతయే చ,నమ ఉగ్రాయ చ భీమయ చ, నమో అగ్రేవధాయ చ దూరేవదాయ చ, నమో హంత్రే చ, హనీయసే చ, నమోవృక్షేభ్యో హరి కేశేభ్యో, నమ స్తారాయ, నమ శ్సం భవే చ మయోభవే చ, నమశ్శంకరాయ చ మయ స్కరాయ చ, నమశ్శివాయ చ, శ్శివతరాయ చ, నమ స్తీర్యాయ చ కుల్యాయ చ, నమ పార్యాయ చ వార్యాయ చ, నమ ప్రతరణాయ చోత్తరణాయ చ, నమ ఆతార్యాయ చాలాద్యాయ చ, నమ శ్శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ, నమ స్పికత్యాయ చ ప్రవాహ్యాయ చ !! 

!!మం !! త్ర్యంబకాయ యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ! ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో ర్ముక్షియ మామృతాత్ ! యోరుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు! నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి ! 


(రుద్రచమకం)

!!మం!! శం చ మే మయశ్చ మే ! ప్రియం చ మే ! కామశ్చ మే ! సౌమనసశ్చ మే ! భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే ! యంతా చ మే ! ధర్తా చ మే క్షెమశ్చ మే ధ్రుతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే ! సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ! ప్రసూశ్చ మే సీరం చ మే ! లయశ్చ మ ! ఋతం చ మే 

 మృతం చ మే ! యక్ష్మం చ మే ! అనామయశ్చ మే ! జీవాతుశ్చ మే ! దేర్ఘాయుత్వం చ మే ! అనమిత్రం చ మే !అభయం చ మే ! సుగంచ మే శయనం చ మే ! సూషా చ మే ! సుదినం చ మే ! 

!!మం!! ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః ! 

              భవే భవే నాతి భవే భవస్య మాం ! భావోధ్బవాయ నమః !

!!మం !! ఓం వామదేవాయ నమో జ్యేష్టాయ నమః శ్రేష్టాయ నమో 

             రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో 

             బలవికరణాయ నమో బలాయ నమో 

             బలప్రమధనాయ నమస్సర్వ భూతదమనాయ నమో 

              మనోన్మనాయ నమః !


!!మం !! అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరే ఘోరతరేభ్యః !

               సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ! 

!!మం !! ఈశాన సర్వ విద్యానా మీశ్వర సర్వ భూతానాం 

               బ్రహ్మాధిపతి బ్రహ్మనోదిపతిర్ 

                బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం !!  

పురుషోవై రుద్రః సన్మహొ నమో నమః ! విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయ మానం చ యత్ సర్యోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు ! కద్రుద్రాయ ప్రచేతసే మీడుష్ట మాయ తవ్యసే ! వోచేమ శంతమగ్o హృదే ! సర్యోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు ! 

మహాదేవ, మహాదేవ, మహాదేవ, దయానిధే 

భవానేవ, భవానేవ, భవానేవ, గతి ర్మమ 

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః ! పంచామృత తధా శుద్దోదక స్త్నానం సమర్పయామి !!

(శివలింగాన్ని ఎడమచేతితో పట్టుకొని ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ కుడిచేతితో నీటిని పోస్తూ కడిగి తుడిచి కుంకుమ, పెట్టి మళ్లా యధాస్తానం లో ఉంచాలి)

ఓం ఆపో హిష్టా మయో భువః తా న ఊర్జే ధధాతన మహేరణాయ చక్షసే ! యో వః శివతమో రసః తస్య భాజయతే హ నః ఉశతీరివ మాతరః తస్మా అరం గమామ వో యస్య క్షయాయ జిన్వద అపో జనయధా చ నః !  

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః !

 శుద్దోదక స్త్నానం సమర్పయామి !!


వస్త్రం 

11మం!! జ్యేష్టాయ నమః !!


వేదసూక్త సమాయుక్తే, యజ్ఞ సామ సమన్వితే ! సర్వవర్ణ ప్రదేదేశ వాససీతే, సునిర్మితే!!


ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః !వస్త్ర యుగ్మం సమర్పయామి


యజ్ఞోపవీతం

యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ ! ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః !


ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! ఓం మహేశ్వరాయ నమః ! ఉపవీతం సమర్పయామి


విభూతి (భస్మ ధారణ )


అగ్ని రితిభస్మ, వాయురితిభస్మ, జలమితిభస్మ, స్థలమితిభస్మ వ్యోమేతిభస్మ సర్వగ్o హవాయ ఇదగ్o సర్వంభస్మ ! చితాభస్మధరమ్ వామదేవరుద్రం నమామ్యహం 

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ఓం సర్వాయనమః ! భస్మం ధారయామి !


ఆభరణం 


!!మం!! ఓం రుద్రాయ నమః !!


రుద్రక్షమాల ఆభరణం, నాగేంద్రహార కంకణై:! భుజంగాభరణైర్యుక్తం గృహాణ అమరవల్లభ

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ఆభరణం సమర్పయామి !


