Monday, December 14, 2020

పాశురము - మొదటి రోజు

 మొదటి రోజు పాశురము:





మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్

కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్

ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం

కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱైతరువాన్

పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .



మాసములన్నింటిలో మార్గశిరమాసము తన స్వరూపముగా భగవంతుడు చెప్పియున్నాడు. మార్గశిర మాసమనగా మనం అవలంభించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయమని భావము. శ్రీకృష్ణుడనే చెట్టు నీడ ఎక్కువ చల్లగానూ వేడిగానూ ఉండదు. అలాగే వాసుదేవ స్వరూపమైన మార్గశిరమాసం కూడా సమశీతోష్ణముగా ఉండే కాలం. మనం ఉదయం మేల్కొనే కాలం సత్వగుణసంపన్నమైన బ్రాహ్మి ముహూర్తము. అంతేగాక ఈ మార్గశిర మాసంలో పైరుపంటలన్ని విరగ కాసి పండి ఉంటాయి. అతి మనోహరమైన వెన్నెలలు వెదజల్లే శుక్లపక్షంలో పవిత్రమైన రోజున ఈ వ్రతం ప్రారంభించినామని కాలాన్ని ప్రశంసించుట ఇందులోని అర్ధము. భగవంతుని సమాగమమును కోరుకుని ఆతని సంతోషపరచడానికి అతనికిష్టమైన పనులు చేయడానికి ఇది ఉత్తమోత్తమైన సమయమని చెలికత్తెలను మేల్కొని స్నానము చేసి, రండని పిలుస్తూ “ప్రకృతి మండలమందు ఆనందము అనుభవించేవారలారా” అని ఆండాళ్ సంబోధించింది. ఈ పిలుపులో ఒక మహత్తరమైన భావముంది. పరమపదమున నివసించుటకంటే ప్రకృతిమండలమైన గోకులంలో నివసించుట అంటే ఆ భగవంతునితో కలిసి మెలిసి ఉంటూ మహదానందము అనుభవించే మహాద్భాగ్యం లభిస్తుంది అని ఆమె నమ్మిక..

Sunday, November 29, 2020

శ్రీ కేదారేశ్వర పూజ

 

*శ్రీ కేదారేశ్వర పూజ:*


కూర్పు: గోగులపాటి కృష్ణమోహన్

*గణపతి పూజా ప్రారంభం*



శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. (వినాయకుని ధ్యానించవలెను).

(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)

శ్లో||అపవిత్రః పవిత్రోవా

    సర్వావస్థాం గతోపివా|

    యస్మరేత్ పుండరీకాక్షం

    సబాహ్యాభ్యంతరస్శుచిః||

 ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః

(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో - ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)

*దీపం*

ఓం గురుభ్యో నమః

దీపమును వెలిగించి - గంధ పుష్పాదులతో అలంకరించి - దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.

*దీప శ్లోకం :*

ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ

*ఆచమనం (కేశవ నామములు)*

ఓం కేశవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)

ఓం నారాయణాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)

ఓం మాధవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)

ఓం గోవిందాయ నమః (అనుచు - ఎడమ చేతిని కుడి అరచేతితోను)

ఓం విష్ణవే నమః (అనుచు – కుడి చేతిని ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను)


ఓం మధుసూదనాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)

ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటన వేలితో క్రింది పెదవిని)

ఓం వామనాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)

ఓం శ్రీధరాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)

ఓం హృషీకేశాయ నమః (అనుచు ఎడమ అరచేతిపైనను )

ఓం పద్మనాభాయ నమః (అనుచు రెండు పాదముల పైనను)

ఓం దామోదరాయ నమః (అనుచు శిరము పైన నీరు చల్లుకొనవలెను)

ఓం సంకర్షణాయ నమః (అన్ని వేళ్ళు ముడిచి ఆ వేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలెను)

ఓం వాసుదేవాయ నమః (అనుచు ఎడమ ముక్కును)

ఓం ప్రద్యుమ్నాయ నమః (అనుచు కుడి ముక్కును అంగుష్ఠ (బొటనవేలు) తర్జనులతో (చూపుడు వేలు) తాకవలెను)

ఓం అనిరుద్ధాయ నమః (అనుచు ఎడమ కన్నును)

ఓం పురుషోత్తమాయ నమః (అనుచు ఎడమ చేతిని )

ఓం అధోక్షజాయ నమః (అనుచు ఎడమ చేతిని)

ఓం నారసింహాయ నమః (కుడి చేతిని అంగుష్ఠ (బొటనవేలు) అనామికలతో (ఉంగరం వేలు) తాకవలెను

ఓం అచ్యుతాయ నమః (అనుచు నాభిని అంగుష్ఠ కనిష్టికలతో (బొటన చిటికెన వేళ్ళతో) తాకవలెను)

ఓం జనార్దనాయ నమః (అనుచు అరచేతిని హృదయమునకు ఆనించాలి)

ఓం ఉపేంద్రాయ నమః (అనుచు శిరమును కరాగ్రముతో తాకవలెను)

ఓం హరయే నమః (అనుచు బాహు మూలములను వేళ్ళను ముడుచుకొని తాకవలెను)

ఓం శ్రీకృష్ణాయ నమః.

*భూతోచ్ఛాటనము*

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః

ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే 

శ్లోకము చదివి - అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి ప్రక్కనుండి వెనుకకు వేసుకోవాలి.

*అథః ప్రాణాయామః*

(కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి)

ఓం భూః, ఓం భువః , ఓగ్0 సువః, ఓం మహః ఓం జనః, ఓం తపః , ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్

ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, (మూడు సార్లు జపించవలెను)

అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను

*సంకల్పము*

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిస్య,శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే,ప్రథమపాదే జంబూద్వీపే,భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణదిగ్భాగే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .......... నామ సంవత్సరే, దక్షిణాయనే, శరధ్ ఋతౌ, కార్తిక మాసే శుక్ల పక్షే, ...... తథౌ, ఇందు వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపచారైః సంభవితా నియమేన, యావచ్ఛక్తి, శ్రీ మహా గణాధిపతి దేవతా సహిత  శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్ధం, శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్చ ప్రీత్యర్ధం యావచ్ఛక్తి ధ్యానావాహ నాది పూజాం కరిష్యే....

అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.

*కలశ పూజ*

కలశం అంటే నీళ్ళు వుండే పాత్రకు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పము వేసి ఎడమ అరా చేతితో కింద పట్టుకొని కుడిఅరచేతితో పైన పట్టుకుని

తదంగ కలశ పూజాం కరిష్యే...

శ్లో. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః

కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా

ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ

నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః

(కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ) పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య.

శ్లో. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥

*షోడశోపచార పూజ*

ఓం శ్రీమహాగణపతయే నమః :- ధ్యాయామి - ధ్యానం సమర్పయామి. 

(ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)

ఓం శ్రీమహాగణపతయే నమః :- ఆవాహయామి (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)

ఓం శ్రీమహాగణపతయే నమః :- రత్న సింహాసనం సమర్పయామి (కొన్ని అక్షతలు సమర్పించవలెను)

ఓం శ్రీమహాగణపతయే నమః :- పాదయోః పాద్యం సమర్పయామి ( పుష్పం తో నీరు దేవుడి/దేవి కి పాదములు కడగాలి - కడిగినట్టు భావించాలి )

ఓం శ్రీమహాగణపతయే నమః :- హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవికి చేతులు కడగాలి - కడిగినట్టు భావించాలి )

ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవి కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).

ఓం శ్రీమహాగణపతయే నమః :- మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి (పుష్పం తో నీరు దేవుడి / దేవికి మధుపర్క స్నానానికి సమర్పించాలి)

ఓం శ్రీమహాగణపతయే నమః :- శుద్ధోదక స్నానం సమర్పయామి. (పుష్పం తో నీరు దేవుడి. దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి)

ఓం శ్రీమహాగణపతయే నమః :- వస్త్ర యుగ్మం సమర్పయామి - వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి).

ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి (కుంకుమ ధారణ చేయాలి).

ఓం శ్రీమహాగణపతయే నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి – యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి(అక్షతలు వేయాలి).

ఓం శ్రీమహాగణపతయే నమః :- శ్రీ గంధాం ధారయామి - (గంధం సమర్పించాలి).

ఓం శ్రీమహాగణపతయే నమః :- సర్వాభరణాన్ ధారయామి (అక్షతలు సమర్పించాలి).

ఓం శ్రీమహాగణపతయే నమః :- సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పువ్వులు/ అక్షతలు సమర్పించాలి).

ఓం శ్రీమహాగణపతయే నమః :- (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని చదువుకొన వలెను.)

ఓం సుముఖాయ నమః,

ఓం ఏకదంతాయ నమః,

ఓం కపిలాయ నమః,

ఓం గజకర్ణాయ నమః,

ఓం లంబోదరాయ నమః,

ఓం వికటాయ నమః,

ఓం విఘ్నరాజాయ నమః,

ఓం ధూమకేతవే నమః,

ఓం గణాధ్యక్షాయ నమః,

ఓం ఫాలచం ద్రాయ నమః,

ఓం గజాననాయ నమః

ఓం వక్రతుండాయ నమః,

ఓం శూర్పక ర్ణాయ నమః,

ఓం హేరంభాయ నమః,

ఓం స్కందపూర్వజాయ నమః,

ఓం గణాధిపతయే నమః.

షోడశ నామ పూజా సమర్పయామి

16. ఓం శ్రీమహాగణపతయే నమః :- ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి)

17. ఓం శ్రీమహాగణపతయే నమః :- దీపం దర్శయామి (దీపం చూపించాలి).


18. ఓం శ్రీమహాగణపతయే నమః :- నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ

ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)

సత్యం త్వర్తేన పరిషం చామి (మూడు సార్లు పుష్పముతో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో (ఎడమ నుండి కుడి వైపుకు ) తిప్పాలి.

అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి) అమృతోపస్తర ణమసి (అదే నీటిని దేవుడి / దేవి వద్ద ) ఉంచాలి.

దిగువ మంత్రములతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు - బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో ) చూపవలెను.

ఓం ప్రాణాయ స్వాహా-- ఓం అపానాయ స్వాహా -- ఓం వ్యానాయ స్వాహా -- ఓం ఉదానాయ స్వాహా -- ఓం సమానాయ స్వాహా --ఓం పరబ్రహ్మణే నమః --- అంటూ నివేదించవలెను.

ఓం శ్రీమహాగణపతయే నమః :- తాంబూలం సమర్పయామి - తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).

ఓం శ్రీమహాగణపతయే నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).

ఓం శ్రీమహాగణపతయే నమః :- మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).

ఓం శ్రీమహాగణపతయే నమః :- నమస్కారం సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను)

శ్లో యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచా

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే

పాపో౽హం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ

త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప


ఓం శ్రీమహాగణపతయే నమః :- గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక నారోహమావహయామి, అశ్వా నారోహమావహయామి, గజనారోహమావాహయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్, దేవ్యోపచారాన్ సమర్పయామి.

(అంటూ అక్షతలు సమర్పించవలెను).


అనయా, యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ – శ్రీ విఘ్నేశ్వర దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు.

ఓం శ్రీమహాగణపతయే నమః :- (మనం యథా శక్తి చేసిన పూజలకు భగవంతుడు ప్రీతి చెంది మన కోరికలను తీర్చి, మనలను కాపాడాలని కోరుకుంటూ ) 


కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారయణాయేతి సమర్పయామి

ఉద్వాసన

'ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః

తాని ధర్మాణి, ప్రధమాన్యాసన్

తేహ నాకం మహిమానస్ప చంతే

యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః


శ్లో॥ యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు: న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం

మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన, యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే,

అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజాయాచ భగవాన్సర్వాత్మక శ్రీ గణపతి దేవతా స్సుప్రీతో వరదో భవతు.

శ్రీ వినాయక ప్రసాదం శిరసా గుహ్ణామి. నమస్కరించి స్వామి వద్ద నున్న అక్షతలు తీసి తలపై వేసుకొని ప్రసాదమును (అనగా అక్షతలు మాత్రమే) స్వీకరించ వలెను.

