Monday, February 15, 2021

వసంత పంచమి (శ్రీ పంచమి) విశిష్టత

 
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!



​​​​తాత్పర్యం:


సరస్వతీ = ఓ సరస్వతీ దేవి, తుభ్యమ్ = నీ కొరకు, నమః = నమస్కారము 
వరదే = వరములు నిచ్చు దానా !, కామ రూపిణి = కోరిన, రూపమును ధరించు దానా !
విద్య = చదువుల యొక్క , ఆరంభం = ప్రారంభమును , కరిష్యామి = చేయబోవు చుంటిని 
మే = నాకు , సదా = ఎల్లప్పుడును , సిద్ధిః = విజయమును , భవతు = కలుగుగాక !

సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌

కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌

వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌

రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌


అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.


జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు.


సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం


ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు.


సరస్వతీదేవి ని మాఘ శుద్ధ పంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. 


ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.


మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.


సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని. ఉత్పాదకతను పెంపొందిస్తుంది.


‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.


అమ్మవారికి తెల్లనిరంగు పువ్వులు లతో పూజలు,క్షీరాన్నం ,నేతి పిండివంటలు, చెరుకు,అరటిపండ్లు నివేదన చేస్తే మంచిఫలితాలు వస్తాయని


వసంత పంచమి శుభాకాంక్షలతో...

సేకరణ

గోగులపాటి కృష్ణమోహన్


Friday, January 8, 2021

పాశురము - 25 వ రోజు

 తిరుప్పావై --- 25 పాశురం



ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్

ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర

తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద

కరుత్తై పిరపిత్తు కంజన్ వైత్తిల్

నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై

అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్

తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి

వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్


రాగం : కల్యాణి

ఒక అమ్మ కొమరుడివై ప్రభవించినావు

ఆ రాత్రె మరు అమ్మ ఒడిలోన దాగి పెరిగినావు // ఒక అమ్మ //

నిన్నే మార్చి పరిమార్చ పన్నిన పన్నాగముల

తలక్రిందులుగ జేసి, కలకలము రేపావు..

కుమతి కంసుని గుండె బడబాగ్ని వయినావు! ఓ ఆశ్రిత

వ్యామోహశీలి! నిన్నెకోరి వచ్చితిమి - నీవే కోరి పరనిచ్చితే

శ్రీకే శ్రీ యగు నీ విభవమ్ము, వీరగాధలు

గానమ్ము చేసెదము - శ్రమతీరి ఆనందించెదము

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము..

ఈ పాశురంలో శ్రీకృష్ణావతార రహస్యాన్ని వివరిస్తున్నారు. " కృష్ణా! ఒక అమ్మకు (దేవకి) కి బిడ్డగా జన్మించి, అదే రాత్రి ఊరు దాటి మరో అమ్మ(యశోద)కి బిడ్డవై పెరిగావు. ఐనా కూడా నీవు బ్రతికి ఉండడం సహించలేక నీకు కీడు తలపెట్టి ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించిన కంసుని ఆలోచనలను నాశనం చేసి ఆతని కడుపున చిచ్చువైనావు. మేము నీనుండి ఏది కోరడానికి రాలేదు స్వామి! నిన్నే కోరి వచ్చాము. సిరికే శ్రీవైన నీ ఐశ్వర్యాన్ని, వీరచరిత్రను గానం చేసి మా శ్రమను పోగొట్టుకుని ఆనందిస్తున్నాము."

ఒకరు తపస్సు చేసి నలుగురు బిడ్డలను పొందగా నలుగురు తపస్సు చేసి ఒక బిడ్డను పొందారు. వారే దశరథుడు, దేవకీ వసుదేవులు, యశోదానందులు. శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మించినా ఆమెకు దూరమై యశోద ఇంట పెరిగాడు. ఐనా కూడా అతని ఉనికి సహించలేని కంసుడు ఎన్నోసార్లు కృష్ణుని చంపాలని ప్రయత్నం చేసాడు. భగవత్ తత్వాన్ని నాశనం చేయాలని చూసేవాడు తానే లేకుండా పోతాడు. శ్రీకృష్ణుడి తనను ఆశ్రయించివారి కడుపులో ఉన్న కంసుని మీది భయాన్ని ఆతని కడుపులోనే అగ్నిలా ఉంచి చివరకు అంతమొందించాడు... పరమాత్మ 'రక్షింపుము' అనగానే రక్షిస్తాడు. మనస్ఫూర్తిగా కాకున్నా తలచినంతనే వచ్చి రక్షిస్తాడు. కాని శిక్షించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అన్నీ గమనించి శిక్షిస్తాడు. కంసుడు కేవలం మాటలు, చేతలలోనే కాక మనసులో కూడా చెడు తలంపు కలిగి ఉన్నవాడు కాబట్టి అతన్ని సంహరించాడు.

