Friday, September 18, 2026

కుంకుమార్చన పూజా విధానం

 

కుంకుమార్చన పూజా విధానం

సేకరణ & సమర్పణ: గోగులపాటి కృష్ణమోహన్


శ్రీ దేవి కుంకుమార్చన పూజకు కావాల్సిన ముఖ్యమైన పూజా సామగ్రి:

కుంకుమ & పసుపు: మంచి సువాసన గల ఎరుపు కుంకుమ (అర్చించడానికి సరిపడా పరిమాణంలో), పసుపు, గంధం.

చిత్రపటం / యంత్రం: లలితా పరమేశ్వరి లేదా మహాలక్ష్మి చిత్రపటం, శ్రీచక్రం లేదా వెండి/రాగి నాణెం (అర్చన చేయడానికి).

పూలు & అక్షింతలు: ఎరుపు రంగు పువ్వులు (మందారాలు లేదా గులాబీలు), తామర పువ్వులు, తులసి/బిల్వ దళాలు, పసుపు కలిపిన అక్షింతలు.

పంచపాత్ర & కలశం: ఉద్ధరిణె, పంచపాత్ర (శుద్ధ జలం కొరకు), అర్చన చేసిన కుంకుమను ఉంచడానికి వెడల్పాటి తాంబూల పళ్లెం.

దీపారాధన సామాగ్రి: ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ప్రమిదలు, వత్తులు, అగరుబత్తులు, హారతి కర్పూరం.

నైవేద్యం: తీపి పదార్థం (పరమాన్నం, కేసరి లేదా పాయసం), పటికబెల్లం, పండ్లు, ఎండు ఖర్జూరాలు.

తాంబూలం & దక్షిణ: తమలపాకులు, పోకచెక్కలు, అరటిపండ్లు, దక్షిణ నాణేలు.

పూజ ప్రారంభంలో నిర్వహించే దీపారాధన, ఆచమనం మరియు సంకల్పం శాస్త్రోక్త విధివిధానం:

Oka plate lo బియ్యం పోసి, దానిపై ఒక జాకెట్ ముక్క పెట్టీ, 2 తమలపాకులు, కొబ్బరి kuduka petti, Danilo Pasupu janta gouramma chesukoni పెట్టుకోవాలి.)

. శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన (శుక్లాంబరధరం)


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||


అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ |

అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే ||


౨. గురు ప్రార్థన (గురుబ్రహ్మ)

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||


అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |

తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||


 దీపారాధన విధి

పూజకు ముందుగా కుందులకు పసుపు, కుంకుమలు పెట్టి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో మూడు లేదా ఐదు వత్తులు వేసి వెలిగించాలి. పువ్వు, అక్షింతలు సమర్పిస్తూ ఈ శ్లోకం పఠించాలి:

భో దీప బ్రహ్మరూపస్త్వం హ్యంధకార నివారక |

ఆగతో హి మయా పూజాం గృహాణ తమసో హర ||


దీపజ్యోతిః పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః |

దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోఽస్తు తే ||

(దీపలక్ష్మీ దేవికి నమస్కరించుకోవాలి)


 శుద్ధి మంత్రం (ఆత్మశుద్ధి)

ఉద్ధరిణెతో నీటిని తీసుకుని తమపై మరియు పూజా ద్రవ్యాలపై చల్లుకోవాలి:

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా |

యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||


 ఆచమనం

కుడిచేతి బ్రాహ్మీతీర్థంలోకి ఉద్ధరిణెతో మూడుసార్లు జలాన్ని తీసుకుని స్వీకరిస్తూ, ఆపై నామాలు స్మరించాలి:

 * ఓం కేశవాయ స్వాహా (మొదటి ఉద్ధరిణె జలం స్వీకరించాలి)

 * ఓం నారాయణాయ స్వాహా (రెండవ ఉద్ధరిణె జలం స్వీకరించాలి)

 * ఓం మాధవాయ స్వాహా (మూడవ ఉద్ధరిణె జలం స్వీకరించాలి)

 * ఓం గోవిందాయ నమః (చేతులు కడుక్కోవాలి)

 * ఓం విష్ణవే నమః (చేతులు తుడుచుకోవాలి)

తరువాత చేతులతో ఆయా అంగాలను తాకుతూ పఠించాలి:

 * ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః (పై పెదవి, కింది పెదవి)

 * ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః (శిరస్సును స్పృశించాలి)

 * ఓం హృషీకేశాయ నమః (ఎడమ అరచేయి), ఓం పద్మనాభాయ నమః (పాదాలు)

 * ఓం దామోదరాయ నమః (శిరస్సు), ఓం సంకర్షణాయ నమః (గడ్డం)

 * ఓం వాసుదేవాయ నమః (నోరు), ఓం ప్రద్యుమ్నాయ నమః (ముక్కు కుడి రంధ్రం)

 * ఓం అనిరుద్ధాయ నమః (ముక్కు ఎడమ రంధ్రం), ఓం పురుషోత్తమాయ నమః (కుడి కన్ను)

 * ఓం అధోక్షజాయ నమః (ఎడమ కన్ను), ఓం నారసింహాయ నమః (కుడి చెవి)

 * ఓం అచ్యుతాయ నమః (ఎడమ చెవి), ఓం జనార్దనాయ నమః (నాభి)

 * ఓం ఉపేంద్రాయ నమః (హృదయం), ఓం హరయే నమః (శిరస్సు)

 * ఓం శ్రీకృష్ణాయ నమః (కుడి, ఎడమ భుజాలు)


 సర్వదేవతా స్మరణ & ప్రార్థన

లక్ష్మీనారాయణాభ్యాం నమః |

ఉమామహేశ్వరాభ్యాం నమః |

వాణీహిరణ్యగర్భాభ్యాం నమః |

శచీపురందరాభ్యాం నమః |

మాతృపితృ చరణకమలేభ్యో నమః |

ఇష్టదేవతాభ్యో నమః | కులదేవతాభ్యో నమః | గ్రామదేవతాభ్యో నమః |

వాస్తుదేవతాభ్యో నమః | సర్వేభ్యో మహాజనేభ్యో నమః ||


కార్యనిర్విఘ్న ప్రార్థన

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే |

శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ||

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ||


ధూమ్రకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః |

ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి |


విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |

సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ||

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||


భూతోచ్ఛాటన (ప్రాణాయామం & దిగ్బంధనం)