*శ్రీ కేదారేశ్వర పూజ:*

కూర్పు: గోగులపాటి కృష్ణమోహన్



శూలం ఢమరుకంచైవ - 

దదానం హస్త యుగ్మకే

కేదారదేవ మీశానం 

ధ్యాయేత్ త్రిపుర ఘాతినమ్,, 

శ్రీ కేదారేశ్వరాయనమః ధ్యానం సమర్పయామి 


కైలాస శిఖరే రమ్యే 

పార్వత్యా స్సహితప్రభో

ఆగచ్చ దేవదేవేశ 

మద్భక్త్యా చంద్రశేఖర 

శ్రీ కేదారేశ్వరాయనమః ఆవాహయామి


సురాసుర శిరోరత్న - 

ప్రదీపిత పదాంబుజ

కేదారదేవ మద్దత్త 

మాసనం ప్రతిగుహ్యతామ్ 

శ్రీ కేదారేశ్వరాయనమః ఆసనం సమర్పయామి


గంగాధర నమస్తేస్తు - 

త్రిలోచన వృషభద్వజ

మౌక్తికాసన సంస్థాయ - 

కేదారాయ నమోనమః 

శ్రీ కేదారేశ్వరాయనమః పాద్యం సమర్పయామి


అర్ఘ్యం గృహాణ భగవన్ - 

భక్త్యాదత్తం మహేశ్వర

ప్రయచ్ఛమే మనస్తుభ్యం - 

భక్తానా మిష్టదాయకం 

శ్రీ కేదారేశ్వరాయనమః ఆర్ఘ్యం సమర్పయామి


మునిభిర్నా రదప్రఖ్యైర్నిత్య 

మాఖ్యాత వైభవః

కేదారదేవ భగవాన్ 

గృహాణా చమనం విభో 

శ్రీ కేదారేశ్వరాయనమః ఆచమనీయం సమర్పయామి


 స్నానం పంచామృతైర్ధేవ 

శుద్ధ శుద్ధోద కైరపి

గృహాణ గౌరీ రమణ 

త్వద్బక్తేన మయార్పితం 

శ్రీ కేదారేశ్వరాయనమః పంచామృతస్నానం సమర్పయామి


నదీజల సమాయుక్తం 

మయాదత్త మనుత్తమం

స్నానం స్వీకురుదేవేశ - 

సదాశివ నమోస్తుతే 

శ్రీ కేదారేశ్వరాయనమః స్నానం సమర్పయామి


 వస్త్ర యుగ్మం సదాశుభ్రం - 

మనోహర మిదం శుభం

దదామి దేవదేవేశ 

భక్త్యేదం ప్రతిగృహ్యాతాం 

శ్రీ కేదారేశ్వరాయనమః వస్త్రయుగ్మం సమర్పయామి


 స్వర్ణ యజ్ఞోపవీతం  

కాంచనం చోత్తరీయకం 

రుద్రాక్షమాలయా యుక్తం - 

దదామి స్వీకురు ప్రభో 

శ్రీ కేదారేశ్వరాయనమః యఙ్ఞోపవీతం సమర్పయామి


సమస్త గ్రంధద్రవ్యాణాం - 

దేవత్వమసి జన్మభూః

భక్త్యాసమర్పితం ప్రీత్యా - 

మయాగంధాది గృహ్యతామ్ 

శ్రీ కేదారేశ్వరాయనమః గంధాన్ ధారయామి


అక్షతో సి స్వభావేన - 

భక్తానామక్షయం పదం

దదాసినాథ మద్దతైరక్షతైః 

స్స్వీయతాం భవాన్ 

శ్రీ కేదారేశ్వరాయ అక్షతాన్ సమర్పయామి


 కల్పవృక్ష ప్రసూవైస్వం 

పూర్వై రభ్యర్చిత 

సురైః కుంకుమైః పార్దివై 

రేభిరిదానీమర్చతాం మయా 

శ్రీ కేదారేశ్వరాయనమః పుష్పాణి పూజయామి 


తతః ఇంద్రాది లోకపాలక

పూజాం కుర్యాత్ శివస్య దక్షిణేభాగే{కుడివైపు} బ్రహ్మణేనమః ఉత్తరభాగే {ఎడమవైపు} విష్ణవేనమః మధ్యే కేదారేశ్వరాయ నమః



*అథాంగ పూజ:*

మహేశ్వరాయనమః   పాదౌ పూజయామి, 

ఈశ్వరాయనమః       జంఘేపూజయామి,

కామరూపాయనమః    జానునీ పూజయామి, 

హరాయనమః          ఊరూ పూజయామి,

త్రిపురాంతకాయనమః  గూహ్యం పూజయామి, 

భవాయనమః           కటిం పూజయామి,

గంగాధరయనమః     నాభిం పూజయామి, 

మహాదేవాయనమః   ఉదరం పూజయామి,

ప్శుపతయేనమః     హృదయం పూజయామి, 

పినాకినేనమః           హస్తాన్ పూజయామి,

శివాయనమః            భుజౌ పూజయమి, 

శితికంఠాయనమః     కంఠం పూజయామి,

విరూపాక్షాయనమః   ముఖం పూజయామి, 

త్రినేత్రాయనమః        నేత్రాణి పూజయామి,

రుద్రాయనమః           లలాటం పూజయామి, 

శర్వాయనమః          శిరః పూజయామి,

చంద్రమౌళయేనమః     మౌళిం పూజయామి, 

పశుపతయేనమః   సర్వాణ్యాంగాని పూజయామి


*కేదారేశ్వర అష్టోత్తర శతనామ పూజ*


ఓం శివాయ నమః

ఓం మహేశ్వరాయ నమః

ఓం శంభవే నమః

ఓం శశిరేఖాయ నమః

ఓం పినాకినే నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం విరూపాక్షాయ నమః

ఓం నీలలోహితాయ నమః

ఓం శూలపాణయే నమః

ఓం విష్ణువల్లభాయ నమః

ఓం అంబికానధాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం శితికంఠాయ నమః

ఓం ఉగ్రాయ నమః

ఓం కామారయే నమః

ఓం గంగాధరాయ నమః

ఓం కాలకాలయ నమః

ఓం భీమాయ నమః

ఓం మృగపాణయే నమః

ఓం కైలాసవాసినే నమః

ఓం కఠోరాయ నమః

ఓం వృశాంకాయ నమః

ఓం భష్మోద్ధూళిత విగ్రహాయ నమః

ఓం సర్వమయాయ నమః

ఓం అశ్వనీరాయ నమః

ఓం పరమాత్మవే నమః

ఓం హవిషే నమః

ఓం సోమాయ నమః

ఓం సదాశివాయ నమః

ఓం వీరభద్రాయ నమః

ఓం కపర్థినే నమః

ఓం శంకరాయ నమః

ఓం ఖట్వాంగినే నమః

ఓం శిపివిష్టాయ నమః

ఓం శ్రీకంఠాయ నమః

ఓం భవాయ నమః

ఓం త్రిలోకేశాయ నమః

ఓం శివాప్రియాయ నమః

ఓం కపాలినే నమః

ఓం అంధకాసురసూదనాయ నమః

ఓం లలాటక్షాయ నమః

ఓం కృపానిధయే నమః

ఓం పరశుహస్తాయ నమః

ఓం జటాధరాయ నమః

ఓం కవచినే నమః

ఓం త్రిపురాంతకాయ నమః

ఓం వృషభారుఢాయ నమః

ఓం సోమప్రియాయ నమః

ఓం త్రయిమూర్తయే నమః

ఓం సర్వఙ్ఞాయ నమః

ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః

ఓం యజ్జమయాయ నమః

ఓం పంచ్వక్త్రాయ నమః

ఓం విశ్వేశ్వరాయ నమః

ఓం గణనాధయ నమః

ఓం పజాపతయే నమః

ఓం దుర్ధర్షాయ నమః

ఓం గిరీశాయ నమః

ఓం భుజంగభూషణాయ నమః

ఓం గిరిధన్వినే నమః

ఓం కృత్తివాసనే నమః

ఓం భగవతే నమః

ఓం మృత్యుంజయాయ నమః

ఓం జగద్వాయ్యపినే నమః

ఓం వ్యోమకేశాయ నమః

ఓం చారువిక్రమాయ నమః

ఓం భూతపతయే నమః

ఓం అహిర్భుద్న్యాయ నమః

ఓం అష్టమూర్తయే నమః

ఓం సాత్వికాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం అజాయ నమః

ఓం మృణాయ నమః

ఓం దేవాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం పూషదంతభిదే నమః

ఓం దక్షాధ్వరహరాయ నమః

ఓం భగనేత్రవిదే నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం అపవర్గప్రదాయ నమః

ఓం తారకాయ నమః

ఓం హిరణ్యరేతసే నమః

ఓం ఆనఘాయ నమః

ఓం భర్గాయ నమః

ఓం గిరిప్రియాయ నమః

ఓం పురారాతయే నమః

ఓం ప్రమధధిపాయ నమః

ఓం సూక్ష్మతనవే నమః

ఓం జగద్గురువే నమః

ఓం మహాసేన జనకాయ నమః

ఓం రుద్రాయ నమః

ఓం స్థాణవే నమః

ఓం దిగంబరాయ నమః

ఓం అనేకాత్మనే నమః

ఓం శుద్ధవిగ్రహాయ నమః

ఓం ఖండపరశువే నమః

ఓం పాశవిమోచకాయ నమః

ఓం పశుపతయే నమః

ఓం మహాదేవాయ నమః

ఓం అవ్యగ్రాయ నమః

ఓం హరాయ నమః

ఓం సహస్రపాదే నమః

ఓం అనంతాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః

శ్రీ కేదారేశ్వర స్వామినే నమః

                                                                                                                                                                                     

శ్రీ కేదారేశ్వర స్వామినేనమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి




*అధసూత్రపూజ:*

ఓం శివాయనమః  ప్రధమగ్రంధిం పూజయామి

ఓం శాంతాయనమః  ద్వితీయగ్రంధిం పూజయామి

ఓం మహాదేవాయనమః  తృతీయగ్రంధిం పూజయామి

ఓం వృషభద్వజాయనమః   చతుర్ధగ్రంధిం పూజయామి

ఓం గౌరీశాయనమః  పంచమగ్రంధిం పూజయామి

ఓం రుద్రాయనమః    షష్ఠగ్రంధిం పూజయామి

ఓం పశుపతయేనమః    సప్తమగ్రంధిం పూజయామి

ఓం భీమాయనమః    అష్టమగ్రంధిం పూజయామి

ఓం త్రయంబకాయనమః   నవమగ్రంధిం పూజయామి

ఓం నీలలోహితాయనమః    దశమగ్రంధిం పూజయామి

ఓం హరాయనమః        ఏకాదశగ్రంధిం పూజయామి

ఓం స్మరహరాయనమః     ద్వాదశగ్రంధిం పూజయామి

ఓం భర్గాయనమః     త్రయోదశగ్రంధిం పూజయామి

ఓం శంభవేనమః            చతుర్ధశగ్రంధిం పూజయామి

ఓం శర్వాయనమః           పంచదశగ్రంధిం పూజయామి

ఓం సదాశివాయనమః     షోఢశగ్రంధిం పూజయామి

ఓం ఈశ్వరాయనమః        సప్తదశగ్రంధిం పూజయామి

ఓం ఉగ్రాయనమః           అష్టాదశగ్రంధిం పూజయామి

ఓం శ్రీకంఠాయనమః        ఏకోన వింశతిగ్రంధిం పూజయామి

ఓం నీలకంఠాయనమః     వింశతిగ్రంధిం పూజయామి

ఓం మృత్యుంజయాయనమః   ఏకవింశతి గ్రంధిం పూజయామి


దశాంగం ధూపముఖ్యంచ - హ్యంగార వినివేశితం

ధూపం సుగంధై రుత్పన్నం - త్వాంప్రీణయతుశంఖర

శ్రీ కేదారేశ్వరాయనమః ధూపమాఘ్రాపయామి


 యోగీనాం హృదయే ష్వేవ - ఙ్ఞానదీపాంకురోహ్యపి

బాహ్యదీపో మయాదత్తో - గృహ్యతాం భక్త గౌరవాత్ 

శ్రీకేదారేశ్వరాయనమః దీపం సమర్పయామి


తైలోక్యమసి నైవేద్యం - తత్తే తృప్తిస్తథాబహిః

నైవేద్యం భక్తవాత్వల్యాద్గృహ్యతాం త్ర్యంబకత్వయా 

శ్రీ కేదారేశ్వరాయనమః మహానైవేద్యం సమర్పయామి


నిత్యానంద స్వరూపస్త్యం - మోగిహృత్కమలేస్థితః

గౌరీశభక్త్యామద్దత్తం - తాంబూలం ప్రతిగృహ్యతామ్ 

శ్రీకేదారేశ్వరాయనమః తాంబూలం సమర్పయామి


 అర్ఘ్యం గృహాణ్ భగవాన్ - భక్త్యాదత్త మహేశ్వర

ప్రయచ్చ మే మనస్తుభ్యం - భక్త్యాన మిష్టదాయక 

శ్రీకేదారేశ్వరాయనమః అర్ఘ్యం సమర్పయామి


 దేవేశ చంద్ర సంకాశం - జ్యోతి సూర్యమివోదితం

భక్త్యాదాస్యామి కర్పూర నీరాజన మిదం శివః శ్రీకేదారేశ్వరాయనమః కర్పూర నీరాజన దర్శయామి


 ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్

నమో హిరణ్యబాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పతయే 

శ్రీ కేదారేశ్వరాయనమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి


భూతేన భువనాదీశ - సర్వదేవాది పూజిత

ప్రదక్షిణం కరోమిత్యాం - వ్రతం మే సఫలం కురు 

శ్రీ కేదారేశ్వరాయనమః ప్రదక్షిణం సమర్పయామి


హరశంభో మహాదేవ - విశ్వేశామరవల్లభ

శివశంకర సర్వాత్మా - నీలకంఠ నమోస్తుతే శ్రీకేదారేశ్వరాయనమః నమస్కారాన్ సమర్పయామి


 ఛత్రమాచ్ఛాదయామి, చామరేణ విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికం నారోహయామి,

సమస్తరాజోపచార,దేవోపచార,శక్త్యుపచార,భక్త్యుపచార,పూజాం సమర్పయామి


అభీష్టసిద్దిం కురమే శివావ్యయ మహేశ్వర ! భక్తానాం మిష్టదానార్ధం మూర్తీకృతకళేభరః

(పూజా తోరము తీసుకొనునపుడు పఠించు మంత్రం)


కేదారదేవదేవేశ భగవన్నంభికా పతే! ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యహం ప్రభో!!


*(తొరము కట్టుకొనుటకు పఠించు మంత్రం)*

ఆయుశ్చ విద్యాం చ తథా సిఖంచ సౌభాగ్యవృద్దిం కుర దేవ దేవ

సంసార ఘోరంబు నిధౌ నిమగ్నం మాంరక్ష కేదార నమో నమస్తే


*(వాయనమిచ్చునపుడు పఠించునది)*


కేదారం ప్రతి గృహ్ణాతు కేదారో వైదరాతి చ కేదారస్తారకో భాభ్యాం కేదారాయ నమో నమః


*ప్రతిమాదాన మంత్రం*


కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధినీ తస్మాదస్యాః ప్రదనేన మమాస్తు శ్రీ రచంచలా!!

శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సిప్రీతః సుప్రసన్నోవరదోభవతు మమ ఇష్టకామ్యార్ధ సిద్దిరస్తు

పూజా విధానము సంపూర్ణము


*శ్రీ కేదారేశ్వర వ్రత కథ*


పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతముని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు

శౌనకాదులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను. సిద్ధ-సాధ్య- కింపురుష-యక్ష-గంధర్వులు శివుని

సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు-మునులు-అగ్ని-

-వాయువు-వరుణుడు-సూర్యచంద్రులు-తారలు-గ్రహాలు-ప్రమదగణాలు-కుమారస్వామి-వినాయకుడు-వీరభద్రుడు-నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల-సాల-తమలా-వకుళ-నరికేళ-చందన-పనస-జంభూ వృక్షములతోను చంపక-పున్నాగ-పారిజాతాది పుష్పాదులతోను

మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశభువనాలు పులకిస్తున్నాయి.. అట్టి ఆనందకోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త

శ్రేష్టుడు ఆనందపులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించుచుండెను. శివుడాతనిని అభినందించి

అంకతలమునగల పార్వతిని వీడి సింహాసనమునుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలగాగల వంది

మాగాదులు శివునకు ప్రదక్షిణంచేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో

మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీ! పరమార్ధ విదులగు

యోగులకు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు.


 సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినైయుండి

యాదండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించుకొన్నది.


కైలాసమునువదలి శరభ శార్దూల గజములుగల నాగ గరుడ చకవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి

గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిధి మర్యాదలొనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని

పార్వతిని ప్రశ్నించారు.   వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా

పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ

సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. 


మహర్షులారా! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది

శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ

వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవావ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. 

జగజ్జననీ ఈ వ్రతాన్ని భాద్రపదమాసంలో శుక్ల అష్టమియందు ఆచరించాలి. ఆరోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. 

మరియు ధాన్యరాశినిపోసి అందు పూర్ణకుంభమునుంచి ఇరువదియొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమునుగాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి.

దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య-భోజ్య, నైవేద్యాదులు కదళీప్జలాలు పనసలు ఆరగింపచేసి తాంబూలదక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించినవారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.

గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను.

కొంతకాలమునకు శిభక్తపరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు.

ఆతదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి యను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము చేయుటకు అనుఙ్ఞనిమ్మని అడిగారు. అందుకాతడు బిడ్డలారా! నేను దరిద్రుడను. సామాగ్రులను సమకూర్చగలపాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకోండనిపలికెను. అందుకా వైశ్యపుత్రికలు నీ ఆఙ్ఞయే మాకు ధనము అనుఙ్ఞనియ్యవలసినదని కోరుకున్నారు.

వారిరువురు ఒక వటవృక్షంక్రింద కూర్చుని తోరముకట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు.

ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని

చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనదాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. 

మరికొంతకాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యము నుండి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. 

ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్జించి తీసుకొని రావలసిందని చెప్పిపంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది అతడు తిరిగివస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత దనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరురూపుడైన శివుడాసొమ్మును తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి! నీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడాప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీమార్భలముతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది

ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు.

కూర్పు: గోగులపాటి కృష్ణమోహన్

9700007653

Sunday, November 15, 2020

భగినీ హస్త భోజనం

 


భగినీ హస్త భోజనం

*భగినీ హస్త భోజనం విశిష్టత:*
(సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్)

సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.

సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దం పట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం.

సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది.

ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెళ్ళ ఇళ్ళకు బహుమానాలు తీసుకెళ్ళి వారి చేతి వంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష ( రాఖీ ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది.


"భయ్యా ధూజీ'' అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్త భోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.

*యుముడు ఇచ్చిన మాట... నిలబెట్టుకుంటాడట...*
(సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్)

మన పురాణాల్లో కధ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేక పోయాడు.

చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు.

ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా ఉంటాయి. ఆమె ఈ కార్తీక శుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది.

ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం ( అకాల మరణం ) లేకుండా ఉంటుంది. ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడట. అందు వలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది.

ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు.

యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు అంటాడు. దీనికి కారణం ఉంది.

యముడు యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట.

అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదర, సోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు. ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ. తెలుగు రాష్ట్రాలలో దానిని గురించి తెలిసినా పెద్దగా పాటించరు. పురాణ కధలలో ఎదో అంతరార్ధాలు దాగి ఉన్నాయని గ్రహిస్తే ఆచారాలు ఆచరణలోకి వస్తాయి.

అందువల్లనే మీరందరూ మీ ప్రియమైన సోదరీమణుల చేతులమీదుగా కడుపునిండా
భోజనం చేసి మీ సోదరి క్షేమాన్ని కాంక్షిస్తారని కోరుకుంటూ.... భగినీ హస్త భోజన దివాస్ శుభాకాంక్షలతో....  


గోగులపాటి కృష్ణమోహన్


Thursday, December 12, 2019

మహాన్యాసము

మహాన్యాసము

నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?
మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు  కలిగినది.
౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు  కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము  పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.

౧. ప్రథమాంగన్యాసము

భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత,  పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్ర పూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత, "యా తే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు, తన శిఖాదులను తాకవలెను.

౨. ద్వితీయాంగన్యాసము

"ఓం నమో భగవతే రుద్రాయ" అని పలికి నమస్కరించి, "ఓం మూర్ద్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః,  తేం దక్షిణ హస్తాయ నమః, రం వామ హస్తాయ నమః, యం పాదాభ్యాం నమః" అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు  నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.

౩. తృతీయాంగన్యాసము

సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ సదాశివుడే తానగును.

తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...." మొదలగు మంత్రములు   పఠించుచు ఆయ దిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలెను. దీనినే, సంపుటం అంటారు.

తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలి ఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములు పఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు , ఆయా దేహ స్థానాన్ని తాకి (లలాటము నుండి పాదముల వరకు), ఆయా దేవతకు నమస్కరించుచు (ఇంద్రుని మొదలు పృథివి చివర) రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని చెప్పవలెను.

తర్వాత షోడశాంగ రౌద్రీకరణము "ఓం  అం విభూరసి  ప్రవాహణో...." అనే మంత్రముతో మొదలు పెట్టి "ఓం అః  ఆహిరసి బుధ్నియో" అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర "రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్‍ం సీః" అనే మంత్రభాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమును రుద్రుని భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు  "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ"అని సంపుటీకరణ చేస్తారు.

దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందును, సర్వ భూతములచే అపరాజితుడగును, ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందును.

౪. చతుర్థాంగన్యాసము

"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగముల తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను (రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములు చదివి 'ఆత్మనే నమః' అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుట అగును.

౫. పంచమాంగన్యాసము

ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. శివ సంకల్పం గురించి ప్రత్యేక వ్యాసం తర్వాత రాస్తాను. "యే వేదం భూతం భువనం భవిష్యతి.." మొదలుకొని  ముప్ఫై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్‍ంహృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీనివలన మోక్షము కలుగును.

తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్‍ంశిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.

తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సం భూతః"మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్‍ంశిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.

తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.


తరువాత, "ప్రతి పూరష మేకకపాలా న్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకమును పఠించి, "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.

తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అనువాకమును పఠించి "ఓం నమో భగవతే  రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసము చేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతి దిగ్బంధః"  అని దిగ్బంధమును చూపించ వలెను.

తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవి అష్టాంగములు).

వీటి తర్వాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను. 

శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్

దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.

లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాతిష్ఠంతు" మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యథాస్థానాని  తిష్ఠంతు మాం రక్షంతు" అని చెప్పవలెను. (ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథా స్థానములందు ఉండునట్లు ప్రార్థించునది).

[తరువాత, "అగ్ని ర్మే వాచిశ్రితః వాగ్ఘ్రుదయే హృదయం మయి"మొదలు "అంత స్తిష్ఠ త్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము, అంగములను స్పృశించ వలెను. గంధము, అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ వలెను.అభిషేక ప్రారంభములో చమకములోని 'శంచమ'అనువాకమును, నమక చమకముల లోని మొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాం గ్రంథిరసి"  అనే నాలుగు అనువాకములు, దశ శాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి, శతానువాకములను, పంచకాఠకములను పఠించి అభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశ వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును.]

ఇది క్లుప్తంగా మహాన్యాసం లోని అధికార అర్హతకు చేయవలసిన పధ్ధతి.

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

శ్రీరుద్రం

శ్రీరుద్రం - గురించి తెలుసుకుందాం

రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి.

యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి *'రుద్రం'* అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు.
రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'.
11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది.
ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది.

ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం'

హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'.

ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.

*శ్రీరుద్రధ్యానమ్*
బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం
తాత్పర్యము: బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!


*ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్*
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్
తాత్పర్యము: శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కళ జడలును, పైకి ఎత్తి కట్ట బడిన శిఖ కలిగి,  నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగాములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించ వలెను.

శ్రీ రుద్ర ప్రశ్నః
కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితా
చతుర్థం వైశ్వదేవం కాణ్డమ్ పఞ్చమః ప్రపాఠకః

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

చమకం తాత్పర్య సహితంగా


చమకం:- రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) 'చమే' తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. ఇందులో చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనం గా చెప్పబడ్డాయి.