గోపికలు 'నిన్నే కోరి వచ్చాము స్వామీ అనగానే కృష్ణుడు అదేమమ్మా నిన్న పర కావాలన్నారు ఇవాలేమో నేనే కావాలంటున్నారు? అని అడుగగా. సామీ! మేమడిగినంత మాత్రాన నువ్వు మాకు 'పర'ను ఇస్తావా? నీకు ఇవ్వాలనుకున్నప్పుడే ఇవ్వు.అంతా నీ దయ, సంకల్పమే కదా? స్త్రీ ఐనా, పురుషుడైనా బాయటనుండి అందరూ స్త్రీలే. అంతరంగా మాత్రం అందరూ పురుషులే!. ఇక కావలసినదేముంది? ఆ పరమాత్మతో నిత్యం కలిసి ఉండి ఆతనికే చెంది ఉండడం.. సిరి(లక్ష్మి)కి ఐశ్వర్యమైనశ్రీ(శ్రీ) ఐన పరమాత్మను కీర్తించి, సేవించడంలో తాము పడిన శ్రమ అంతా తీరిపోయి ఆనందంగా ఉన్నామని గోపికలు అన్నారు.

Thursday, January 7, 2021

శ్రీ వెంకటేశ్వరస్వామి సుప్రభాతం

శ్రీ వెంకటేశ్వరస్వామి సుప్రభాతం



 పూర్వం వేంకటేశ్వర స్వామికి సుప్రభాతవేళ ప్రత్యేకమైన అర్చన అంటూ లేకుండా అర్చక స్వాములచే ప్రబంధ పఠనం మాత్రం జరిగేది. ఒకసారి అణ్ణన్ తన గురువు శ్రీరంగంలోని ప్రధాన జీయర్ ఐన శ్రీవరవరమునితో కలిసి తిరుమల సందర్శించారు. అక్కడ పరిస్థితి చూసిన గురువుగారి ఆదేశం మేరకు అణ్ణన్ అప్పటికప్పుడు ఆశువుగా శ్రీనివాసుని స్తుతిస్తూ సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం పఠించాడు. కమ్మనైన పదాలతో కూడిన ఆ సుప్రభాతాన్ని విన్న అర్చక స్వాములతో పాటు స్వామి కూడా పరవశుడైనాడు. అణ్ణణ్ పఠించిన ఆ సుప్రభాతమే ఈనాటివరకూ స్వామివారికి మేల్కొల్పడానికి పఠిస్తున్నారు. ఈ సుప్రభాతంలోని మొదటి శ్లోకం రామాయణంలోనిది, తొమ్మిది, పది, పదమూడవ శ్లోకాలు మార్కండేయ పురాణంలోనివి అని అంటారు.


సుప్రభాతాన్ని బంగారువాకిలి ఎదురుగా "తిరుమామణి మంటపం"లో పఠిస్తారు. ఈ సుప్రభాతం కీర్తనలో నాలుగు భాగాలున్నాయి.

వెంకటేశ్వర సుప్రభాతం - దేవునికి మేలుకొలుపు : 29 శ్లోకాలు - ఇది ప్రతివాద భయంకర అణ్ణన్ రచించిన భాగం. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలను ధరించిన శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించి భక్తులను బ్రోచుచున్నాడని, ఆ దేవదేవుని కొలిస్తే సకలార్ధ సిద్ధి కలుగుతుందని సుప్రభాత కీర్తనలో సూచింపబడుతున్నది.
వెంకటేశ్వర స్తోత్రం - భగవంతుని కీర్తన : 11 శ్లోకాలు
వెంకటేశ్వర ప్రపత్తి - భగవంతునికి శరణాగతి: 16 శ్లోకాలు - శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశం. గురువులకు, భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడం ప్రపత్తి లక్షణం.
వెంకటేశ్వర మంగళాశాసనము - పూజానంతరము జరిపే మంగళము : 14 శ్లోకాలు - ఈ భాగాన్ని మణవాళ మహాముని రచించాడట.