కుడిచేతి బొటనవేలు, ఉంగరం వేలితో ముక్కు రంధ్రాలను నియంత్రిస్తూ ప్రాణాయామం చేయాలి:

ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యమ్ |ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ | ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||

అక్షింతలు చేతిలో ఉంచుకుని అపవిత్ర శక్తులను నివారిస్తూ చుట్టూ చల్లాలి:

ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః |

ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||


సంకల్పం

చేతిలో అక్షతలు, పువ్వు, ఉద్ధరిణెతో జలం ఉంచుకుని పఠించాల్సిన సంకల్ప విధి:

మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే... (మీరున్న ప్రదేశం, ఉదా: హైదరాబాద్ క్షేత్రే), అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధన నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతువు, ఆశ్వయుజ మాసే, శుక్ల పక్షే... (ఆనాటి తిథి, వారం, నక్షత్రం చెప్పాలి), ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్... (మీ గోత్రం) గోత్రోద్భవస్య,

(మీ పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య, మమ సకుటుంబస్య, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి / శరన్నవరాత్రోత్సవ ప్రయుక్త శుభసమయే క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల సౌభాగ్య, సుమంగళీత్వ సిద్ధ్యర్థం, దీర్ఘ సుమంగళీ యోగ ప్రాప్త్యర్థం, భర్తుః దీర్ఘాయుష్య ప్రాప్త్యర్థం, సంతాన సౌభాగ్య, సత్పుత్ర, పౌత్ర సత్పుత్రికా, పౌత్రిక, ప్రాప్త్యర్థం, తేశాం విద్యా బుద్ధి జయ కీర్తి సిద్ధ్యర్థం, గృహే సదా లక్ష్మీ కటాక్ష, స్థిర లక్ష్మీ నివాసార్థం, సర్వాపన్నివారణార్థం, పరస్పర అనుకూల్య దాంపత్య ఫల సిద్ధ్యర్థం, 

శ్రీ లలితా త్రిపురసుందరీ (శ్రీ త్రిశక్తి) ప్రసాదేన సర్వాభీష్ట సిద్ధ్యర్థం, 

​శ్రీ మహాకాళీ ప్రీత్యర్థం – సమస్త భయ-దోష నివారణార్థం, శత్రుజయ, మనోధైర్య సిద్ధ్యర్థం,

శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం – సకల సౌభాగ్య, దీర్ఘ మాంగల్య, గృహే స్థిర లక్ష్మీ నివాసార్థం, అష్టైశ్వర్య సమృద్ధ్యర్థం,

శ్రీ మహాసరస్వతీ ప్రీత్యర్థం – విద్యా బుద్ధి ప్రజ్ఞా వికాసార్థం, సద్జ్ఞాన మోక్ష సిద్ధ్యర్థం,

​మహాకాళీ-మహాలక్ష్మీ-మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణీ శ్రీ లలితా పరమేశ్వరీ ప్రీత్యర్థం,

శ్రీ దుర్గా-లక్ష్మీ-సరస్వతీ దేవతా ముద్దిశ్య, తద్దేవతా ప్రసాదేన సర్వాభీష్ట ఫలసిద్ధ్యర్థం,

యథాశక్తి, యథాసంభవ ద్రవ్యైః, యథామిలిత ముత్తైదువ సహిత, త్రిశక్తి స్వరూప కుంకుమార్చన పూజాం కరిష్యే ||

తదంగత్వేన నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం శ్రీ హరిద్ర గణపతి పూజాం కరిష్యే || తదంగత్వేన కలిశారాదనం కరిష్యే ||..

(చేతిలో అక్షతలు, పువ్వు, ఉద్ధరిణెతో నీరు తో పళ్ళెం లోవదలాలి)


రక్షాబంధన మంత్రం (అత్యంత ప్రసిద్ధమైనది):

(ఈ క్రింది మంత్రం చదువుతూ తమలపాకు లేదా మామిడాకు లేదా కంకణ దారం ను చేతిలో అక్షింతలు కానీ నారీకేళము లేదా ఏదైనా ఫలం పట్టుకుని మగవారికి కుడి చేతికి ముత్తైదువులకు ఎడమ చేతికి కట్టుకోవలసి ఉంటుంది)

యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః |

తేన త్వామనుబధ్నామి రక్షే మా చల మా చల ||

(తాత్పర్యం: అత్యంత పరాక్రమవంతుడైన రాక్షసరాజైన బలిచక్రవర్తి సైతం ఏ రక్షాసూత్రం చేత ధర్మబద్ధుడై బంధింపబడ్డాడో, అటువంటి దివ్య రక్షాసూత్రాన్ని నీకు కడుతున్నాను. ఓ రక్షా! నీవు చలించకుండా ఈతనికి సదా రక్షణగా ఉండు).

కలశ పూజ:

కలశంలో ద్రవ్యాలు వేస్తూ చదివే మంత్రాలు:


గంధం వేస్తూ:

ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ | ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ||

కలశే గంధం నిక్షిపామి ||


అక్షతలు వేస్తూ:

ఓం ఆయనే తే పరాయణే దూర్వా రోహంతు పుష్పిణీః | హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే ||

కలశే అక్షతాన్ నిక్షిపామి ||


పుష్పం వేస్తూ:

ఓం కామోఽకార్షీన్నమః కామః కరోతి న |కలశే పుష్పం నిక్షిపామి ||


ఫలం / పోకచెక్క వేస్తూ:

ఓం యాః ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః | బృహస్పతి ప్రసూతాస్తా నో ముంచంత్వగ్ం హసః ||

కలశే పూగీఫలం నిక్షిపామి ||


నాణెం (సువర్ణం / ద్రవ్యం) వేస్తూ:

ఓం హిరణ్యరూపః స హిరణ్యసందృగపాం నపాత్సేదు హిరణ్యవర్ణః |

హిరణ్యయేభ్యః పరి యోనేభ్యో నిషద్యా హిరణ్యదా దదత్యన్నమస్మై ||

కలశే సువర్ణపుష్పం (ద్రవ్యం) నిక్షిపామి ||


హస్తమాచ్ఛాద్య మంత్రాలు (కలశంపై చేయి ఉంచి పఠించాల్సినవి)

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః |

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః ||

కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా |

ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః |

అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః ||


ఆత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టికరీ తథా |

ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః ||


గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి |

నర్మదే సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు ||


(వరుణ వేద మంత్రం - స్వర సహితం)

ఓం తత్త్వా॑ యామి॒ బ్రహ్మ॑ణా॒ వంద॑మాన॒స్తదా శా᳚స్తే॒ యజ॑మానో హ॒విర్భిః॑ |

అహే॑డమానో వరు॑ణే॒హ బో॒ధ్యురు॑శగ్ంస॒ మా న॒ ఆయుః॒ ప్ర మో॑షీః ||

ఓం జలబింబాయ విద్మహే నీలపురుషాయ ధీమహి |

తన్నో వరుణః ప్రచోదయాత్ ||

అస్మిన్ కలశే వరుణం ధ్యాయామి, ఆవాహయామి |

సకల పూజార్థే అక్షతాన్ సమర్పయామి ||


సంప్రోక్షణ (శుద్ధి చేయడం)

కలశంలోని పవిత్ర జలంలో ఒక పువ్వును ముంచి ఈ క్రింది మంత్రం చెబుతూ తీర్థాన్ని చల్లాలి:

ఓం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవమాత్మానం చ ప్రోక్షయేత్ ||

పూజా ద్రవ్యాలపై చల్లాలి.

మండపం, విగ్రహం/కలశంపై చల్లాలి.

పూజలో కూర్చున్న వారిపై మరియు తనపై చల్లుకోవాలి.


(అనంతరం పసుపు గణపతి పూజ ప్రారంభించాలి)

ముఖ్యమైన కుంకుమార్చనకు ముందు విఘ్నాలు తొలగడానికి తమలపాకుపై పసుపుతో గణపతిని చేసి నిర్వహించే సూక్ష్మ గణపతి పూజా విధి:

౧. ఆవాహన & ధ్యానం

పసుపు గణపతిపై అక్షింతలు సమర్పిస్తూ:

ఓం గం గణపతయే నమః |

ఓం శ్రీ మహాగణపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి |

రత్నసింహాసనార్థే అక్షతాన్ సమర్పయామి ||


౨. షోడశోపచార సూక్ష్మ విధి (జలం & పుష్పాలతో)

ఉద్ధరిణెతో జలం, అక్షింతలు, పువ్వులు స్వామికి సమర్పించాలి:

 * పాద్యం: ఓం శ్రీ మహాగణపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. (నీటి బిందువును చల్లాలి)

 * అర్ఘ్యం: ఓం శ్రీ మహాగణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. (నీటి బిందువును చల్లాలి)

 * ఆచమనీయం: ఓం శ్రీ మహాగణపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. (నీటి బిందువును చల్లాలి)

 * స్నానం: ఓం శ్రీ మహాగణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. (పువ్వుతో శుద్ధజలం చల్లాలి)

 * వస్త్రం & యజ్ఞోపవీతం: ఓం శ్రీ మహాగణపతయే నమః వస్త్రార్థం, యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. (పసుపు అక్షింతలు లేదా పత్తితో చేసిన వత్తి  సమర్పించాలి)

 * గంధం & కుంకుమ: ఓం శ్రీ మహాగణపతయే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి, హరిద్రా-కుంకుమ తిలకం ధారయామి. (గంధం, కుంకుమ పెట్టాలి)

 * పుష్పార్చన: ఓం శ్రీ మహాగణపతయే నమః పుష్పైః పూజయామి. (పువ్వులు సమర్పించాలి)

౩. అంగపూజ & లఘు నామావళి

పువ్వులు లేదా అక్షింతలు వేస్తూ చదవాల్సిన ముఖ్య నామాలు:

> ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః |ఓం కపిలాయ నమః | ఓం గజకర్ణకాయ నమః | ఓం లంబోదరాయ నమః | ఓం వికటాయ నమః | ఓం విఘ్నరాజాయ నమః | ఓం గణాధిపాయ నమః | ఓం ధూమ్రకేతవే నమః | ఓం గణాధ్యక్షాయ నమః | ఓం ఫాలచంద్రాయ నమః | ఓం గజాననాయ నమః | ఓం వక్రతుండాయ నమః | ఓం శూర్పకర్ణాయ నమః | ఓం హేరంబాయ నమః | ఓం స్కందపూర్వజాయ నమః || ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః || శ్రీ మహాగణపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి ||


౪. ధూప, దీప, నైవేద్యం & తాంబూలం


 * ధూపం: ఓం శ్రీ మహాగణపతయే నమః ధూపం ఆఘ్రాపయామి. (అగరుబత్తి చూపించాలి)

 * దీపం: ఓం శ్రీ మహాగణపతయే నమః దీపం దర్శయామి. (దీపం చూపించాలి)

 * నైవేద్యం: బెల్లం ముక్క లేదా పండు సమర్పిస్తూ:

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ || సత్యం త్వర్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి ||

ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా ||

   > శ్రీ మహాగణపతయే నమః గుడోపహార నైవేద్యం సమర్పయామి ||


 * తాంబూలం & నీరాజనం: ఓం శ్రీ మహాగణపతయే నమః తాంబూలం సమర్పయామి, ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. (హారతి ఇవ్వాలి)

ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా |

నీరాజనం మయా దత్తం గృహాణ గణనాయక ||

ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి |

తన్నో దంతిః ప్రచోదయాత్ ||

ఓం శ్రీ మహాగణపతయే నమః |

దివ్య ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి ||

నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ||

(హారతి కళ్లకు అద్దుకుని, భక్తులందరికీ నివేదించాలి).