చమకం
భక్తుడు తనకు ఏమి కావలెనో ఆ రుద్రుని చమక రూపంలో అడగబడింది. నమకంలో లాగానే దీనిలో కూడా పదకొండు అనువాకములు. నమక చమకాలు కలిపి చదివితేనే అభిషేకం సంపూర్ణం. చమకాన్ని భక్తుని వాక్కులో రుద్రుని ఆశీర్వచనంగా వ్యాఖ్యానించ బడింది.
మొదటి అనువాకము:
ఓం అగ్నా’విష్ణో సజోష’సేమావ’ర్ధన్తు వాం గిరః’ | ద్యుమ్నైర్-వాజే’భిరాగ’తమ్ | వాజ’శ్చ మే ప్రసవశ్చ’ మే ప్రయ’తిశ్చ మే ప్రసి’తిశ్చ మే ధీతిశ్చ’ మే క్రతు’శ్చ మే స్వర’శ్చ మే శ్లోక’శ్చ మే శ్రావశ్చ’ మే శ్రుతి’శ్చ మే జ్యోతి’శ్చ మే సువ’శ్చ మే ప్రాణశ్చ’ మే‌உపానశ్చ’ మే వ్యానశ్చ మే‌உసు’శ్చ మే చిత్తం చ’ మ ఆధీ’తం చ మే వాక్చ’ మే మన’శ్చ మే చక్షు’శ్చ మే శ్రోత్రం’ చ మే దక్ష’శ్చ మే బలం’ చ మ ఓజ’శ్చ మే సహ’శ్చ మ ఆయు’శ్చ మే జరా చ’ మ ఆత్మా చ’ మే తనూశ్చ’ మే శర్మ’ చ మే వర్మ’ చ మే‌உఙ్గా’ని చ మే‌உస్థాని’ చ మే పరూగ్‍మ్’షి చ మే శరీ’రాణి చ మే || ౧ ||
తాత్పర్యము :
ఓ దేవా! అగ్ని విష్ణు రూపమైన వాడ!  మీరు నా పట్ల సంతుష్టులై ఉండుటకు నేను నుతించే ఈ పదములు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుండు గాక. నాకు ఎల్లపుడు ఆహారము, ధనము సమృద్ధిగా నుండు గాక.
రెండవ అనువాకము:
జైష్ఠ్యం’ చ మ ఆధి’పత్యం చ మే మన్యుశ్చ’ మే భామ’శ్చ మే‌உమ’శ్చ మే‌உమ్భ’శ్చ మే జేమా చ’ మే మహిమా చ’ మే వరిమా చ’ మే ప్రథిమా చ’ మే వర్ష్మా చ’ మే ద్రాఘుయా చ’ మే వృద్ధం చ’ మే వృద్ధి’శ్చ మే సత్యం చ’ మే శ్రద్ధా చ’ మే జగ’చ్చ మే ధనం’ చ మే వశ’శ్చ మే త్విషి’శ్చ మే క్రీడా చ’ మే మోద’శ్చ మే జాతం చ’ మే జనిష్యమా’ణం చ మే సూక్తం చ’ మే సుకృతం చ’ మే విత్తం చ’ మే వేద్యం’ చ మే భూతం చ’ మే భవిష్యచ్చ’ మే సుగం చ’ మే సుపథం చ మ ఋద్ధం చ మ ఋద్ధిశ్చ మే క్లుప్తం చ’ మే క్లుప్తి’శ్చ మే మతిశ్చ’ మే సుమతిశ్చ’ మే || ౨ ||
తాత్పర్యము :
నేను రుద్రుని అర్చించుట వలన - ఆహారము, దాన్ని ఇచ్చే మనసు,  ఉత్సాహము, కాపాడుకునే శక్తి, ఆహారాన్ని సంపాదించే శక్తి, దోషములు లేకుండా మంత్రోచ్చారణ చేసే సామర్థ్యం, యశస్సు, ఉచ్చారణ, వివేకము, స్వర్గము, ఆత్మ శక్తి,  అపాన వ్యానాదులు,  ఆత్మ, ఆలోచన, ఆలోచనచే గ్రహించ బడేవి, వాక్కు, మనస్సు, ఇంద్రియములు, జ్ఞానమును పొందుటకు కావలసిన ఇంద్రియ శక్తి, ఆత్మ బలము, శత్రువులను సంహరించే శక్తి, ఆయుష్షు, వృద్ధాప్యం, ఆరోగ్యకరమైన శరీరము, ఆనందము, శరీరాన్ని కాపాడటానికి ఆయుధాలు, బలమైన, స్థిరమైన అవయవములు, ఎముకలు, కీళ్ళు మొదలగు అవయవములు - నాతో, నాలో ఉండు గాక.
మూడవ అనువాకము:
శం చ’ మే మయ’శ్చ మే ప్రియం చ’ మే‌உనుకామశ్చ’ మే కామ’శ్చ మే సౌమనసశ్చ’ మే భద్రం చ’ మే శ్రేయ’శ్చ మే వస్య’శ్చ మే యశ’శ్చ మే భగ’శ్చ మే ద్రవి’ణం చ మే యన్తా చ’ మే ధర్తా చ’ మే క్షేమ’శ్చ మే ధృతి’శ్చ మే విశ్వం’ చ మే మహ’శ్చ మే సంవిచ్చ’ మే ఙ్ఞాత్రం’ చ మే సూశ్చ’ మే ప్రసూశ్చ’ మే సీరం’ చ మే లయశ్చ’ మ ఋతం చ’ మే‌உమృతం’ చ మే‌உయక్ష్మం చ మే‌உనా’మయచ్చ మే జీవాతు’శ్చ మే దీర్ఘాయుత్వం చ’ మే‌உనమిత్రం చ మే‌உభ’యం చ మే సుగం చ’ మే శయ’నం చ మే సూషా చ’ మే సుదినం’ చ మే || ౩ ||
తాత్పర్యము :
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - కీర్తి, నాయకత్వము, క్రోధము, చలించని మనసు, చల్లని నీరు, గెలిచే మరియు గౌరవము పొందే సామర్థ్యము, స్థిరాస్తులు, పుత్ర పౌత్రాదులు,   అప మృత్యువు లేని సంతానము, ధన ధాన్యములు, పెరిగే జ్ఞానము, సత్యము, వివరము పట్ల ధ్యాస, ఆకట్టుకునే సామర్థ్యము, శరీర సౌందర్యము, క్రీడలు ఇతర విషయముల వలన కలిగే ఆనందము, చేసేది, చేయబడేది, దేవతలా ఆశీర్వాదము, సత్కార్యములు, ఖజానా, నిలిచే సంపాదన, ఎక్కువ సంపాదించే సామర్థ్యము, ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి, మంచి మార్గములు, మంచి యజ్ఞ ఫలము, పుణ్యము, సత్సంపాదన, పని చేయ గలిగిన మంచి సామర్థ్యము, ముందు చూపు, నిలకడ - నాకు కలిగి, నాతో ఉండు గాక.
నాలుగవ అనువాకము:
ఊర్క్చ’ మే సూనృతా’ చ మే పయ’శ్చ మే రస’శ్చ మే ఘృతం చ’ మే మధు’ చ మే సగ్ధి’శ్చ మే సపీ’తిశ్చ మే కృషిశ్చ’ మే వృష్టి’శ్చ మే జైత్రం’ చ మ ఔద్భి’ద్యం చ మే రయిశ్చ’ మే రాయ’శ్చ మే పుష్టం చ మే పుష్టి’శ్చ మే విభు చ’ మే ప్రభు చ’ మే బహు చ’ మే భూయ’శ్చ మే పూర్ణం చ’ మే పూర్ణత’రం చ మే‌உక్షి’తిశ్చ మే కూయ’వాశ్చ మే‌உన్నం’ చ మే‌உక్షు’చ్చ మే వ్రీహయ’శ్చ మే యవా”శ్చ మే మాషా”శ్చ మే తిలా”శ్చ మే ముద్గాశ్చ’ మే ఖల్వా”శ్చ మే గోధూమా”శ్చ మే మసురా”శ్చ మే ప్రియఙ్గ’వశ్చ మే‌உణ’వశ్చ మే శ్యామాకా”శ్చ మే నీవారా”శ్చ మే || ౪ ||
తాత్పర్యము :
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - ఇహ లౌక, పారలౌకిక ఆనందాలు, కోరిక, దాని ఫలము, ప్రీతి కలిగించే బంధు జనము, రక్షణ, యశస్సు , కీర్తి, మంచి అలవాట్లు, అదృష్టము, సంపద, తండ్రి వలె నన్ను నడిపించే సద్గురువు,  ఆస్తులను కాపాడుకునే శక్తి, స్థైర్యము, మంచితనము, గుర్తింపు, వేద శాస్త్రాల జ్ఞానము, అధ్యాపకత, పని చేసే, చేయించ గలిగే సామర్థ్యము, ఆజ్ఞాపించే అధికారము, పశు సంపద, అవరోధము లేని మార్గము, మంచి అగ్నిహోత్రము, ద్రవ్యములు, వాటి వలన కలిగే శుభములు, క్షయ వ్యాధి నుంచి రక్షణ, జ్వరములనుండి రక్షణ, ఔషధ సేవ లేని జీవితం, దీర్ఘాయుష్షు, అందరితో స్నేహంగా ఉండే వాతావరణము, నిర్భయము, సత్ప్రవర్తన, మంచి నిద్ర, మంచి ఉదయము, మంచి రోజులు - నాతో ఉండు గాక.
అయిదవ అనువాకము:
అశ్మా చ’ మే మృత్తి’కా చ మే గిరయ’శ్చ మే పర్వ’తాశ్చ మే సిక’తాశ్చ మే వనస్-పత’యశ్చ మే హిర’ణ్యం చ మే‌உయ’శ్చ మే సీసం’ చ మే త్రపు’శ్చ మే శ్యామం చ’ మే లోహం చ’ మే‌உగ్నిశ్చ’ మ ఆప’శ్చ మే వీరుధ’శ్చ మ ఓష’ధయశ్చ మే కృష్ణపచ్యం చ’ మే‌உకృష్ణపచ్యం చ’ మే గ్రామ్యాశ్చ’ మే పశవ’ ఆరణ్యాశ్చ’ యఙ్ఞేన’ కల్పన్తాం విత్తం చ’ మే విత్తి’శ్చ మే భూతం చ’ మే భూతి’శ్చ మే వసు’ చ మే వసతిశ్చ’ మే కర్మ’ చ మే శక్తి’శ్చ మే‌உర్థ’శ్చ మ ఏమ’శ్చ మ ఇతి’శ్చ మే గతి’శ్చ మే || ౫ ||
తాత్పర్యము :
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - భుక్తి, మంచి వాక్కు, పాలు, మీగడ, నెయ్యి, తేనె, బంధువులతో భోజనము, పానము, వ్యవసాయము, వర్షములు, విజయ భూమి, వృక్షములు, మొక్కల సేద్యము, స్వర్ణము, రత్నములు, సంపదతో వచ్చే కీర్తి, ఆరోగ్యము, విలువైన పంట, మంచి పంట తెచ్చే ఇతర శుభములు, దినదినాభి వృద్ధి, పూర్ణత్వము, ఉత్కృష్టము కన్నా ఉన్నతమైనది, మరణము లేని స్థితి, బియ్యము, సజ్జలు, గోధుమలు, రాగులు, మినుములు, పెసలు మొదలగు ధాన్యములు, నూనె గింజలు, పప్పు దినుసులు - అన్ని నా వద్ద సమృద్ధిగా ఉండు గాక.
ఆరవ అనువాకము:
అగ్నిశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే సోమ’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే సవితా చ’ మ ఇన్ద్ర’శ్చ మే సర’స్వతీ చ మ ఇన్ద్ర’శ్చ మే పూషా చ’ మ ఇన్ద్ర’శ్చ మే బృహస్పతి’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే మిత్రశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే వరు’ణశ్చ మ ఇన్ద్ర’శ్చ మే త్వష్ఠా’ చ మ ఇన్ద్ర’శ్చ మే ధాతా చ’ మ ఇన్ద్ర’శ్చ మే విష్ణు’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే‌உశ్వినౌ’ చ మ ఇన్ద్ర’శ్చ మే మరుత’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే విశ్వే’ చ మే దేవా ఇన్ద్ర’శ్చ మే పృథివీ చ’ మ ఇన్ద్ర’శ్చ మే‌உన్తరి’క్షం చ మ ఇన్ద్ర’శ్చ మే ద్యౌశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే దిశ’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే మూర్ధా చ’ మ ఇన్ద్ర’శ్చ మే ప్రజాప’తిశ్చ మ ఇన్ద్ర’శ్చ మే || ౬ ||
తాత్పర్యము :