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్థిష్ఠోత్థిష్ఠ గోవింద ఉత్థిష్ఠ గరుడ ధ్వజ
ఉత్థిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు

మాత స్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షో విహారిణి మనోహర దివ్య మూర్తే
శ్రీ స్వామిని శ్రిత జన ప్రియ దాన శీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం

తవ సుప్రభాత మరవింద లోచనే
భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృష శైల నాథ దయితే దయానిధే

అత్ర్యాది సప్త ఋషయ స్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాద యుగ మర్చయితుం ప్రపన్నా ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా ః
త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
ఫూగద్రుమాది సుమనోహర పాలికానాం
ఆవాతి మంద మనిల స్సహ దివ్య గంధై ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థా ః
పాత్రా వశిష్ట కదళీ ఫల పాయసాని
భుక్త్వా సలీల మథ కేళి శుకా ః పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదోపి
భాషా సమగ్రమ సకృత్ కర సార రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

భృంగావళీచ మకరంద రసాను విద్ధ
ఝంకార గీత నినదై స్సహ సేవనాయా
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

యోషా గణేన వర దధ్ని విమథ్య మానే
ఘోషాలయేషు దధి మంథన తీవ్రఘోషా ః
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

పద్మేశ మిత్ర శతపత్ర గతాళి వర్గా ః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా
భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః
శ్రేయోర్థినో హర విరించి సనంద నాద్యా ః
ద్వారే వసంతి వర వేత్ర హతోత్తమాంగాః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

సేవాపరా శివ సురేశ కృశాను ధర్మ
రక్షోంబు నాథ పవమాన ధనాది నాథాః
బద్ధాంజలి ప్రవిలస న్నిజ శీర్ష దేశాః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య శూరి
స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాః
త్వద్దాస దాస చరమావధి దాస దాసా ః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాప వర్గ నిరపేక్ష నిజాంతరంగాః
కల్పాగమా కలనయా కులతాం లభంతే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః
మర్త్యా మ్నుష్య భువనే మతి మాశ్రయంతే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే
దేవాది దేవ జగదేక శరణ్య మూర్తే
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే
కల్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశ రామ యదునందన కల్కి రూప
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

ఏలా లవంగ ఘన సార సుగంధి తీర్థం
దివ్యం వియత్ సరితి హేమ ఘటేషు పూర్ణం
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టా ః
తిష్టంతి వేంకటపతే! తవ సుప్రభాతం

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః
శ్రీ వైష్ణవ స్సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట! సుప్రభాతం

బ్రహ్మాదయ స్సురవర స్సమహర్షయస్తే
సంత స్సనందన ముఖా స్త్వథ యోగి వర్యా ః
ధామాంతికే తవహి మంగళ వస్తు హస్తా ః
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః
సంసార సాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

ఇత్థం వృషాచల పతే రిహ సుప్రభాతం
యే మానవాః ప్రతి దినం పఠితుం ప్రవృత్తా ః
తేషాం ప్రభాత సమయే స్మృతి రంగ భాజాం
ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే!


శ్రీ వేంకటేశ స్తోత్రం

కమలా కుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీల తనో
కమలాయత లోచన లోకపతే
విజయీ భవ వేంకట శైలపతే

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిల దైవత మౌళిమణే
శరణాగత వత్సల సార నిధే
పరిపాలయ మాం వృష శైలపతే

అతి వేలతయా తవ దుర్విషహై
రనువేల కృతై రపరాధ శతైః
పరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే

అధి వేంకట శైల ముదార మతేర్
జనతాభిమతాధి కదా నర తాత్
పర దేవతయా గదితాన్నిగమైః
కమలా దయితాన్న పరం కలయే