చందనం 


!!మం!! కాలాయ నమః !!


శ్రీ ఖండం చందనం దివ్యం, గoధాడ్యం సుమనొహరమ్ ! విలేపనం సురశ్రేష్టం, ప్రీత్యర్ధం 

ప్రతిగ్రుహ్యతాం !


ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !గంధం సమర్పయామి !


అక్షతాన్ 


1మం ! కలవికరణాయ నమః !!

ఆయనే తే పరయణె దూర్వారోహం తు పుష్పిణీ:! హ్రదాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహా ఇమే!

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్, గృహాణ శివ శంకర


ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !అక్షతాన్ సమర్పయామి !


బిల్వపత్రం/ పుష్పం సమర్పయామి


!!మం!! బలవికరణాయ నమః !!

ఓం నిధన పతయే నమ ! ఓం నిధన పతాంతికాయ నమః !!  

  ఓం ఊర్దాయ నమః ! ఓం ఊర్ధలింగాయ నమః!!

ఓం హిరణ్యాయ నమః ! ఓం హిరణ్య లింగాయ నమః!!   

 ఓం సువర్ణాయ నమః ! ఓం సువర్ణలింగాయ నమః!!

ఓం దివ్యాయ నమః! ఓం దివ్యలింగాయ నమః!!  

  ఓం భవాయ నమః ! ఓం భవలింగాయ నమః !!

ఓం సర్వాయ నమః! ఓం సర్వలింగాయ నమః !! 

 ఓం శివాయ నమః ! ఓం శివలింగాయ నమః !!

ఓం జ్వాలాయ నమః ! ఓం జ్వలలింగాయ నమః !! 

ఓం ఆత్మయ నమః! ఓం ఆత్మలింగాయ నమః !!

ఓం పరమాయ నమః ! ఓం పరమలింగాయ నమః !!


!! ఏతత్ సోమస్య సూర్యస్య సర్వ లింగ గ్గ్ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం !!


ఓం భవాయ దేవయ నమః ! ఓం శర్వాయ దేవాయ నమః !

ఓం ఈశానాయ దేవాయ నమః ! ఓం పశుపతయే దేవాయ నమః !!

ఓం రుద్రాయ దేవాయ నమః 1 ఓం ఉగ్రాయ దేవాయ నమః !!

ఓం భీమాయ దేవాయ నమః ! ఓం మహాతే దేవాయ నమః !!

ఓం భవస్య దేవస్య పత్న్యై నమః! ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః !!

ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ! ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః !!

ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ! ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః !!

ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ! ఓం మహతో దేవస్య పత్న్యై నమః !!


ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! నానావిధ పరిమళ పుష్పాణి, బిల్వపత్రాణి సమర్పయామి !

(ఇక్కడ శివాష్టోత్తర శతనామావళి తో పూజ చేయవచ్చును )


ధూపం


1మం! బలాయ నమః !! దశాంగం గుగ్గులోపెతం, సుగంధం, సుమనొహరమ్ ! కపిలాఘ్రుత సంయుక్తం, దూపోయం ప్రతిగృహ్యాతాం !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ధూపం ఆఘ్రాప యామి సమర్పయామి !


దీపమ్

!మం! బల ప్రమథనాయ నమః !! సాజ్యం త్రివర్తి సంయుక్తం, వహ్నినాయోజితం ప్రియమ్ ! గృహాణ మంగళం దీపం, నీలకంర ! నమోస్తుతే !

భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే ! త్రాహి మాం నరకాత్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే !!


ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! దీపమ్ సమర్పయామి !


ధూప, దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి !!


నైవేద్యం


!!మం!! సర్వభూత దమనాయ నమః!!

నైవేద్యం షడ్రసోపేతం , ఫల లడ్డూక సంయుతం ! రాజన్నం సూపసంయుక్తం, శాక చోష్య సమన్వితం! ఘ్రుత భక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతి గృహ్యాతాం !!


ఓం భూర్బువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ !!


సత్యంత్వర్తేనా పరిషించామి ! అమృతమస్తు ! అమ్రుతొపస్తరణమసి !


ఓం సద్యోజాత ముఖాయ స్వాహా ! ఓం వామదేవ ముఖాయ స్వాహా ! ఓం అఘోర ముఖాయ స్వాహా ! ఓం తత్పురుషాయ ముఖాయ స్వాహా ! ఓం ఈశాయ ముఖాయ స్వాహా !


ఓం ప్రాణాయ స్వాహా ! ఓం అపానాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా ! ఓం ఉదానాయ స్వాహా ! ఓం సమానాయ స్వాహా ! ఓం బ్రహ్మణే స్వాహా !

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి! అమృతా పిథానమసి ! ఉత్తరాపోశనం సమర్పయామి! హస్తౌ ప్రక్షాళయామి ! పాదౌ ప్రక్షాళ యామి ! శుద్ధ ఆచమనీయం సమర్పయామి !


తాంబూలం 


!మం! మనోన్మనాయ నమః!! పూగీఫల సమాయుక్తం, నాగవల్లీ దళర్యుతం ! కర్పూర చూర్ణ సంయుక్తం, తాంబూలం ప్రతిగృహ్యాతాం !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! తాంబూలం సమర్పయామి !


