Friday, September 16, 2022

బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలు

 

బతుకమ్మ పండుగ


శుభకృత్ నామ సంవత్సరం బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల వివరాలు

సేకరణ మరియు సమర్పణ :

+గోగులపాటి కృష్ణమోహన్*
9700007653

*25-09-2022 ఆదివారం*
భాద్రపదమాసం అమావాస్య మొదటిరోజు బతుకమ్మ పండుగ
ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు.

నైవేద్యంగా నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

*26-09-2022 సోమవారం*
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రెండవ రోజు అటుకుల బతుకమ్మ చేస్తారు.

నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

*27-09-2022 మంగళవారం,*
ఆశ్వీయుజ శుద్ధ విదియ మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ జరుపుకుంటారు.

నైవేద్యంగా ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

*28-09-2022 బుధవారం*
ఆశ్వీయుజ శుద్ధ తదియ, నాల్గవ రోజు
నానే బియ్యం బతుకమ్మ జరుపుకుంటారు.

నైవేద్యంగా నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

*29-09-2022 గురువారం*

ఆశ్వీయుజ శుద్ధ చవితి, ఐదవరోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు.

నైవేద్యంగా అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..

*30-09-2022 శుక్రవారం*
ఆశ్వీయుజ శుద్ధ పంచమి, ఆరవ రోజు,
అలిగిన బతుకమ్మ .

ఈరోజు నైవేద్యమేమి సమర్పించరు.

*01-10-2022 శనివారం*
ఆశ్వీయుజ శుద్ధ షష్టి, ఏడవ రోజు,
వేపకాయల బతుకమ్మ .

నైవేద్యంగా బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

*02-10-2022 ఆదివారం*
ఆశ్వీయుజ శుద్ధ సప్తమి , ఎనిమిదవ రోజు, వెన్నముద్దల బతుకమ్మ.

నైవేద్యంగా నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

*03-10-2022 సోమవారం*
ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) తొమ్మిదవ రోజు, సద్దుల బతుకమ్మ.

ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.
నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, పెసర సద్ది, కొబ్బరన్నం, నువ్వులన్నం. బెల్లాపన్నం మొదలగు సద్దులు సమర్పిస్తారు.

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో...
*గోగులపాటి జ్యోతి కృష్ణమోహన్*
9700007653

No comments:

Post a Comment