కలవేణు రవా వశ గోప వధూ
శతకోటి వృతాత్ స్మర కోటి సమాత్
ప్రతి వల్లవికాభిమతాత్ సుఖదాత్
వసెదేవ సుతాన్న పరం కలయే

అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీర మతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే

అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహం
రజనీ చర రాజ తమో మిహిరం
మహనీయ మహం రఘు రామ మయే

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయ మమోఘ శరం
అపహాయ రఘూద్వహ మన్యమహం
న కథం చ న కంచన జాతు భజే

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ద్రసీద
ప్రియం వేంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ

అహం దూర తస్తే పదాంభోజ యుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ

అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేష శైల శిఖామణే

పాశురము - 30వ రోజు

 తిరుప్పావై --- 30 పాశురం



వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై

త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్

అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై

పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న

శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే

ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్

శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్

ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.


రాగం : అమృతవర్షిణీ


ఓడల కడలిని చిలికిన మాధవుని కేశవుని

చంద్రాననలు కోరి చేరి స్తుతించి // ఓడల //

అల వ్రేపల్లెలో పరపొందిన ప్రకారమును

భట్టనాధుని పట్టి గోద చెప్పిన ముప్పది

పాటలు క్రమము తప్పక పాడెడివారు, అరుణనేత్రుడు

చతుర్భుజుడు, దివ్యముఖారవిందుడు

శ్రీమన్నారాయణుని కరుణను పొంది

బ్రహ్మానందము ననుభవింతురు గాక!

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


ఆండాల్ తిరువడిగళే శరణం..

ఇతిశమ్


అలనాడు గోపికలు శ్రీ వ్రతము చేసి శ్రీకృష్ణుడిని పొందినట్లుగానే గోదాదేవి కూడా శ్రీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి శ్రీరంగనాధుని భర్తగా పొందింది. వ్రతం సమాప్తమయ్యే సమయంలొో రంగనాధుడు గోదాదేవిని తాను వివాహమాడడానికి తీసుకురమ్మని ఆమె తండ్రిని ఆదేశించాడు. శ్రీరంగంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. భోగమును పొందిన రోజు కావును శ్రీరంగనాధుడు, గోదాదేవి వివాహం చేసుకున్న ఈ రోజును భోగిగా చెప్పుకుంటారు.


ఎంతో పవిత్రమైన అందరూ ఆచరింపదగిన ఈ వ్రతాన్ని నియమిత సమయంలో ఆచరించకున్నా రోజూ ఈ ముప్పై పాశురాలను మననం చేయడం చాలా మంచిది. ముక్తి దాయకం. అమ్మవారైన లక్ష్మీదేవిని పొందడానికి శ్రీమన్నారాయణుడు ప్రయత్నించాడని క్షీరసాగరమధనంలో చెప్పినట్టుగా మనము కూడా ఆ పరమాత్మను పొందాలి అని అనుకోకుండా ఆతడే మనను పొందడానికి ప్రయత్నం చేస్తాడు అని ఈ అమృత మధనం గురించి ఈ చివరి పాశురంలో వర్ణిస్తున్నారు.


" నారాయణుడు లక్ష్మీదేవిని పొందడానికి ఓడలతో నిండిన క్షీరసాగరాన్ని దేవతలు , అసురులతో మధింపచేసాడు. అదేవిధంగా శివుడు, బ్రహ్మలకు కూడా గురువైన కేశవుని గోపికలు కీర్తించి, భక్తిశ్రద్ధలతో నియమానుసారంగా శ్రీవ్రతాన్ని ఆచరించి భగవంతుని సాన్నిధ్యాన్ని పొందారు. ఆ ప్రకారంగానే శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన గోదాదేవి తామరపూవులు, చల్లని పూసలు మాలగా ధరించి రంగనాధుని పొందడానికి శ్రీవ్రతాన్ని ఆచరించి తమిళంలో ఈ ముప్పై పాశురాలను ఒక మాలగా తయారు చేసింది. ఆమె ఆచరించి కీర్తించినట్టుగానే ఈ పాశురాలను పాడేవారు పెద్ద శిఖరాలవంటి భుజాలు కలవాడు, పుండరీకాక్షుడు, దివ్యమైన ముఖసౌందర్యం కలవాడు, శ్రీపతియైన పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు..."