౫. ప్రార్థన & అక్షింతల సమర్పణ

రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ:

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||

అనయా మయా కృత పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతిః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ||

తలమీద అక్షింతలు వేసుకుని, తదుపరి ప్రధాన శ్రీ త్రిశక్తి కుంకుమార్చన క్రతువును ప్రారంభించాలి.


త్రిశక్తి ఆవాహన & కుంకుమార్చన ప్రారంభ శ్లోకాలు:

కుంకుమ చేతిలోకి తీసుకుని అమ్మవార్లను స్మరిస్తూ పఠించాల్సిన మంత్రాలు:

ఓం దుర్గాయై నమః – దుర్గాదేవీం ఆవాహయామి |

(శక్తిని, రక్షణను, సకల భయ నివారణను ప్రార్థిస్తూ)

ఓం మహాలక్ష్మ్యై నమః – మహాలక్ష్మీం ఆవాహయామి |

(ధన, ధాన్య, అష్టైశ్వర్య సౌభాగ్యాలను ప్రార్థిస్తూ)

ఓం మహాసరస్వత్యై నమః – మహాసరస్వతీం ఆవాహయామి |

(విద్యా, జ్ఞాన, బుద్ధి వికాసాలను ప్రార్థిస్తూ)


ఓం త్రిశక్తి స్వరూపిణ్యై నమః |

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే |

శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ||

మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యో నమః – కుంకుమ పూజాం సమర్పయామి ||


షోడశోపచార పూజా విధానం

త్రిశక్తి (మహాకాళి/దుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి) 

౧. ధ్యానం & ఆవాహనం

క్రియ: చేతిలో అక్షతలు, పువ్వులు తీసుకుని అమ్మవారి రూపాలను మనసులో నిలిపి పళ్లెంలో సమర్పించాలి.

 * మంత్రం:

  ౧. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ రూపిణీమ్ | శ్రీచక్రరాజ నిలయాం పరాంబికామహం భజే ||

   ఓం మహాకాళీ-మహాలక్ష్మీ-మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణ్యై నమః – ధ్యాయామి, ఆవాహయామి ||

   

౨. ఆసనం

 * క్రియ: అమ్మవారికి ఆసనంగా కొన్ని అక్షతలు వేయాలి.

 * మంత్రం:

    అనేకరత్న సంయుక్తం నానామణి సమన్వితమ్ | ఇదం హేమమయం దివ్యం ఆసనం ప్రతిగృహ్యతామ్ ||

    త్రిశక్తి స్వరూపిణ్యై నమః – రత్నసింహాసనం సమర్పయామి ||

   

౩. పాద్యం

 * క్రియ: పాదాలు కడగడానికి ఉద్ధరిణెతో నీటిని పాత్రలో విడవాలి.

 * మంత్రం:

   గంగాది సర్వతీర్థేభ్యో మయా ప్రార్థనయా హృతమ్ | తోయమేతత్ సుఖస్పర్శం పాద్యార్థం ప్రతిగృహ్యతామ్ ||

    త్రిశక్తి స్వరూపిణ్యై నమః – పాదయోః పాద్యం సమర్పయామి ||

   

౪. అర్ఘ్యం

 * క్రియ: చేతులు కడుక్కోవడానికి ఉద్ధరిణెతో నీటిని సమర్పించాలి.

 * మంత్రం:

 గంధ పుష్పాక్షతైర్యుక్తం అర్ఘ్యం దాస్యామి భక్తితః | గృహాణ వరదే దేవి త్రిశక్తి పరమేశ్వరి ||

 త్రిశక్తి స్వరూపిణ్యై నమః – హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ||

  

౫. ఆచమనీయం

 * క్రియ: ముఖ ప్రక్షాళన కొరకు మరో ఉద్ధరిణె నీటిని విడవాలి.

 * మంత్రం:

    కర్పూరైలాలవంగాది వాసితం నిర్మలం జలమ్ | గృహాణ ముఖపద్మార్థం ఆచమ్యం పరమేశ్వరి ||

    త్రిశక్తి స్వరూపిణ్యై నమః – ముఖే ఆచమనీయం సమర్పయామి ||

   

౬. స్నానం (శుద్ధోదక స్నానం)

 * క్రియ: పసుపు గౌరమ్మలపై లేదా చిత్రపటంపై పువ్వుతో నీటిని సున్నితంగా చిలకరించాలి.

 * మంత్రం:

    మందాకిన్యాస్తు యత్తోయం సర్వపాపహరం శుభమ్ | స్నానార్థం తే ప్రయచ్ఛామి త్రిశక్తి పరమేశ్వరి ||

    త్రిశక్తి స్వరూపిణ్యై నమః – శుద్ధోదక స్నానం సమర్పయామి |

    (స్నానానంతరం పునరాచమనీయం సమర్పయామి)

    

౭. వస్త్రం & ఉపవీతం

 * క్రియ: పసుపు రాసిన దూది వస్త్రాలు (లేదా అక్షతలు) సమర్పించాలి.

 * మంత్రం:

    పట్టాంబర సమాయుక్తం నానాచిత్రైర్విరాజితమ్ | వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ పరమేశ్వరి ||

    త్రిశక్తి స్వరూపిణ్యై నమః – వస్త్రోపవస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి ||

   

౮. గంధం & సౌభాగ్య ద్రవ్యాలు

 * క్రియ: గంధం, పసుపు, కుంకుమ, సిందూరం సమర్పించాలి.

 * మంత్రం:

    శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరమ్ | విలేపనం సురశ్రేష్ఠే ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||

    హరిద్రాం కుంకుమం చైవ కజ్జలం చ విలేపనమ్ | సౌభాగ్యద్రవ్య సహితం గంధం సమర్పయామి ||

   

౯. పుష్పం & అక్షతలు

 * క్రియ: ఎరుపు రంగు పూలు, తామరలు, మరియు అక్షతలు సమర్పించాలి.