ఓ రుద్రా!  నిన్ను అర్చించుట వలన - రాళ్ళు, మట్టి, కొండలు, పర్వతాలు, ఇసుక, భూమి యందు పెరిగే అన్ని వస్తువులు, అన్ని రకముల ఖనిజములు, లవణాలు, అగ్ని, నీరు, తీగ మొక్కలు,  ఔషధపు మొక్కలు, పెంచేవి, పెంచని మొక్కలు, గ్రామాలలో, అరణ్యాలలో ఉండే సంపద, పశుసంపద, అగ్నిహోత్రములో వాడే ద్రవ్యములు,  పిత్రార్జితములు, సంతానము మరియు ఇతరులకు చెందిన ఆస్తులు, స్థిర, చరాస్తులు, నా ధర్మమునకు చెందిన కర్మలు, కర్మలు చేయుటకు కావలసిన శక్తి, వాటి ఫలము, ఆనందము పొందే సాధనములు, వాటి ఫలితములు - నాతో ఉండు గాక.
ఏడవ అనువాకము:
అగ్ంశుశ్చ’ మే రశ్మిశ్చ మే‌உదా”భ్యశ్చ మే‌உధి’పతిశ్చ మ ఉపాగ్ంశుశ్చ’ మే‌உన్తర్యామశ్చ’ మ ఐన్ద్రవాయవశ్చ’ మే మైత్రావరుణశ్చ’ మ ఆశ్వినశ్చ’ మే ప్రతిప్రస్థాన’శ్చ మే శుక్రశ్చ’ మే మన్థీ చ’ మ ఆగ్రయణశ్చ’ మే వైశ్వదేవశ్చ’ మే ధ్రువశ్చ’ మే వైశ్వానరశ్చ’ మ ఋతుగ్రహాశ్చ’ మే‌உతిగ్రాహ్యా”శ్చ మ ఐంద్రాగ్నశ్చ’ మే వైశ్వదేవశ్చ’ మే మరుత్వతీయా”శ్చ మే మాహేన్ద్రశ్చ’ మ ఆదిత్యశ్చ’ మే సావిత్రశ్చ’ మే సారస్వతశ్చ’ మే పౌష్ణశ్చ’ మే పాత్నీవతశ్చ’ మే హారియోజనశ్చ’ మే || ౭ ||
తాత్పర్యము :
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన -  అగ్ని మరియు ఇంద్రుడు, చంద్రుడు మరియు ఇంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు, సరస్వతి మరియు ఇంద్రుడు, పూషా మరియు ఇంద్రుడు, బృహస్పతి మరియు ఇంద్రుడు, మిత్రుడు మరియు ఇంద్రుడు, వరుణుడు మరియు ఇంద్రుడు, త్వష్ట మరియు ఇంద్రుడు, ధాత మరియు ఇంద్రుడు, అశ్వినీ దేవతలు మరియు ఇంద్రుడు, మరుత్ దేవతలు మరియు ఇంద్రుడు, వసువులు మరియు ఇంద్రుడు, భూమి మరియు ఇంద్రుడు, అంతరిక్షము మరియు ఇంద్రుడు, స్వర్గము మరియు ఇంద్రుడు, నాలుగు దిక్కులు మరియు ఇంద్రుడు, మూర్ధ్నము మరియు ఇంద్రుడు, ప్రజాపతి మరియు ఇంద్రుడు - నన్ను ఆశీర్వదించు గాక.
ఎనిమిదవ అనువాకము:
ఇధ్మశ్చ’ మే బర్హిశ్చ’ మే వేది’శ్చ మే దిష్ణి’యాశ్చ మే స్రుచ’శ్చ మే చమసాశ్చ’ మే గ్రావా’ణశ్చ మే స్వర’వశ్చ మ ఉపరవాశ్చ’ మే‌உధిషవ’ణే చ మే ద్రోణకలశశ్చ’ మే వాయవ్యా’ని చ మే పూతభృచ్చ’ మ ఆధవనీయ’శ్చ మ ఆగ్నీ”ధ్రం చ మే హవిర్ధానం’ చ మే గృహాశ్చ’ మే సద’శ్చ మే పురోడాశా”శ్చ మే పచతాశ్చ’ మే‌உవభృథశ్చ’ మే స్వగాకారశ్చ’ మే || ౮ ||
తాత్పర్యము :
ఓ రుద్రా! నిన్ను అర్చించుట కొరకు  -  సోమయాగమునకు కావలసిన పాత్రలు, ఆజ్య పాత్రలు, ఘ్రుత పాత్రలు,  ఇంద్రాది దేవతలకు సమర్పించ వలసిన సోమరస పాత్రలు,  ఆశ్వినాది ఇతర దేవతలకు సోమరస పాత్రలు, వైశ్వదేవాది దేవతలకు సోమరస పాత్రలు మొదలగునవి నా చేత ఉన్నాయి.
తొమ్మిదవ అనువాకము:
అగ్నిశ్చ’ మే ఘర్మశ్చ’ మే‌உర్కశ్చ’ మే సూర్య’శ్చ మే ప్రాణశ్చ’ మే‌உశ్వమేధశ్చ’ మే పృథివీ చ మే‌உది’తిశ్చ మే దితి’శ్చ మే ద్యౌశ్చ’ మే శక్వ’రీరఙ్గుల’యో దిశ’శ్చ మే యఙ్ఞేన’ కల్పన్తామృక్చ’ మే సామ’ చ మే స్తోమ’శ్చ మే యజు’శ్చ మే దీక్షా చ’ మే తప’శ్చ మ ఋతుశ్చ’ మే వ్రతం చ’ మే‌உహోరాత్రయో”ర్-దృష్ట్యా బృ’హద్రథంతరే చ మే యఙ్ఞేన’ కల్పేతామ్ || ౯ ||
తాత్పర్యము :
ఓ రుద్ర! నేను నీ భక్తుడనయినందు వలన - మర్రి చెట్టు చిదుగులు, దర్భలు, యాగశాల, సహాయమునకు స్త్రీలు, సోమరస పాత్రలు, సోమ తీగ చిగుళ్ళు నూరుటకు రాళ్ళు, సమిధలు, చెక్కలు, అగ్ని సృష్టించుటకు భూమిలో రంధ్రములు, ద్రోణము, వాయవ్యసము, ఇతర పవిత్రమైన పాత్రలు,యాగ ద్రవ్యములు ఉంచుటకు, స్త్రీలు ఆసీనులు అగుటకు, ఇతరులు వీక్షించుటకు ప్రదేశము, చెరువు (హోమములో హుతమునకు), బలి, అనంతరము స్నానమునకు ప్రదేశము, సమిథలతో పాటు హవానములో వేసే ఇతర ద్రవ్యములు నా చెంత ఉండు గాక.
పదవ అనువాకము:
గర్భా”శ్చ మే వత్సాశ్చ’ మే త్ర్యవి’శ్చ మే త్ర్యవీచ’ మే దిత్యవాట్ చ’ మే దిత్యౌహీ చ’ మే పఞ్చా’విశ్చ మే పంచావీ చ’ మే త్రివత్సశ్చ’ మే త్రివత్సా చ’ మే తుర్యవాట్ చ’ మే తుర్యౌహీ చ’ మే పష్ఠవాట్ చ’ మే పష్ఠౌహీ చ’ మ ఉక్షా చ’ మే వశా చ’ మ ఋషభశ్చ’ మే వేహచ్చ’ మే‌உనడ్వాం చ మే ధేనుశ్చ’ మ ఆయు’ర్-యఙ్ఞేన’ కల్పతాం ప్రాణో యఙ్ఞేన’ కల్పతామ్-అపానో యఙ్ఞేన’ కల్పతాం వ్యానో యఙ్ఞేన’ కల్పతాం చక్షు’ర్-యఙ్ఞేన’ కల్పతాగ్ శ్రోత్రం’ యఙ్ఞేన’ కల్పతాం మనో’ యఙ్ఞేన’ కల్పతాం వాగ్-యఙ్ఞేన’ కల్పతామ్-ఆత్మా యఙ్ఞేన’ కల్పతాం యఙ్ఞో యఙ్ఞేన’ కల్పతామ్ || ౧౦ ||
తాత్పర్యము :
ఓ రుద్రా! నేను నీ భక్తుడనయినందు వలన యాగామునకు కావాల్సిన అగ్ని, అగ్ని కార్యమునకు కావాల్సిన ఇతర పూర్వ కార్యక్రమములు, దిక్పాలకులకు, పంచాభూతములకు చేయవలసిన సమర్పణ (ఆశ్వాది బలులు), వేద పారాయణ , ప్రాయశ్చిత్తము, శాంతి హోమములు, పూర్ణాహుతి ముహూర్త నిర్ణయం, పూర్ణాహుతి కార్యక్రమము, ఇతర క్రియలు నా చేతుల మీదుగా జరుగు గాక.
(ఇక్కడ గో స్తన్యము నుండి పాలు త్రాగుట, అశ్వాన్ని బలి ఇవ్వటం, వివిధ దేవతలకు బలి సమర్పించటం, శుద్ధి, ప్రాయశ్చిత్తం వివరాలు పై రెండు అనువాకాల్లో పేర్కొన బడ్డాయి)
పదకొండవ అనువాకము:
ఏకా’ చ మే తిస్రశ్చ’ మే పఞ్చ’ చ మే సప్త చ’ మే నవ’ చ మ ఏకా’దశ చ మే త్రయోదశ చ మే పఞ్చ’దశ చ మే సప్తద’శ చ మే నవ’దశ చ మ ఏక’విగ్ంశతిశ్చ మే త్రయో’విగ్ంశతిశ్చ మే పఞ్చ’విగ్ంశతిశ్చ మే సప్త విగ్‍మ్’శతిశ్చ మే నవ’విగ్ంశతిశ్చ మ ఏక’త్రిగ్ంశచ్చ మే త్రయ’స్త్రిగ్ంశచ్చ మే చత’స్-రశ్చ మే‌உష్టౌ చ’ మే ద్వాద’శ చ మే షోడ’శ చ మే విగ్ంశతిశ్చ’ మే చతు’ర్విగ్ంశతిశ్చ మే‌உష్టావిగ్‍మ్’శతిశ్చ మే ద్వాత్రిగ్‍మ్’శచ్చ మే షట్-త్రిగ్‍మ్’శచ్చ మే చత్వారిగ్ంశచ్చ’ మే చతు’శ్-చత్వారిగ్ంశచ్చ మే‌உష్టాచ’త్వారిగ్ంశచ్చ మే వాజ’శ్చ ప్రసవశ్చా’పిజశ్చ క్రతు’శ్చ సువ’శ్చ మూర్ధా చ వ్యశ్ని’యశ్-చాన్త్యాయనశ్-చాన్త్య’శ్చ భౌవనశ్చ భువ’నశ్-చాధి’పతిశ్చ || ౧౧ ||
ఓం ఇడా’ దేవహూర్-మను’ర్-యఙ్ఞనీర్-బృహస్పతి’రుక్థామదాని’ శగ్ంసిషద్-విశ్వే’-దేవాః సూ”క్తవాచః పృథి’విమాతర్మా మా’ హిగ్ంసీర్-మధు’ మనిష్యే మధు’ జనిష్యే మధు’ వక్ష్యామి మధు’ వదిష్యామి మధు’మతీం దేవేభ్యో వాచముద్యాసగ్ంశుశ్రూషేణ్యా”మ్ మనుష్యే”భ్యస్తం మా’ దేవా అ’వన్తు శోభాయై’ పితరో‌உను’మదన్తు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః
తాత్పర్యము :
గర్భిణీలు అయిన గోవులు, గోవులు, దూడలు, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరములున్న గోవులు, ఎద్దులు, వీర్యమున్న ఎద్దులు, బాలింతలైన గోవులు, గొడ్లు అందుబాటులో ఉండుగాక. ఈ అగ్నిహోత్రములోని అగ్ని నాకు పూర్ణాయుష్షు, ఉచ్చ్వాశ నిశ్శ్వాసలు, ఆరోగ్యకరమైన కళ్ళు, చెవులు, మనసు, వాక్కు, ఆత్మను ఇచ్చు గాక. ఇటువంటి కార్యములు ఇంకా చేయుటకు శక్తిని ఇచ్చు గాక. ఒకటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు, పదిహేను, పదిహేడు, పంతొమ్మిది, ఇరవై ఒకటి, ఇరవై మూడు, ఇరవై ఐదు, ఇరవై ఏడు, ఇరవై తొమ్మిది, ముప్ఫై ఒకటి, ముప్ఫై మూడు నాతో ఉండు గాక. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది, ముప్ఫై రెండు, ముప్ఫై ఆరు, నలభై, నలభై నలుగు, నలభై ఎనిమిది నాతో ఉండు గాక. ఆహారము, ధాన్యము, ధన్యోత్పత్తి, దాని వృద్ధి, అగ్నిహోత్రము నాతో ఉండు గాక. దీనికొరకు నేను పంచ భూతములను, దిక్పాలకులను నాయందు కరుణ చూపవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
(ఇక్కడ చెప్పబడిన సంఖ్యలు సరి సంఖ్యలు భూలోక సంబంధమైనవి గా, బేసి సంఖ్యలు  దేవలోక సంబంధమైనవిగా వ్యాఖ్యానించ బడినది. ఇంకొక వ్యాఖ్యానం -  ఒక ప్రకృతి, మూడు గుణములు, పంచ భూతములు,  ఏడు ఇంద్రియములు, నవ రంధ్రములు...ఇలా ప్రతి ఒక సంఖ్య ఒక విశేషమైన ప్రాధాన్యత సంతరించు కొన్నట్లు)
కామధేనువు దేవతలను ఆహ్వానించు గాక; మనువు కార్యము చేయు గాక.  బృహస్పతి మంత్రములు చదువు గాక. విశ్వ దేవుడు పధ్ధతి చెప్పు గాక. ఓ భూమాత! మాకు ఆటంకములు కలిగించకు. నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో, సత్కార్యములు చేస్తూ, దేవతలకు ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. సజ్జనులారా! నేను ఈ విధంగా చేసినందు వలన ఆ దేవతలు, పితరులు నన్ను రక్షింతురు గాక. 
ఓం శాంతి శాంతి శాంతి ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, ఏడవ ప్రపాఠకములోనిది.