నారాయణుడు సముద్రమధనం జరిగేటప్పుడు క్షీరసాగరంలో తిరుగాడే ఓడలకు ఎటువంటి ఆటంకం కలగకుండా నేర్పుగా కూర్మావతారుడై చిలికాడు. ఎవరికీ కనిపించని ఆ ఓడలు గోదాదేవికి మాత్రమే గోచరించాయి. ఆ ఓడలే మన ఆత్మలు, సంసారమే ఒక మహా సముద్రము, ఆ సముద్రాన్ని నేర్పుగా చిలికేవాడే మాధవుడు. సముద్రాన్ని చిలికేటప్పుడు ఆతని కేశాలు అటుఇటూ ఊగాయంట. అందుకే కేశవుడైనాడు. పాలకడలిపై శయనించిన పరమాత్మ ప్రార్ధనతో ఈ వ్రతాన్ని మొదలుపెట్టి చివరకు ఆ క్షీరసాగరమధనాన్ని ప్రస్తావిస్తూ వ్రత సమాప్తి చేసి ఆ దేవదేవుని సాయుజ్యాన్ని పొందారు ఆనాడు ఆ గోపికలు, ఈనాడు గోదాదేవి.


ఈ ముప్పై పాశురాలను భావార్ధాలతో సహా భక్తితో అధ్యయనం చేసి ఆచరించినంత ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. శ్రీకి శ్రీ ఐన స్వామి ఆ శ్రీతో కలిసి మన కోరికలన్నీ నెరవేరుస్తాడు. తనలో చేర్చుకుంటాడు. అన్ని వయసులవారు, అన్ని ఆశ్రమాలవారు, అన్ని వర్ణాలవారు, అన్ని ప్రాంతాలవారు, శ్త్రీలు, పురుషులు. అందరూ భగవంతుని ప్రాప్తికై ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన కోరిన కోరికలు తీరును అని గోదాదేవి ఫలశ్రుతిగా చెప్పింది గోదాదేవి..


అందరికీ ఆ గోదాదేవి మరియు ఆ దేవదేవుని కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ...

మీ

శ్రేయోభిలాషి

గోగులపాటి కృష్ణమోహన్

పాశురం - 29వ రోజు

 తిరుప్పావై --- 29 పాశురం



శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్

పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;

పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ

కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;

ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;

ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో

డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,

మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్


రాగం : కేదారగౌళ


తెలతెల వారకమున్నె వచ్చి నిన్ను సేవించి, నీ

సుందర పాదారవిందముల ప్రస్తుతి చేయుటకు

ప్రయోజనము వినుము - ఇదె వినుము! //తెల తెల //

మా గోకులమున అవతరించి మన్ననలందిన నీవు

మేము చేయు కైంకర్యము వలదనుట తగదు1

నీ విచ్చే పరవాద్యము మాకెందుకు గోవిందా!

ఏడేడు జన్మలకు.. ఎప్పటికీ నీతోనే

వీడని బంధము కావలె, నీ సేవల తరింపవలె

చిల్లర కోరికల కెల్ల చెల్లు చీటి వ్రాయించుము!

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


మార్గశిరమాసంలో పెద్దల అనుమతి తీసుకుని నదీస్నానం చేయడనైకి పదిమంది గోపికలను మేల్కొల్పి తమతో తీసికెళ్లారు గోపికలు. ఆ తర్వాత శ్రీకృష్ణుడిని , అతని భార్యను నిద్రలేపి తమ వ్రతానికి కావలసిన పరికరాలు ఇవ్వమని కోరి, తమకు పర ఇచ్చి వ్రతం చేయించి సకలాభరణాలు, వస్త్రాలు, స్వామితో కలిసి పాయసాన్ని తినాలనే కోరుకున్నారు. కాని ఇప్పుడు వాళ్లందరూ తమ కోరికను మార్చుకున్నారు.