 * మంత్రం:

    మల్లికాజాతి కుసుమైః కేతకీ చంపకైస్తథా | పున్నాగైర్భిల్వపత్రైశ్చ పూజయామి జగన్మయీమ్ ||

   త్రిశక్తి స్వరూపిణ్యై నమః – పుష్పాణి, అక్షతాన్ సమర్పయామి ||


శ్రీ లలితా త్రిశక్తి అంగపూజ

(కుంకుమ లేదా అక్షతలు చేతిలోకి తీసుకుని, ఆయా నామాన్ని చెబుతూ అమ్మవారి పాదాల వద్ద లేదా శ్రీచక్రం/చిత్రపటం వద్ద సమర్పించాలి)

 * ఓం లలితాయై నమః – పాదౌ పూజయామి (పాదాలను పూజిస్తున్నాను)

 * ఓం కామేశ్వర్యై నమః – గుల్ఫౌ పూజయామి (చీలమండలను పూజిస్తున్నాను)

 * ఓం కాలరాత్ర్యై నమః – జంఘే పూజయామి (పిక్కలను పూజిస్తున్నాను)

 * ఓం మహాబలాయై నమః – జానునీ పూజయామి (మోకాళ్లను పూజిస్తున్నాను)

 * ఓం చండికాయై నమః – ఊరూ పూజయామి (తొడలను పూజిస్తున్నాను)

 * ఓం సర్వేశ్వర్యై నమః – కటిం పూజయామి (నడుము భాగాన్ని పూజిస్తున్నాను)

 * ఓం పద్మాక్ష్యై నమః – నాభిం పూజయామి (నాభి స్థానాన్ని పూజిస్తున్నాను)

 * ఓం కామరూపిణ్యై నమః – ఉదరం పూజయామి (ఉదరాన్ని పూజిస్తున్నాను)

 * ఓం పరమేశ్వర్యై నమః – హృదయం పూజయామి (హృదయాన్ని పూజిస్తున్నాను)

 * ఓం మాతంగ్యై నమః – స్తనౌ పూజయామి (వక్షఃస్థలాన్ని పూజిస్తున్నాను)

 * ఓం భువనేశ్వర్యై నమః – కంఠం పూజయామి (కంఠాన్ని పూజిస్తున్నాను)

 * ఓం స్కందమాత్రే నమః – స్కంధౌ పూజయామి (భుజాలను పూజిస్తున్నాను)

 * ఓం సుబాహవే నమః – బాహూన్ పూజయామి (చేతులను పూజిస్తున్నాను)

 * ఓం వరప్రదాయై నమః – హస్తాన్ పూజయామి (అరచేతులను పూజిస్తున్నాను)

 * ఓం శుభాననాయై నమః – ముఖం పూజయామి (ముఖాన్ని పూజిస్తున్నాను)

 * ఓం సరస్వత్యై నమః – జిహ్వాం పూజయామి (నాలుకను పూజిస్తున్నాను)

 * ఓం బింబోష్ఠ్యై నమః – దంతాంశ్చ ఓష్ఠౌ పూజయామి (దంతాలు, పెదవులను పూజిస్తున్నాను)

 * ఓం సునాసికాయై నమః – నాసికాం పూజయామి (నాసికను/ముక్కును పూజిస్తున్నాను)

 * ఓం విమలాక్ష్యై నమః – నేత్రే పూజయామి (కన్నులను పూజిస్తున్నాను)

 * ఓం సుశ్రోత్రాయై నమః – కర్ణౌ పూజయామి (చెవులను పూజిస్తున్నాను)

 * ఓం శారదాయై నమః – లలాటం పూజయామి (నుదుటిని పూజిస్తున్నాను)

 * ఓం శాంభవ్యై నమః – శిరః పూజయామి (శిరస్సును పూజిస్తున్నాను)

 * ఓం శ్రీ లలితా త్రిపురసుందర్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి 

(సమస్త అంగములను పూజిస్తున్నాను)


సమర్పణ శ్లోకం:

నమః సర్వాంగ సుందర్యై సర్వశక్తి స్వరూపిణ్యై | అంగపూజాం గృహాణేదం సర్వాభీష్టప్రదాయినీ ||

 శ్రీ లలితా త్రిశక్తి దేవతాభ్యో నమః – దివ్య అంగపూజాం సమర్పయామి ||


"త్రిపుర సుందరి" నామ తత్త్వం (త్రిపుర తాపిన్యుపనిషత్)

ఉపనిషత్తుల ప్రకారం అమ్మవారి నామమైన త్రిపుర లోని 'త్రి' తత్త్వమే త్రిశక్తులను సూచిస్తుంది:

త్రిగుణాలు: తమోగుణం (మహాకాళి/దుర్గ), రజోగుణం (మహాలక్ష్మి), సత్త్వగుణం (మహాసరస్వతి) — 

ఈ మూడూ ఏకమైన పరబ్రహ్మ స్వరూపమే త్రిపురసుందరి.

త్రిశక్తులు: ఇచ్చాశక్తి (మహాకాళి), క్రియాశక్తి (మహాలక్ష్మి), జ్ఞానశక్తి (మహాసరస్వతి).

శ్రీచక్ర బిందుపీఠం: శ్రీచక్రంలోని త్రికోణంలో మూడు కోణాలు కాళి, లక్ష్మి, సరస్వతులను సూచిస్తాయి; 

వాటి మధ్యలోని బిందు స్థానమే లలితా మహా త్రిపురసుందరి.

అందుకే ఏ ఒక్కరిని విడిగా పూజించలేని సమయంలో కేవలం శ్రీ లలితా అష్టోత్తరం లేదా లలితా సహస్రనామం చదివితే ముగ్గురమ్మలనూ ఒకేసారి పూజించిన సంపూర్ణ ఫలం దక్కుతుందని శాస్త్ర నిర్ణయం.


శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి:

ధ్యాన శ్లోకం:

 అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ | అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీమ్ ||

నామావళి:

 * ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమః

 * ఓం హిమాచల మహాంశుక పల్లవాయై నమః

 * ఓం త్రయీ రక్షా సరక్షిత దేహలతాయై నమః

 * ఓం కుంకుమార్చిత చరణాయై నమః

 * ఓం రత్ననూపుర శోభితాయై నమః

 * ఓం కామేశ్వర ప్రాణనాథాయై నమః

 * ఓం భవభీతి వినాశిన్యై నమః

 * ఓం కామితార్థ ప్రదాయిన్యై నమః

 * ఓం కనకాంగద భూషితాయై నమః 9

 * ఓం శ్రీమత్పరమేశ్వర వల్లభాయై నమః

 * ఓం దక్షయజ్ఞ వినాశిన్యై నమః

 * ఓం త్రిపురసుందర్యై నమః

 * ఓం చంద్రమండల మధ్యస్థాయై నమః

 * ఓం బిందుమండల వాసిన్యై నమః

 * ఓం శివదూత్యై నమః

 * ఓం శ్రీవిద్యాయై నమః

 * ఓం త్రిపురేశ్వర్యై నమః

 * ఓం సుభగాయై నమః 18

 * ఓం శుభదాత్ర్యై నమః

 * ఓం సర్వమంగళ రూపాయై నమః

 * ఓం హ్రీంకార్యై నమః

 * ఓం చారుహాసిన్యై నమః

 * ఓం త్రినేత్రాయై నమః

 * ఓం త్రైలోక్య సుందర్యై నమః

 * ఓం లలితాయై నమః

 * ఓం చిద్రూపాయై నమః

 * ఓం పరమానందదాయకాయై నమః 27

 * ఓం మహాలక్ష్మ్యై నమః

 * ఓం మహాసరస్వత్యై నమః

 * ఓం దుర్గాయై నమః

 * ఓం భవాన్యై నమః

 * ఓం శాంభవ్యై నమః

 * ఓం శర్వాణ్యై నమః

 * ఓం జగన్మాత్రే నమః

 * ఓం జగత్కల్యాణకారకాయై నమః

 * ఓం దారిద్ర్యనాశిన్యై నమః 36

 * ఓం పాపనాశిన్యై నమః

 * ఓం రోగహంత్య్రై నమః

 * ఓం ఆయుర్వర్ధిన్యై నమః

 * ఓం యశోవర్ధిన్యై నమః

 * ఓం పుత్రపౌత్ర ప్రదాయిన్యై నమః

 * ఓం సౌభాగ్యదాయిన్యై నమః

 * ఓం పతివ్రతా ధర్మవర్ధిన్యై నమః

 * ఓం శ్రీచక్ర రాజనిలయాయై నమః

 * ఓం కాదంబవనవాసిన్యై నమః 45

 * ఓం పద్మప్రియాంగనాయై నమః

 * ఓం పద్మనేత్రాయై నమః

 * ఓం పద్మసంభవరూపాయై నమః

 * ఓం పరాశక్త్యై నమః

 * ఓం మూలప్రకృత్యై నమః

 * ఓం ఈశ్వర్యై నమః

 * ఓం సర్వజ్ఞాయై నమః

 * ఓం సర్వశక్తిసమన్వితాయై నమః

 * ఓం సర్వలోక పూజితాయై నమః 54

 * ఓం సర్వదేవతామయాయై నమః

 * ఓం సర్వవ్యాపిన్యై నమః

 * ఓం కళాత్మికాయై నమః

 * ఓం వేదాంతవేద్యాయై నమః

 * ఓం భక్తవత్సలాయై నమః

 * ఓం కారుణ్యహృదయాయై నమః

 * ఓం చింతామణిగృహాంతఃస్థాయై నమః

 * ఓం పంచప్రేతాసనాసీనాయై నమః

 * ఓం మహారాజ్ఞ్యై నమః 63

 * ఓం దేవకార్యసముద్యతాయై నమః

 * ఓం భండాసురవధోద్యుక్తాయై నమః

 * ఓం దైత్యసేనావిమర్దిన్యై నమః

 * ఓం వహ్నిమండలవాసిన్యై నమః

 * ఓం సూర్యమండలవాసిన్యై నమః

 * ఓం సోమమండలవాసిన్యై నమః

 * ఓం చిదగ్నికుండసంభూతాయై నమః

 * ఓం దేవకార్యవిధాయిన్యై నమః

 * ఓం కరుణారససంపూర్ణాయై నమః 72

 * ఓం కామితార్థఫలప్రదాయై నమః

 * ఓం రక్తవర్ణాయై నమః

 * ఓం రక్తాంబరధరాయై నమః

 * ఓం రక్తగంధానులేపనాయై నమః

 * ఓం రక్తపుష్పప్రియాయై నమః

 * ఓం దాడిమీకుసుమప్రభాయై నమః

 * ఓం మాణిక్యమకుటోపేతాయై నమః

 * ఓం రత్నకాంచీవిభూషితాయై నమః

 * ఓం చంద్రరేఖోజ్జ్వలత్పాలాయై నమః 81

 * ఓం కస్తూరీతిలకాంచితాయై నమః

 * ఓం మందస్మితముఖాంభోజాయై నమః

 * ఓం దరహాసవిరాజితాయై నమః

 * ఓం ముక్తాహారలతాయుక్తాయై నమః

 * ఓం రత్నగ్రీవేయభూషితాయై నమః

 * ఓం మాతృకారూపిణ్యై నమః

 * ఓం వర్ణమాలికాయై నమః

 * ఓం అక్షరరూపాయై నమః

 * ఓం మంత్రస్వరూపిణ్యై నమః 90

 * ఓం యంత్రరూపిణ్యై నమః

 * ఓం తంత్రరూపిణ్యై నమః

 * ఓం గుహ్యాతిగుహ్యగోప్త్ర్యై నమః

 * ఓం భక్తసౌభాగ్యదాయిన్యై నమః

 * ఓం నిత్యానందస్వరూపిణ్యై నమః

 * ఓం సచ్చిదానందరూపిణ్యై నమః

 * ఓం బ్రహ్మవిష్ణుశివపూజితాయై నమః

 * ఓం పరబ్రహ్మమహిష్యై నమః

 * ఓం సర్వాపద్వినివారిణ్యై నమః 99

 * ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః

 * ఓం భవసాగరతారణ్యై నమః

 * ఓం రాజరాజేశ్వర్యై నమః

 * ఓం శ్రీలలితాంబికాయై నమః

 * ఓం శ్రీమహాతిపురసుందర్యై నమః

 * ఓం సర్వాభీష్టఫలప్రదాయై నమః

 * ఓం అఖండసౌభాగ్యవత్యై నమః

 * ఓం దీర్ఘసుమంగల్యాః ప్రదాయిన్యై నమః

 * ఓం శ్రీ లలితా పరమేశ్వర్యై నమః 108


సమర్పణ శ్లోకం:

 నానా సుగంధ పుష్పాణి యథాకాలోద్భవాని చ | కుంకుమేన సమాయుక్తం పూజార్థం ప్రతిగృహ్యతామ్ ||

 ఇతి శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి కుంకుమార్చనం సమర్పయామి ||


౧౦. ధూపం

 * క్రియ: అగరుబత్తులు వెలిగించి చూపించాలి.