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్
రుద్రం - చమకం తాత్పర్య సహితం...

నమకం తాత్పర్య సహితం


నమకం:- రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) 'నమ' తో అంతమయ్యే శ్లోకాలు నమకము గా చెప్పబడ్డాయి. నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా చెప్పబడ్డాయి.


నమకం
మొదటి అనువాకము:
ఓం నమో భగవతే’ రుద్రాయ || నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ | యా త ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ | శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ | యా తే’ రుద్ర శివా తనూరఘోరా‌உపా’పకాశినీ | తయా’ నస్తనువా శన్త’మయా గిరి’శంతాభిచా’కశీహి | యామిషుం’ గిరిశంత హస్తే బిభర్ష్యస్త’వే | శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్| శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి | యథా’ నః సర్వమిజ్జగ’దయక్ష్మగ్‍మ్ సుమనా అస’త్ | అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ | అహీగ్’‍శ్చ సర్వాం”జమ్భయన్త్సర్వా”శ్చ యాతుధాన్యః’ | అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మఙ్గళః’ | యే చేమాగ్‍మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశో‌உవైషాగ్ం హేడ’ ఈమహే | అసౌ యో’‌உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః’ | ఉతైనం విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః | నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” | అథో యే అ’స్య సత్వా’నో‌உహం తేభ్యో’‌உకరన్నమః’ | ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’ యోర్జ్యామ్ | యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప | అవతత్య ధనుస్త్వగ్‍మ్ సహ’స్రాక్ష శతే’షుధే | నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః’ సుమనా’ భవ | విజ్యం ధనుః’ కపర్దినో విశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత | అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషఙ్గథిః’ | యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’ తే ధనుః’ | తయా‌உస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా పరి’బ్భుజ | నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయ ధృష్ణవే” | ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే | పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ | అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్ || ౧ ||
శమ్భ’వే నమః’ | నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యమ్బకాయ’ త్రిపురాన్తకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకణ్ఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’ ||
తాత్పర్యము:
భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము.  ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక.  గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక. జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు.
రెండవ అనువాకము:
నమో హిర’ణ్య బాహవే సేనాన్యే’ దిశాం చ పత’యే నమో నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యః పశూనాం పత’యే నమో నమః’ సస్పిఞ్జ’రాయ త్విషీ’మతే పథీనాం పత’యే నమో నమో’ బభ్లుశాయ’ వివ్యాధినే‌உన్నా’నాం పత’యే నమో నమో హరి’కేశాయోపవీతినే’ పుష్టానాం పత’యే నమో నమో’ భవస్య’ హేత్యై జగ’తాం పత’యే నమో నమో’ రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ మన్త్రిణే’ వాణిజాయ కక్షా’ణాం పత’యే నమో నమో’ భువన్తయే’ వారివస్కృతా-యౌష’ధీనాం పత’యే నమో నమ’ ఉచ్చైర్-ఘో’షాయాక్రన్దయ’తే పత్తీనాం పత’యే నమో నమః’ కృత్స్నవీతాయ ధావ’తే సత్త్వ’నాం పత’యే నమః’ || ౨ ||
తాత్పర్యము:
స్వర్ణ భుజములు కలిగి, సేనాపతి, దిక్కులకు అధిపతి, వృక్షముల వలె ప్రకాశించు వాడు, ఆకులను జుట్టుగా కలవాడు, అన్ని జీవరాసులకు పతి, లేత చిగురుల వలె పచ్చగా, ఎర్రగా ఉన్నవాడు, మిక్కిలి ప్రకాశించేవాడు, మనలను సమస్త మార్గములలో నడిపే వాడు, నందిని అధిరోహించే వాడు, శత్రువుల పాలిటి రోగము వంటి వాడు, సమస్త ఆహారములకు అధిపతి, నల్లని జుట్టు కలవాడు, ఉపవీతమును ధరించిన వాడు, శక్తిమంతులకు అధిపతి, భవసాగరాన్ని దాటించేవాడు, ధనుస్సును ధరించిన వాడు, క్షేత్రములకు అధిపతి, జీవితమనే రథాన్ని నడిపించే వాడు, అజేయుడు, అరణ్యమునకు అధిపతి, ఎరుపు వర్ణము కలిగిన వాడు, అన్నిటికి అధిపతి, వృక్షములకు అధిపతి, మంత్రి, వ్యాపారి, చెట్టు చేమకు అధిపతి, చుట్టూ సైన్యము ఉండే వాడు, భక్తులను కాపాడే వాడు, మంచి వారికి అధిపతి అయిన రుద్రునికి నా నమస్కారము.
మూడవ అనువాకము:
నమః సహ’మానాయ నివ్యాధిన’ ఆవ్యాధినీ’నాం పత’యే నమో నమః’ కకుభాయ’ నిషఙ్గిణే” స్తేనానాం పత’యే నమో నమో’ నిషఙ్గిణ’ ఇషుధిమతే’ తస్క’రాణాం పత’యే నమో నమో వఞ్చ’తే పరివఞ్చ’తే స్తాయూనాం పత’యే నమో నమో’ నిచేరవే’ పరిచరాయార’ణ్యానాం పత’యే నమో నమః’ సృకావిభ్యో జిఘాగ్‍మ్’సద్భ్యో ముష్ణతాం పత’యే నమో నమో’‌உసిమద్భ్యో నక్తఞ్చర’ద్భ్యః ప్రకృన్తానాం పత’యే నమో నమ’ ఉష్ణీషినే’ గిరిచరాయ’ కులుఞ్చానాం పత’యే నమో నమ ఇషు’మద్భ్యో ధన్వావిభ్య’శ్చ వో నమో నమ’ ఆతన్-వానేభ్యః’ ప్రతిదధా’నేభ్యశ్చ వో నమో నమ’ ఆయచ్ఛ’ద్భ్యో విసృజద్-భ్య’శ్చ వో నమో నమో‌உస్స’ద్భ్యో విద్య’ద్-భ్యశ్చ వో నమో నమ ఆసీ’నేభ్యః శయా’నేభ్యశ్చ వో నమో నమః’ స్వపద్భ్యో జాగ్ర’ద్-భ్యశ్చ వో నమో నమస్తిష్ఠ’ద్భ్యో ధావ’ద్-భ్యశ్చ వో నమో నమః’ సభాభ్యః’ సభాప’తిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యో‌உశ్వ’పతిభ్యశ్చ వో నమః’ || ౩ ||
తాత్పర్యము:
శత్రువులను సంహరించేవాడు, అటువంటి వారికి అధిపతి, ఉన్నతమైన వాడు, ఖడ్గమును, అమ్ముల పొది, ధనుస్సును ధరించేవాడు, తస్కరులకు అధిపతి, మోసము చేసే వాడు, మోసగాళ్ళకు అధిపతి, అడవులను దోచుకునే వారికి అధిపతి, నిశాచరుడు, హంతకులకు అధిపతి, తలపాగా ధరించే వాడు, అడవులలో నివసించేవాడు, ధనుస్సును, బాణములను ధరించి సంధించే వాడు, చేదించేవాడు, స్థిరాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, పడుకొని ఉన్నవాడు, నిద్ర, చేతనావస్థలో ఉండేవాడు, స్థిరముగా ఉన్నవాడు, పరుగెత్తే వాడు, సభలో ఉన్నవాడు, సభాధ్యక్షుడిగా ఉన్నవాడు, సదాత్మల పట్ల ఆదరం చూపేవాడు, దురాత్మల పట్ల ఆగ్రహం చూపేవాడు, తానే ఆశ్వమైన వాడు, ఆశ్వపతి అయిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.
నాలుగవ అనువాకము:
నమ’ ఆవ్యాధినీ”భ్యో వివిధ్య’న్తీభ్యశ్చ వో నమో నమ ఉగ’ణాభ్యస్తృగం-హతీభ్యశ్చ’ వో నమో నమో’ గృత్సేభ్యో’ గృత్సప’తిభ్యశ్చ వో నమో నమో వ్రాతే”భ్యో వ్రాత’పతిభ్యశ్చ వో నమో నమో’ గణేభ్యో’ గణప’తిభ్యశ్చ వో నమో నమో విరూ’పేభ్యో విశ్వరూ’పేభ్యశ్చ వో నమో నమో’ మహద్భ్యః’, క్షుల్లకేభ్య’శ్చ వో నమో నమో’ రథిభ్యో‌உరథేభ్య’శ్చ వో నమో నమో రథే”భ్యో రథ’పతిభ్యశ్చ వో నమో నమః’ సేనా”భ్యః సేనానిభ్య’శ్చ వో నమో నమః’, క్షత్తృభ్యః’ సఙ్గ్రహీతృభ్య’శ్చ వో నమో నమస్తక్ష’భ్యో రథకారేభ్య’శ్చ వో నమో’ నమః కులా’లేభ్యః కర్మారే”భ్యశ్చ వో నమో నమః’ పుఞ్జిష్టే”భ్యో నిషాదేభ్య’శ్చ వో నమో నమః’ ఇషుకృద్భ్యో’ ధన్వకృద్-భ్య’శ్చ వో నమో నమో’ మృగయుభ్యః’ శ్వనిభ్య’శ్చ వో నమో నమః శ్వభ్యః శ్వప’తిభ్యశ్చ వో నమః’ || ౪ ||
తాత్పర్యము:
దుష్ట శక్తుల పాలిటి శత్రువు, వాటిని ఎదుర్కునే వాడు, ఉపకారము చేసే ఆత్మయే తానై, ఆ యాత్మలకు సహకరించే వాడు, అనుబంధములు కలిగిన వాడు, అట్టి వారికి అధిపతి అయిన వాడు, రకరకములైన జీవరాసుల సమూహము అయిన వాడు, అట్టి సమూహములకు అధిపతి అయిన వాడు, గణములో సభ్యుడు, గణములకు అధిపతి అయిన వాడు, సామాన్యమునగాను, భయానకముగాను కనిపించే వాడు, ఉత్తమమైన ఆత్మగా, బలహీనంగా కనిపించేవాడు, రథమును అధిరోహించే వాడు, రథము లేని వాడు, తనే రథమైన వాడు, రథపతి అయిన వాడు, తానే సైనికుడు, సేనాధిపతి అయిన వాడు, తానే రథమును నడిపేవాడు, రథమును ఆపగలిగిన శక్తి గలవాడు, కుమ్మరి వాడు, స్వర్ణకారుడు, వేటగాడు, మత్స్యకారుడు, ధనువు, బాణములు తయారు చేసే వాడు, శునకముల కాపరి, తానే శునకరుపమై, వాటిని కాపాడే వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.
అయిదవ అనువాకము:
నమో’ భవాయ’ చ రుద్రాయ’ చ నమః’ శర్వాయ’ చ పశుపత’యే చ నమో నీల’గ్రీవాయ చ శితికణ్ఠా’య చ నమః’ కపర్ధినే’ చ వ్యు’ప్తకేశాయ చ నమః’ సహస్రాక్షాయ’ చ శతధ’న్వనే చ నమో’ గిరిశాయ’ చ శిపివిష్టాయ’ చ నమో’ మీఢుష్ట’మాయ చేషు’మతే చ నమో” హ్రస్వాయ’ చ వామనాయ’ చ నమో’ బృహతే చ వర్షీ’యసే చ నమో’ వృద్ధాయ’ చ సంవృధ్వ’నే చ నమో అగ్రి’యాయ చ ప్రథమాయ’ చ నమ’ ఆశవే’ చాజిరాయ’ చ నమః
శీఘ్రి’యాయ చ శీభ్యా’య చ నమ’ ఊర్మ్యా’య చావస్వన్యా’య చ నమః’ స్త్రోతస్యా’య చ ద్వీప్యా’య చ || ౫ ||
తాత్పర్యము:
సృష్టి కారకుడు, దుఃఖమును పోగొట్టేవాడు, పాపములను తొలగించే వాడు, జగత్తుకు అధిపతి, నీలకంఠుడు, భస్మమును దేహమంతా కలిగిన వాడు, కపాలములు ధరించి, కేశములు ముడి వేసుకొన్న వాడు, వేయి కన్నులు, వందల అస్త్రములు కలవాడు, గిరీశుడు, కాంతితో సమానమైన వాడు, సువృష్టి కురిపించే వాడు, చిన్నగాను, పొట్టిగాను ఉండేవాడు, పెద్దగా ఉండేవాడు, సర్వ సులక్షణ సంపన్నుడు, వృద్ధునిగా కనిపించే వాడు, అనంతమైన యశస్సు కలవాడు, సృష్టి కన్నా ముందే ఉన్నవాడు, దేవతలలో ప్రథముడు, అంతటా ఉన్నవాడు, వేగముగా కదిలేవాడు, వేగమైన ప్రవాహములో ఉన్నవాడు, అట్టి ప్రవాహంలో ఈదగలవాడు, అలలలో, నిశ్చలమైన నీటిలో, సెల ఏళ్ళలో, ద్వీపములలో  ఉన్నరుద్రునికి నా నమస్కారములు.
ఆరవ అనువాకము:
నమో” జ్యేష్ఠాయ’ చ కనిష్ఠాయ’ చ నమః’ పూర్వజాయ’ చాపరజాయ’ చ నమో’ మధ్యమాయ’ చాపగల్భాయ’ చ నమో’ జఘన్యా’య చ బుధ్ని’యాయ చ నమః’ సోభ్యా’య చ ప్రతిసర్యా’య చ నమో యామ్యా’య చ క్షేమ్యా’య చ నమ’ ఉర్వర్యా’య చ ఖల్యా’య చ నమః శ్లోక్యా’య చా‌உవసాన్యా’య చ నమో వన్యా’య చ కక్ష్యా’య చ నమః’ శ్రవాయ’ చ ప్రతిశ్రవాయ’ చ నమ’ ఆశుషే’ణాయ చాశుర’థాయ చ నమః శూరా’య చావభిన్దతే చ నమో’ వర్మిణే’ చ వరూధినే’ చ నమో’ బిల్మినే’ చ కవచినే’ చ నమః’ శ్రుతాయ’ చ శ్రుతసే’నాయ చ || ౬ ||
తాత్పర్యము:
అందరికన్నా పెద్ద వాడు, మరియు చిన్న వాడు, అన్నిటికన్నా ముందు జన్మించిన వాడు, తర్వాత జన్మించిన వాడు, మధ్య వయస్కుడు, అతి పిన్నవాడు, మూలమునుంచి మరియు మధ్య నుంచి జన్మించిన వాడు, భూ మరియు ఇతర లోకముల నుండి జన్మించిన వాడు, నరకమున శిక్ష వేసి స్వర్గమున సుఖమును ఇచ్చేవాడు , పొలములలోను , వనములలోను ఉండే వాడు,   వేదములలో, వాటి శాంతి మంత్రములలో పొగడబడిన వాడు, అడవులలోని వ్రుక్షములలోను, చిన్న పొదలలో ఉండేవాడు, శబ్దము మరియు ప్రతిధ్వనిలోను ఉండేవాడు, వేగముగా నడిచే సైన్యము, ఆయుధాలలో ఉండేవాడు, వీరులు మరియు రాజుల రూపములో ఉండేవాడు, అస్త్ర శాస్త్రములు కలిగి రథమును అధిరోహించిన వాడు, శిరస్త్రాణము మరియు కవచము ధరించిన వాడు,  గొప్ప యశస్సు మరియు సేన కలిగిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.
ఏడవ అనువాకము:
నమో’ దుందుభ్యా’య చాహనన్యా’య చ నమో’ ధృష్ణవే’ చ ప్రమృశాయ’ చ నమో’ దూతాయ’ చ ప్రహి’తాయ చ నమో’ నిషఙ్గిణే’ చేషుధిమతే’ చ నమ’స్-తీక్ష్ణేష’వే చాయుధినే’ చ నమః’ స్వాయుధాయ’ చ సుధన్వ’నే చ నమః స్రుత్యా’య చ పథ్యా’య చ నమః’ కాట్యా’య చ నీప్యా’య చ నమః సూద్యా’య చ సరస్యా’య చ నమో’ నాద్యాయ’ చ వైశన్తాయ’ చ నమః కూప్యా’య చావట్యా’య చ నమో వర్ష్యా’య చావర్ష్యాయ’ చ నమో’ మేఘ్యా’య చ విద్యుత్యా’య చ నమ ఈధ్రియా’య చాతప్యా’య చ నమో వాత్యా’య చ రేష్మి’యాయ చ నమో’ వాస్తవ్యా’య చ వాస్తుపాయ’ చ || ౭ ||
తాత్పర్యము:
పెద్ద నగారా నుంచి వెలువడే శబ్దము నందు ఉన్న వాడు, ఆ నగారా మోగించే ఓడు నందు ఉండే వాడు, సమరభూమి నుంచి పారిపోని వాడు, వేగు తెచ్చిన సమాచారాన్ని పరిశీలించేవాడు, దూత మరియు సేవకుని రూపములో ఉండేవాడు, ఖడ్గము, అమ్ముల పొది కలిగిన వాడు, పదునైన బాణములు మరియు ఇతర అస్త్రములు కలిగిన వాడు, ఉత్తమమైన ధనుస్సు మరియు ఇతర శస్త్రములు కలిగిన వాడు, విశాలమైన మరియు ఇరుకైన మార్గములందు వెళ్లే వాడు, కాలువలలోను, సెలయేటి లోను ఉండేవాడు, నీటి మడుగులోను, సరస్సులోను ఉండేవాడు, నదులలోను, ఏటి లోను ఉండేవాడు, బావిలోను, జలపాతములలోను ఉండేవాడు, వర్షములోను, ఎడారిలోను ఉన్నవాడు,  మేఘము మరియు మెరుపులో ఉన్నవాడు, నిర్మలమైన శరదృతు ఆకాశాములోను, వర్షములోను, సూర్యుని లోను ఉన్నవాడు, భీకర వర్షపు గాలిలోనూ, వేడి వడగాల్పు లోను ఉన్నవాడు, గృహ నిర్మాణములో ఉండే ప్రతి వస్తువులోను,  వాస్తు పురుషుడి రూపంలో గృహాన్ని కాపాడే వాడు అయిన ఆ రుద్రునికి నా నమస్కారములు.
ఎనిమిదవ అనువాకము:
నమః సోమా’య చ రుద్రాయ’ చ నమ’స్తామ్రాయ’ చారుణాయ’ చ నమః’ శఙ్గాయ’ చ పశుపత’యే చ నమ’ ఉగ్రాయ’ చ భీమాయ’ చ నమో’ అగ్రేవధాయ’ చ దూరేవధాయ’ చ నమో’ హన్త్రే చ హనీ’యసే చ నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యో నమ’స్తారాయ నమ’శ్శమ్భవే’ చ మయోభవే’ చ నమః’ శంకరాయ’ చ మయస్కరాయ’ చ నమః’ శివాయ’ చ శివత’రాయ చ నమస్తీర్థ్యా’య చ కూల్యా’య చ నమః’ పార్యా’య చావార్యా’య చ నమః’ ప్రతర’ణాయ చోత్తర’ణాయ చ నమ’ ఆతార్యా’య చాలాద్యా’య చ నమః శష్ప్యా’య చ ఫేన్యా’య చ నమః’ సికత్యా’య చ ప్రవాహ్యా’య చ || ౮ ||
తాత్పర్యము:
ఉమాపతి, దుఃఖములను పోగొట్టే వాడు, సూర్యోదయ, అస్తమయ సమయము నాటి సూర్యుని వర్ణము కలిగిన వాడు, సంతోషాన్ని కలిగించే వాడు, రక్షకుడు, ఉగ్రముగాను, భయానకముగాను ఉన్నవాడు, నాయకుడు, శత్రు సంహారము చేసే వాడు, దూరము నుండి మాట్లాడే వాడు, ప్రళయ కారకుడు (పూర్తి విధ్వంసం), కర్మ యనే సువ్రుక్షమైన వాడు, ఓంకార ప్రకాశకుడు, భోగ కారకుడు, మోక్ష కారకుడు, అనేక లోకముల భోగమునిచ్చే వాడు, శుభమైన వాటిలో ఉన్నవాడు, శుభకరుడు, పవిత్రమైన జలము లో ఉన్నవాడు, ప్రవాహముల వద్ద అర్చించ బడే వాడు, సిద్ధి పొందిన వారిచే నుతించ బడిన వాడు, కామ్యప్రదుడు, భవ సాగరాన్ని, పాపాలను దాటించి, మోక్షాన్ని కలిగించే వాడు, ఆత్మలను ఈ ప్రపంచములోకి పంపించే వాడు, కర్మ ఫలములను అనుభవింప చేసే వాడు,  రెల్లుగడ్డి లోను, నీటి ప్రవాహపు నురగలోను, నదులయందు ఇసుకలోను, నీటి ప్రవాహంలో ఉండేవాడు అయిన రుద్రునికి నా నమస్కారములు
తొమ్మిదవ  అనువాకము:
నమ’ ఇరిణ్యా’య చ ప్రపథ్యా’య చ నమః’ కిగ్ంశిలాయ’ చ క్షయ’ణాయ చ నమః’ కపర్దినే’ చ పులస్తయే’ చ నమో గోష్ఠ్యా’య చ గృహ్యా’య చ నమస్-తల్ప్యా’య చ గేహ్యా’య చ నమః’ కాట్యా’య చ గహ్వరేష్ఠాయ’ చ నమో” హృదయ్యా’య చ నివేష్ప్యా’య చ నమః’ పాగ్‍మ్ సవ్యా’య చ రజస్యా’య చ నమః శుష్క్యా’య చ హరిత్యా’య చ నమో లోప్యా’య చోలప్యా’య చ నమ’ ఊర్మ్యా’య చ సూర్మ్యా’య చ నమః’ పర్ణ్యాయ చ పర్ణశద్యా’య చ నమో’‌உపగురమా’ణాయ చాభిఘ్నతే చ నమ’ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ నమో’ వః కిరికేభ్యో’ దేవానాగ్ం హృద’యేభ్యో నమో’ విక్షీణకేభ్యో నమో’ విచిన్వత్-కేభ్యో నమ’ ఆనిర్ హతేభ్యో నమ’ ఆమీవత్-కేభ్యః’ || ౯ ||
తాత్పర్యము:
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నివసించేవాడు, మార్గములో నడిచేవాడు,  ఎడారుల్లో, ఉన్నతమైన ప్రదేశాల్లో నివసించేవాడు, జటా ఝూటములు కలిగి, భక్తులను కాపాడుటలో ముందుండే వాడు, గృహములలోను, పాకలలో, గుహలలోను నివసించేవాడు, తల్పముపై ఉండేవాడు, అలంకరిచబడిన మందిరములలో, ముళ్ళ పొదలలో నివసించేవాడు, లోతైన నీటి మడుగుల్లో, హిమ బిందువుల్లో ఉన్నవాడు, ధూళిలో , బురద మట్టిలో, ఎండిపోయిన చెక్కలో, పచ్చి కొమ్మలో, నేలలో, పచ్చికలో,  మైదానములో, నీటి తరంగాలలో, పచ్చని ఆకులలో, ఎండుటాకులలో ఉండేవాడు, అస్త్రములు ధరించి శత్రు సంహారం చేసే వాడు,  ఎక్కువ బాధ పెట్టని వాడు, పెట్టే వాడు, భక్తులకు సకల సంపదలు ఇచ్చే వాడు, దేవతల ఆత్మలలో ఉన్నవాడు, నాశనములేని వాడు, దేవతల హృదయంలో ఉన్నవాడు,  కోర్కెలు తీర్చే వాడు, పాపములను తొలగించే వాడు, సర్వాంతర్యామి అయిన రుద్రునకు నా నమస్కారములు.  
పదవ అనువాకము:
ద్రాపే అన్ధ’సస్పతే దరి’ద్రన్-నీల’లోహిత | ఏషాం పురు’షాణామేషాం ప’శూనాం మా భేర్మా‌உరో మో ఏ’షాం కించనామ’మత్ | యా తే’ రుద్ర శివా తనూః శివా విశ్వాహ’భేషజీ | శివా రుద్రస్య’ భేషజీ తయా’ నో మృడ జీవసే” || ఇమాగ్‍మ్ రుద్రాయ’ తవసే’ కపర్దినే” క్షయద్వీ’రాయ ప్రభ’రామహే మతిమ్ | యథా’ నః శమస’ద్ ద్విపదే చతు’ష్పదే విశ్వం’ పుష్టం గ్రామే’ అస్మిన్ననా’తురమ్ | మృడా నో’ రుద్రోత నో మయ’స్కృధి క్షయద్వీ’రాయ నమ’సా విధేమ తే | యచ్ఛం చ యోశ్చ మను’రాయజే పితా తద’శ్యామ తవ’ రుద్ర ప్రణీ’తౌ | మా నో’ మహాన్త’ముత మా నో’ అర్భకం మా న ఉక్ష’న్తముత మా న’ ఉక్షితమ్ | మా నో’‌உవధీః పితరం మోత మాతరం’ ప్రియా మా న’స్తనువో’ రుద్ర రీరిషః | మా న’స్తోకే తన’యే మా న ఆయు’షి మా నో గోషు మా నో అశ్వే’షు రీరిషః | వీరాన్మా నో’ రుద్ర భామితో‌உవ’ధీర్-హవిష్మ’న్తో నమ’సా విధేమ తే | ఆరాత్తే’ గోఘ్న ఉత పూ’రుషఘ్నే క్షయద్వీ’రాయ సుమ్-నమస్మే తే’ అస్తు | రక్షా’ చ నో అధి’ చ దేవ బ్రూహ్యథా’ చ నః శర్మ’ యచ్ఛ ద్విబర్హా”ః | స్తుహి శ్రుతం గ’ర్తసదం యువా’నం మృగన్న భీమము’పహన్తుముగ్రమ్ | మృడా జ’రిత్రే రు’ద్ర స్తవా’నో అన్యన్తే’ అస్మన్నివ’పన్తు సేనా”ః | పరి’ణో రుద్రస్య’ హేతిర్-వృ’ణక్తు పరి’ త్వేషస్య’ దుర్మతి ర’ఘాయోః | అవ’ స్థిరా మఘవ’ద్-భ్యస్-తనుష్వ మీఢ్-వ’స్తోకాయ తన’యాయ మృడయ | మీఢు’ష్టమ శివ’మత శివో నః’ సుమనా’ భవ | పరమే వృక్ష ఆయు’ధన్నిధాయ కృత్తిం వసా’న ఆచ’ర పినా’కం బిభ్రదాగ’హి | వికి’రిద విలో’హిత నమ’స్తే అస్తు భగవః | యాస్తే’ సహస్రగ్‍మ్’ హేతయోన్యమస్మన్-నివపన్తు తాః | సహస్రా’ణి సహస్రధా బా’హువోస్తవ’ హేతయః’ | తాసామీశా’నో భగవః పరాచీనా ముఖా’ కృధి || ౧౦ ||
తాత్పర్యము:
పాపులను నరకంలో శిక్షించే, భక్తులకు ఆహారాన్ని ఇచ్చే, జ్యోతి స్వరూపుడవు, నీలకంఠుడవు, ఎరుపు వర్ణము కలవాడవు అయిన ఓ దేవా! భక్తులకు భయము, మృత్యువునీయకు, రోగముల నుండి కాపాడు. ఓ రుద్రా! జగత్పాలక! జనన మరణాల నుండి ముక్తిని కలిగించే, నీలో ఉన్న, పార్వతి దేవితో కూడిన రూపమును మాకు అనుగ్రహించుము. మేము ఎలా జీవించాలో అలా జీవించే వరం ప్రసాదించు. ఓ రుద్రా! జగత్పాలక! జటా ఝూటములు కలిగిన, ధ్యానములో ఉన్న తపస్వీ, వ్యాకులమైన మా మనస్సులను నీ మీదకు మరల్చు. నీ ధ్యానముతో మాకు, గోవులకు సకల పాపములు తొలగి, శుభములు కలిగి, ఆరోగ్యవంతులమగుదుము, మరల మాకు రోగములు రావు. ఓ రుద్రా! జగత్పాలక! మాకు ఆనందము కలిగించు, మోక్షము కలిగే అవకాశాలు పెంచి, పాపములు చేసే అవకాశాలు తగ్గించు.  మాకు ఆనందము, మోక్షము కలిగించుటకు నీకు మరోసారి మా ప్రణామములు. ఓ రుద్రా! జగత్పాలక! వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, గర్భము నందున్న శిశువులకు, తల్లీ, తండ్రులకు ఎప్పుడు హాని కలగకుండా చూడు. మాకు ప్రియమైన ఈ శరీరమునకు హాని కలుగకుండా చూడు. ఓ రుద్రా! జగత్పాలక! మా సంతానమునకు శోకము కలుగ కుండా కాపాడు. ఆవులను, ఆశ్వములను కాపాడు. కోపాగ్నికి మా సేవకులను గురి చేయకు. నీకు పవిత్రమైన వస్తువులు, నమస్కారములు సమర్పిస్తాము. ఓ రుద్రా! జగత్పాలక! నీ భయానక తత్వము మాకు, మా సేవకులకు దూరముగా ఉండు గాక. నీ శుభ తత్వము మాతో ఉండు గాక.  నీ కరుణ ఎల్లప్పుడూ మాతో ఉండు గాక. మాకు సకల లోకాల సుఖాలు అందించు. ఓ మనసా! నీ హృదయ కమలములో యున్న, నిత్య యౌవనుడైన, సింహమువలె శత్రువులను సంహరించే, అమితమైన యశస్సు కల్గిన ఆ రుద్రుని ధ్యానము చేయుము. ఓ రుద్రా! నీ సైనికులచే మా శత్రువులను సంహరించు. రుద్రుని ఆయుధములు మా నుండి దూరముగా ఉండు గాక. శత్రు సంహారము చేయగల ఆ రౌద్ర రూపము మానుండి దూరముగా ఉండు గాక.  ఓ రుద్ర! నీ రౌద్ర రూపమును మిమ్ము ప్రార్థించే, హవనము సమర్పించే మా పట్ల శాంతింప చేయుము. మా పుత్ర పౌత్రాదులను కాపాడుము.  భక్తుల కోర్కెలను తీర్చతంలో అగ్రుడవైన ఓ రుద్రా!  శుభ వీక్షణములు కలిగిన ఓ రుద్ర!  నీ అస్త్రములు వృక్షముపై ఉంచి, పులి చర్మము ధరించి, పినాకము అలంకారముగా ఉంచుకొని మా వద్దకు శుభకరుడవై రమ్ము. మాకు సంపదలు ఇచ్చే, ఎరుపు వర్ణములో ఉన్న ఓ రుద్రా! నీకు మా నమస్కారములు. నీ ఆయుధములు మా శత్రువులను నాశనం చేయు గాక. వేల రకాల, వేల ఆయుధాలు కలిగిన ఓ రుద్రా! నీ అస్త్రాలు మమ్ములను దాడి చేయకుండు గాక.
పదకొండవ అనువాకము:
సహస్రా’ణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యా”మ్ | తేషాగ్‍మ్’ సహస్రయోజనే‌உవధన్వా’ని తన్మసి | అస్మిన్-మ’హత్-య’ర్ణవే”‌உన్తరి’క్షే భవా అధి’ | నీల’గ్రీవాః శితికణ్ఠా”ః శర్వా అధః, క్ష’మాచరాః | నీల’గ్రీవాః శితికణ్ఠా దివగ్‍మ్’ రుద్రా ఉప’శ్రితాః | యే వృక్షేషు’ సస్పిఞ్జ’రా నీల’గ్రీవా విలో’హితాః | యే భూతానామ్-అధి’పతయో విశిఖాసః’ కపర్ది’నః | యే అన్నే’షు వివిధ్య’న్తి పాత్రే’షు పిబ’తో జనాన్’ | యే పథాం ప’థిరక్ష’య ఐలబృదా’ యవ్యుధః’ | యే తీర్థాని’ ప్రచర’న్తి సృకావ’న్తో నిషఙ్గిణః’ | య ఏతావ’న్తశ్చ భూయాగ్‍మ్’సశ్చ దిశో’ రుద్రా వి’తస్థిరే | తేషాగ్‍మ్’ సహస్రయోజనే‌உవధన్వా’ని తన్మసి | నమో’ రుధ్రేభ్యో యే పృ’థివ్యాం యే”‌உన్తరి’క్షే యే దివి యేషామన్నం వాతో’ వర్-షమిష’వస్-తేభ్యో దశ ప్రాచీర్దశ’ దక్షిణా దశ’ ప్రతీచీర్-దశో-దీ’చీర్-దశోర్ధ్వాస్-తేభ్యో నమస్తే నో’ మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ’ నో ద్వేష్టి తం వో జమ్భే’ దధామి || ౧౧ ||
త్ర్యం’బకం యజామహే సుగన్ధిం పు’ష్టివర్ధ’నమ్ | ఉర్వారుకమి’వ బన్ధ’నాన్-మృత్యో’ర్-ముక్షీయ మా‌உమృతా”త్ | యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓష’ధీషు యో రుద్రో విశ్వా భువ’నా వివేశ తస్మై’ రుద్రాయ నమో’ అస్తు | తము’ ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వ’స్య క్షయ’తి భేషజస్య’ | యక్ష్వా”మహే సౌ”మనసాయ’ రుద్రం నమో”భిర్-దేవమసు’రం దువస్య | అయం మే హస్తో భగ’వానయం మే భగ’వత్తరః | అయం మే” విశ్వభే”షజో‌உయగ్‍మ్ శివాభి’మర్శనః | యే తే’ సహస్ర’మయుతం పాశా మృత్యో మర్త్యా’య హన్త’వే | తాన్ యఙ్ఞస్య’ మాయయా సర్వానవ’ యజామహే | మృత్యవే స్వాహా’ మృత్యవే స్వాహా” | ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా’ విశాన్తకః | తేనాన్నేనా”ప్యాయస్వ ||
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యు’ర్మే పాహి ||
సదాశివోమ్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః
తాత్పర్యము:
ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు,   కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు,  పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్న ఆ శివునికి మా నమస్కారములు. ఉత్తమమైన అస్త్ర శాస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే, రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినా ఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము, ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.
ఓం శాంతి శాంతి శాంతి. ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, అయిదవ ప్రపాఠకములోనిది.

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్
నమకం తాత్పర్య సహితం