"తెల్లవారకముందే లేచి, స్నానం చేసి వచ్చి నిన్ను సేవించి, కీర్తించి మగలం పాడడానికి గల కారణాలు వినుము స్వామి. పశువులను మేపి జీవించే యాదవ వంశంలో అవతరించిన నీవు మేము చేసే సేవలను తిరస్కరించడం తగదు. మేము నీ నుండి పరవాద్యాన్ని తీసుకుపోవడానికి రాలేదు. ఎప్పటికి ఏడేడు జన్మాలకు కూడా నీతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. ఎటువంటి వాంఛలు లేకుండా నీకు సేవ చేయాలని ఉంది. దాని వలన మా జన్మ ధన్యమవుతుంది. అలాగే మేము పూజలు చేసేది, మంగళం పాడేది మాకోసం కాదు నీకోసమే. మమ్మల్ని పొందడానికే కదా నువ్వు మా గోపాలకుల కులంలో జన్మించావు. ఎన్నో కష్టాలు పడ్డావు..అందుకే మా సేవలు నువ్వు అందుకోక తప్పదు. ఎప్పటికీ నీ సన్నిధిలో ఉండి , నీ సేవలు చేయడానికి నియమించుకో. నీకు తులసీమాల వేయడానికి, ప్రసాదం పాత్ర తీసుకురావడానికి, హారతి ఇవ్వడానికి, పాదములొత్తడానికి, చామర వీయడానికి, తాంబూలం అందించడానికి, మంచి తీర్థం ఇవ్వడానికి, బయటకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు కడిగి తుడవడానికి, అమ్మగారికి కబురందించడానికి మమ్మల్ని సేవకులుగా నియమించుకో..


అదేంటి . మీరు పరను కోరి వచ్చినవారు నాతోనే ఉండిపోతా అంటారేంటి? అని శ్రీకృష్ణుడు అడుగగా.. ఊరివారికోసం వ్రతం చేయడానికి పర అనే వాద్యం కావాలి కాని మాకెందుకు? నీ అంతరంగ కైంకర్యమే మాకు కావలసిన పర. ఎల్లప్పుడు నీతోనే ఉండేట్టుగా అనుగ్రహించు దేవా. శ్రీ మహాలక్ష్మి నిన్ను విడవకుండా ఎలా ఉంటుందో మమ్మల్ని కూడా అలాగే ఉండనివ్వు..అందుకు మాలోని ఇతరములైన కోరికలను పోగొట్టు. ఇదే మా కోరిక!

పాశురము - 28వ రోజు

 తిరుప్పావై --- 28 పాశురం



కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్

అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై

ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్

కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో

డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు

అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై

చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే

ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్


రాగం: వలజి


ఆలమందల తోడి అడవులలో పడి తినెడి

కుడియడమ తెలియని గోపకులజులము

నీవు తోడ పుట్టిన పుణ్యమే మా పుణ్యము //ఆల//

కొరత కొంచెం లేని గోవిందా! నీతోడి

సంబంధము కాదన్న పోవునది కాదురా!

లోకమర్యాదల లోతెరుంగని లేమలము

చిన్న పేరున నిన్ను ప్రేమతో పిలిచేము

కోపగించక స్వామీ! కరుణించి పరనిమ్ము!

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


గత పాశురంలో దివ్యమైన ఆభరణాలు, వస్త్రాల పేరుతో భగవంతుని సాన్నిహిత్యాన్ని కోరిన గోపికలను వాటిని అందుకోవడానికి మీకున్న యోగ్యత ఏమిటి అని అడిగాడు శ్రీకృష్ణుడు.


" మాకున్న పశువులను మేపుకుంటూ అడవిలో తిరుగుతూ దొరికింది తినడమే మా జీవనంగా ఉన్నాము. ఏమీ తెలియని మా గోపవంశంలో నీవు జన్మించడం వల్ల దొరికినదే మా పుణ్యం. మాలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా అన్నీ తీర్చగలిగే లోపరహితుడవు నీవు. గోవిందా! నీతో మాకు గల సంబంధం వదులుకుందామన్నా పోయేది కాదు.మాకు లోకంలోని మర్యాదలు అంతగా తెలీవు అందుకే ప్రేమతో నిన్ను చిన్నపేరుతో పిలుచుకుంటున్నాము. అందుకు కోపగించుకుని మాపై దయ చూడడం మానకు దేవా. మేము కోరిన పరను ఇవ్వు"