కర్పూర నీరజనమ్


ఓం అఘోరెభ్యొ ధఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః ! సర్వేభ్య స్సర్వ సర్వే భ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః !!

నీరాజనం మయాదత్తం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామహమ్ దేవం సర్వలోక పూజితే !!

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కర్పూర నీరాజనం సమర్పయామి !


మంత్రపుష్పం 


ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే ! సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణొ దధాతు ! కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః !

ఓం తద్బ్రహ్మ ! ఓం తద్యాయుః ! ఓం తదాత్మా ! ఓం తత్సత్యం ! ఓం తత్సర్వం ! ఓంతత్పురోర్నమః ! అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వముర్తిషు !

త్వం యజ్ఞస్త్వం వషట్కారః త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః ! త్వం తదాప ఆపో జ్యొతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరొమ్ !


నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయెంబికా పతయ ఉమాపతయే పశుపతయే నమో నమః !!


ఋతగ్o సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగలమ్ ! ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః !


ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం ! పారమేష్ట్యం రాజ్యం మహారాజ్య మాదిపత్యమయం !సoమత పర్యా ఈస్యాత్ ! సార్వభౌమ స్సార్వాయుషః ! అందాతాపరార్ధాత్ ప్రుధివ్యై సముద్రపర్యంతాయా ! ఏకరాదితి తడష్యేష శ్లోకో భవతి !మరుతః పరివేష్టారో మరుత్తస్యా వసన్న్గ్రుహే ! ఆవిక్షితస్య కామప్యే రిశ్వేదేవా స్సభాసద ఇతి !అదైతం విష్ణువే చరుం నిర్వపతి యజ్ఞోవై విష్ణుః ! యజ్ఞ ఏవాం తతః ప్రతితిష్ఠతి !

సొత్రజుహొతి - విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్టాయై స్వాహేతి !!


ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ దిమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ !

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి దిమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ !


ఈశాన స్సర్వ విద్యానాం ఈశ్వర స్సర్వ భూతానాం ! బ్రహ్మధిపతి ర్బ్రహ్మణొ దిపతిర్బ్రహ్మ శివోమే స్తు సదాశివొమ్ !


ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! దివ్య మంత్రపుష్పం సమర్పయామి !


ఆత్మ ప్రదక్షిణ నమస్కారము


యానికాని చ పాపని జన్మాంతర కృతానిచ ! తాని తాని ప్రనశ్యంతి ప్రదక్షణ పదేపదే !

పాపోహం, పాప కర్మణాం, పాపాత్మ, పాపసంభవ ! త్రాహి మాం క్రుపయదేవ శరణాగత వత్స్చల !అన్యధా శరణం నాస్థి త్వం ఏవ శరణం మమ ! తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష మహేశ్వర !


ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! ఆత్మ పూర్వక నమస్కారం సమర్పయామి !


క్షమా ప్రార్ధన

ఆవాహనం న జానామి న జానామి విసర్జనం ! పూజాం చైవ న జానామి క్షమస్వ పరమేశ్వర

అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా ! దాసొయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర !

ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! క్షమార్పణ నమస్కారం సమర్పయామి !


ఛత్రం ధారయామి! చామరం వీజయామి!దర్పణం దర్సయామి ! నృత్యం దర్సయామి ! గీతం శ్రావయామి ! ఆందోళికనారోహయామి ! అశ్వానారోహయామి ! గజానారొహయామి ! సమస్త రాజోపచార శక్త్యుపచార, భక్త్యుపచార మంత్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి !


పూజా సమర్పణం


యస్య స్మృత్యాచ నమోక్త్యా తపః పూజాక్రియా ధిషుః ! న్యూనమ్ సంపూర్ణతాం యాతి సద్యో వందే తం అచ్యుతం !

మంత్రహీనం, క్రియాహీనం, భక్తీహీనం మహేశ్వర ! యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే !!


అనయా ద్యానావాహనాది షోడశోపచారపూజయా చ భగవాన్ సర్వాత్మకః ! శ్రీ ఉమామహేశ్వర దేవతాసుప్రీత స్సుప్రసన్నొ వరదో భవతు ! శ్రీ స్వామి ప్రసాదసిద్ధి రస్తు !

 శ్రీ ఉమామహేశ్వర దేవతా ప్రసాదం శిరసా గృహ్నామి ! స్వస్తి !!

!!సర్వం శ్రీ పరమేస్వరార్పణమస్తూ !!

కాయేన వాచా మనసెంద్రియైర్వా ! బుధ్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ ! కరోమి యద్యత్ సకలం పరస్మై !మహేశ్వరాయేతి సమర్పయామి !!

ఓం సహ నావవతు ! సహ నౌ భునక్తు ! సహ వీర్యం కరవావహై ! తేజస్వినావధీతమస్తూ! మా విద్విషావహై !

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ! పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే !!

ఓం శాంతిః శాంతిః శాంతిః  

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్