 * మంత్రం:

వనస్పతిరసోద్భూతో గంధాఢ్యో గంధ ఉత్తమః | ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ||

    త్రిశక్తి స్వరూపిణ్యై నమః – ధూపమాఘ్రాపయామి ||

   

౧౧. దీపం

 * క్రియ: నేతి దీపం లేదా నూనె దీపాన్ని చూపించాలి.

 * మంత్రం:

    సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా | దీపం గృహాణ దేవేశి త్రైలోక్య తిమిరాపహమ్ ||

    త్రిశక్తి స్వరూపిణ్యై నమః – దీపం దర్శయామి ||

   

౧౨. నైవేద్యం

 * క్రియ: పండ్లు, తీపి పదార్థాలు, వడపప్పు-పానకం నైవేద్యంగా ఉంచి చేతితో సమర్పించాలి.

 * మంత్రం:

    శర్కరాఖండ ఖాద్యాని దధిక్షీర ఘృతాని చ | ఆహారార్థం ప్రదాస్యామి నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||

   (నీరు చుట్టూ తిప్పుతూ)

    ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ || సత్యం త్వర్తేన పరిషించామి | అమృతమస్తు, అమృతోపస్తరణమసి |

   ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా |

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అమృతాపిధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి ||

   

౧౩. తాంబూలం

 * క్రియ: తమలపాకులు, పోకచెక్కలు, సున్నం సమర్పించాలి.

 * మంత్రం:

   పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్ | కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||

    త్రిశక్తి స్వరూపిణ్యై నమః – తాంబూలం సమర్పయామి ||

   

౧౪. నీరాజనం (మంగళహారతి)

 * క్రియ: కర్పూర హారతి వెలిగించి అందరూ లేచి నిలబడి దర్శించాలి.


శ్రీ కర్పూర గౌర ప్రార్థన

​కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారమ్ |

సదా వసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి ||

​౩. శ్రీదేవీ/త్రిశక్తి నీరాజన శ్లోకం

​సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే |

శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ||

నీరాజనం సుమంగళం జ్వాలామాలా విభూషితమ్ |

గృహాణ వరదే దేవి త్రిశక్తి పరమేశ్వరి ||


​ఓం శ్రీ లలితా త్రిపురసుందరీ (శ్రీ మహాకాళీ-మహాలక్ష్మీ-మహాసరస్వతీ) దేవ్యై నమః |

ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి ||

నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ||

​(అనంతరం హారతిని కళ్లకు అద్దుకుని, భక్తులకు ఇవ్వాలి).

   

౧౫. మంత్రపుష్పం

 * క్రియ: చేతుల్లో పూలు, అక్షతలు తీసుకుని నిలబడి పఠించి సమర్పించాలి.

 * మంత్రం:

    ఓం యోఽపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి | చంద్రమా వా అపాం పుష్పమ్ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ||

   ​శ్రీ దుర్గా గాయత్రి:

​ఓం మహాదేవ్యై చ విద్మహే దుర్గాయై చ ధీమహి |

తన్నో దేవీ ప్రచోదయాత్ ||

శ్రీ మహాలక్ష్మీ గాయత్రి:

​ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి |

తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||

శ్రీ మహాసరస్వతీ గాయత్రి:

​ఓం వాగ్దేవ్యై చ విద్మహే కామరాజాయ ధీమహి |

తన్నో దేవీ ప్రచోదయాత్ ||

శ్రీ లలితా దేవి గాయత్రి:

​ఓం మహాదేవ్యై చ విద్మహే లలితాయై చ ధీమహి |

తన్నో దేవీ ప్రచోదయాత్ ||

​దేవీ స్తుతి:

​యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

​సమర్పణ వాక్యం:

చేతిలో అక్షింతలు, పువ్వులు ఉంచుకుని వీటిని పఠించిన తర్వాత ఈ వాక్యంతో అమ్మవారి పాదాల వద్ద సమర్పించాలి:

​ఓం శ్రీ లలితా పరమేశ్వర్యై నమః |

శ్రీ మహాకాళీ-మహాలక్ష్మీ-మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణ్యై నమః |

నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి ||


౧౬. ప్రదక్షిణ నమస్కారాలు & క్షమా ప్రార్థన

 * క్రియ: తమ చుట్టూ తాము మూడుసార్లు ఆత్మప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి.

 * మంత్రం:

యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ | తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||

పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః | త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే || 

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగన్మయీ ||

త్రిశక్తి స్వరూపిణ్యై నమః – ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ||

శ్రీ లలితా పరమేశ్వరి సంపూర్ణ మంగళహారతి

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే | శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ||

ఓం శ్రీ లలితా పరమేశ్వర్యై నమః – దివ్య మంగళ ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి ||

౨. వాయన దానం (సువాసినీ పూజ)

ముత్తైదువులు సామూహికంగా కూర్చున్నప్పుడు ఒకరికొకరు వాయనం ఇచ్చిపుచ్చుకోవడం అత్యంత ప్రధానమైన ఘట్టం.

 * వాయనం ఇచ్చేటప్పుడు చదివించే శ్లోకం:

    దాత్ర్యై నమః | ప్రతిగ్రహీత్ర్యై నమః ||

    ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ |

    ఇందిరా తారికా ద్వాభ్యాం ఇందిరాయై నమో నమః ||

    ఇదం వాయనం సదక్షిణాకం సోపాయనం త్రిశక్తి స్వరూపిణ్యై బ్రాహ్మణ్యై/సువాసిన్యై తుభ్యమహం సంప్రదదే, న మమ ||

   

 * ముత్తైదువుల పరస్పర సంభాషణ:

   * ఇచ్చే మహిళ: ఇస్తి వాయనం

   * తీసుకునే మహిళ: పుచ్చుకొంటి వాయనం

   * ఇచ్చే మహిళ: వాయనం తీసుకున్నది ఎవరు?