గోపికలు తమ ఆవులను ఆచార్యులుగా, అడవే ఒక గురుకులంగా , తినే ఆహారమే వారి విద్యగా భావిస్తున్నారు. అందుకే భగవంతుని ప్రాప్తి పొందడానికి తమకు అర్హత లేదని అనుకుంటున్నారు. శ్రీకృష్ణుడి గోపికలకు ఏదో ఒక అర్హత ఉందని నిరూపించి తమను స్వీకరింపడేమో, వదిలిపెడతాడేమో అని భావించిన గోపికలు తమకు ఏమీ తెలియదని, తాము చేసేదంతా పొట్టకూటికే తప్ప కర్మయోగం కాదని చెప్తున్నారు. మా ఆహారంలో పరిశుద్ధి లేదు. అటువంటప్పుడు మాకు ఆత్మజ్ఞానమెలా కలుగుతుంది. నీవు మా వంశంలో జన్మించడమే మేము చేసుకున్న గొప్ప పుణ్యం. అంతకంటే వేరే యోగ్యత ఉండునా? అలాగే నువ్వు, మేము ఇద్దరమూ ఏమీ లేనివారమే. మాకు జ్ఞానం లేదు నీకు జ్ఞానకొరత లేదు. మాకు లేనిది నీవే కదా ఇవ్వాల్సింది. మాతో సంబంధం వదులుకుందామన్నా అది సాధ్యం కాదు. సకలజగత్తుకు నీవు ఆత్మవైతే మేము శరీరం. ఈ బంధం ఎన్నటికీ వీడేది కాదని నీకు తెలియదా స్వామి అని అమాయకంగా చెప్పారు వారంతా. స్వామికి ఎన్నో పేర్లు ఉన్నా తమ సౌలభ్యం కోసం చిన్న పేరుతో పిలిచినందుకు కోపగించకుమని కోరుతున్నారు. గోపికలు శ్రీకృష్ణుడే తమ సర్వస్వమని ఆశ్రయించారు కాబట్టి తమకు ఉన్న యోగ్యత, సాధన, పుణ్యము అన్నీ ఆతనే అని అఖండ విశ్వాసంతో నమ్మి ప్రకటించారు.

పాశురము - 27వ రోజు

 తిరుప్పావై --- 27 పాశురం



కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై

ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్

నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక

శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే

పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్

ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు

మూడనెయ్ పెయ్దు మురంగైవరివార

కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: భాగ్యశ్రీ


కూడని వారిని కూడించే గోవిందా! నిను

కీర్తించి పరను పొంది, జగము పొగడ

మేము పొందు సమ్మానము, అపురూపము // కూడని //

కంకణములు, భుజకీర్తులు, చెవిదుద్దులు, జుమికీలు

మెట్టెలు, పట్టీలు అనగ పలు ఆభరణములు

ఉడుపులు ధరించి - ఆపై క్షీరాన్నము

మునుగ నేయి పోసి - మోచేతుల జార నీతో కలసి

చల్లగా హాయిగా ఆరగింతుము గాక!

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


నిన్నటి పాశురంలో గోపికలు అడిగిన అన్ని వ్రత సామగ్రిని పరమాత్మ సమకూర్చాడు. ఇపుడు ఈ వ్రతం ఆచరించినందువల్ల తమకు కలిగే ఫలం గురించి గోపికలు వివరిస్తున్నారు.


"నీతో చేరని వారిని కూడా జయించే కళ్యాణ గుణాలుకలిగిన గోవిందుడా! నిన్ను కీర్తించి, నీ సహకారంతో వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి మేము పొందబోయే లాభం లోకాలన్నీ ప్రశంసించే విధంగా ఘనంగా ఉండాలి. చేతులకు కంకణాలు, భుజాలకు దండకడియాలు, చెవులకు దుద్దులు, పూలు, కాలికి పట్టీలు మొదలైన ఆభారణాలెన్నో మేము ధరించి, మంచి బట్టలు కట్టుకోవాలి. ఆ తర్వాత పాలు అన్నం, అది మునిగేటట్టుగా నేయిపోసి వండిన పాయసం మోచేతి మీదవరకు జారేవిధంగా నీతో కలిసి సంతోషంగా తినాలి. ఇదే మా వ్రతఫలం కావాలి స్వామీ"


భక్తునితో కూడి ఉండనివారు నాలుగు విధాలుగా ఉంటారు. మహాభక్తులైన ఆళ్వార్లు, ప్రణయంతో దూరమైన గోపికలు, కోపం, పగతో ద్వేషించే కంసుడు, దుర్యోధనుడు లాంటివారు, స్నేహం, ఉదాసీనతతో దూరమయ్యే మనలాంటి సామాన్య భక్తులు. కాని తన సౌశీల్యంతో, ప్రేమతో, పరాక్రమంతో అందరినీ వశపరుచుకుంటాడు శ్రీకృష్ణుడు. వ్రతానికి కావలసిన పరికరాలను అడిగి తీసుకున్న గోపికలు వ్రతం పూర్తి చేసాక కృష్ణుడు తమకు సన్మానం చేయాలని కోరుకుంటున్నారు. అది కూడా లోకం పొగిడే రీతిలో ఘనంగా ఉండాలంట. ఈ సన్మానం ఆ పరమాత్మను చేరడమే లక్ష్యం గా కలిగింది. ఈ సన్మానంలో వారి కోరికలు ఇలా ఉన్నాయి .. వారు కోరే ఆభరణాలు వధూవరులు (ఆత్మ, పరమాత్మ) పాణిగ్రహణ సమయంలో ఉపయోగపడేవే కావడం విశేషం. సంసారమనే సాగరంలో దిగుతున్న వ్యక్తి తనను ఉద్ధరించేవాడి హస్తానికై ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఎదురుచూసే సమయంలో జీవుడికి, భగవంతుడికి మధ్య ఉండే అజ్ఞానమే వివాహ ప్రారంభంలో వధూవరుల మధ్య పట్టే తెర. వధువు చేతిని వరుని చేతిలో పెట్టి కన్యాదానమొనర్చే తండ్రే గురువు. ఆ తర్వాత ఆ తెర తొలగిపోతుంది. ఆ సమయంలోనే ధరించడానికి చేతికి కంకణాలు కోరుతున్నారు గోపికలు. ఆ తర్వాత వధూవరులు ఎదురెదురుగా ఉండక ఒకే పీటపై పక్క పక్కనే కూర్చుని వివాహకార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ఒకరి భుజాన్ని మరొకరు తాకుతూ ఉంటారు. అందుకే ఆ భుజాలకు అందమైన దండకడియాలు కావాలట. ఆచార్యులు సమాశ్రయణం చేసేటప్పుడు పరమాత్మకు ముంద్రించే శంఖచక్రాలే ఈ ఆభరణాలు.


భర్త(పరమాత్మ)తో చేరి శయనించి గుసగుసలు వినే సమయంలొ చెవులకోసం దుద్దులు, పూలు కావాలట. గురువులు వినిపించే రహస్యాలలో తిరుమంత్రం చెవి దుద్దు కాగా, ద్వయమంత్రం చెవి పూలు.. ఒకటి భక్తి ఒకటి జ్ఞానం. చివరి చరం శ్లోకం కాలి అందియలు. తర్వాత మంచిగా దుస్తులు ధరిస్తారట. స్త్రీకి ఎన్ని ఆభరణాలు ఉన్నా మంచి వస్త్రాలు లేనప్పుడు అందం, ప్రయోజనం లేదు కదా. అదేవిధంగాఅత్మగుణాలు ఎన్ని ఉన్నా కూడా శేషత్వ జ్ఞానం లేనప్పుడు అది శోభించదు. ఎంత జ్ఞానం ఉన్నా కూడా మంచి నడవడి లేనప్పుడు ప్రయోజనం ఉండదు. ఈ ఆభరణాలు, దుస్తులు ధరించి నేయిలో మునిగేట్టుగా పాలన్నం లేదా పాయసం తయారు చేసుకుని శ్రీకృష్ణుడితో కలిసి కూర్చుని ఆనందంగా తినాలట. పరమాత్మ అన్నం కాగా, అందులోని పాలు ఆతని కళ్యాణగుణాలు, నెయ్యి భగవంతుని యందు ప్రీతి. ఆ పరమాత్మతో కలిసి ప్రీతిగా ఆయన కళ్యాణ గుణాలను ఆస్వాదిస్తామని కోరుకుంటున్నారు.