   * తీసుకునే మహిళ: నేను కాదు, సాక్షాత్ గౌరీదేవి (త్రిశక్తి స్వరూపిణి).

   * ఇరువురూ: ముమ్మాటికీ నేనే త్రిశక్తిని


తీర్థ ప్రసాద వితరణ & సంపూర్ణ సమర్పణ క్రమం


౧. సర్వదోష నివారణ & అపరాధ క్షమాపణ స్తోత్రం

చేతుల్లో అక్షతలు, పువ్వులు ఉంచుకుని భక్తితో పఠించాల్సిన ప్రార్థన:

ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ | పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరి ||

 మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి | యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే ||

 అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా | దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ||

 యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ | తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి ||

(చేతిలోని అక్షతలను అమ్మవారి పాదాల వద్ద సమర్పించి సాష్టాంగ ప్రణామం చేయాలి)

౨. బ్రహ్మార్పణం (కార్య సమర్పణ)

ఉద్ధరిణెతో నీటిని చేతిలో పోసుకుని, తాము చేసిన పూజా ఫలాన్ని పరబ్రహ్మ స్వరూపానికి సమర్పిస్తూ పళ్లెంలో విడవాలి:


 యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో యజ్ఞ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ ||


కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ | కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||

అనయా ధ్యాన, ఆవాహనాది షోడశోపచార పూజయా, అంగపూజయా, శ్రీ లలితా త్రిశక్తి (దుర్గా-లక్ష్మీ-సరస్వతీ) అష్టోత్తర శతనామ కుంకుమార్చనేన చ భగవతీ సర్వాత్మికా శ్రీ మహాకాళీ-మహాలక్ష్మీ-మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ రాజరాజేశ్వరీ పరమేశ్వరీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ||

ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు ||

౩. నిర్మాల్య విసర్జన & ఉద్వాసన

 * పసుపు గణపతికి లేదా తాత్కాలికంగా ప్రతిష్ఠించిన గౌరమ్మకు అక్షతలు వేసి కొద్దిగా ఉత్తరం వైపునకు కదిలించాలి:


హఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ | తే హ నాకం మహిమానః సచంత యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః ||


గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వరి | యత్ర బ్రహ్మాదయో దేవాః తత్ర గచ్ఛ హుతాశన ||

    శోభనార్థం పునరాగమనాయ చ ||

   

౪. తీర్థ స్వీకార మంత్రం

తీర్థాన్ని కుడిచేతి బ్రాహ్మీతీర్థం (అరచేతి మధ్య భాగం) ద్వారా స్వీకరిస్తూ చదవాల్సిన మంత్రం:

 అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణమ్ | సమస్తపాపక్షయకరం శ్రీత్రిశక్తి పాదోదకం పావనం శుభమ్ ||

 (మూడుసార్లు తీర్థాన్ని స్వీకరించి, చేతిని శిరస్సుపై తుడుచుకోవాలి)


౫. ప్రసాద స్వీకార & కుంకుమ ధారణ మంత్రం

 * కుంకుమ తిలకం ధరిస్తూ:

  

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే | శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ||


కుంకుమం కాంతిదం దివ్యం కామినీ కామసంభవమ్ | సౌభాగ్యదాయకం శుభ్రం మంగళార్థం దధామ్యహమ్ ||


 * ప్రసాదం స్వీకరిస్తూ:

   మహాప్రసాద జననీ సర్వసౌభాగ్యవర్ధినీ | ఆధివ్యాధిహరా నిత్యం శ్రీప్రసాదం భజామ్యహమ్ ||

   

. వేద ఆశీర్వచనం (పురోహితులు కర్తలకు ఇచ్చే ఆశీస్సులు)


 ఓం స్వస్తి | శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలమ్ | ఆయుష్యస్తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన ||


దీర్ఘ సుమంగళీ భవ | సర్వాభీష్ట సిద్ధ్యర్థం దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు |పుత్రపౌత్రాభివృద్ధిరస్తు | సమస్త సన్మంగళాని భవంతు ||


మంగళ హారతి పాట:

రాగం: శంకరాభరణం / ఆనందభైరవి

తాళం: ఆది

పల్లవి:

జయ మంగళం నిత్య శుభమంగళం

శ్రీ లలితా దేవికి దివ్య మంగళం ||

జయ మంగళం నిత్య శుభమంగళం

శ్రీ త్రిశక్తి మాతకు దివ్య మంగళం ||

చరణం ౧:

కాళికారూపిణికి కష్టహారిణికి

కాలభయ నాశినికి కరుణాలవాలకి

రక్తబీజ సంహారిణి రమణీయ శీలకి

ఇచ్ఛాశక్తి దుర్గకు ఇంపైన హారతి ||జయ మంగళం||

చరణం ౨:

క్షీరాబ్ధి తనయకు శ్రీ మహాలక్ష్మికి

కమలాసనస్థితకు కనకధారావతికి

అష్టైశ్వర్య దాయినికి అమృత స్వరూపిణికి

క్రియాశక్తి దేవికి కర్పూర హారతి ||జయ మంగళం||

చరణం ౩:

హంసవాహినికి అక్షరరూపిణికి

వీణాధారిణికి వీక్షణాధాత్రికి

సర్వ విద్యాప్రదాత్రికి సద్బుద్ధి దాయినికి

జ్ఞానశక్తి వాణికి సమర్పించు హారతి ||జయ మంగళం||

చరణం ౪:

శ్రీచక్ర మధ్యగత శ్రీ లలితాంబకు

రాజరాజేశ్వరికి రక్షించె తల్లికి

సకల సౌభాగ్యములిడు సుమంగళీ దేవికి

భక్తజన రక్షకి బహుకోటి హారతి ||జయ మంగళం||

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

పురోహితులు 

9700007653



No comments:

Post a Comment