Friday, November 10, 2017

పూజా విధానము

నిత్యపూజా విధానము
గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి.
నిత్య పూజా విధానం –
నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- 
షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), 
పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి).
 ఇవి కాక మరికొన్ని పద్ధతులు కలవు.

నిత్య పూజకు కావాలిసినవి –
౧. మనస్సులో ధృడ సంకల్పం
౨. పసుపు, కుంకుమ, గంధం
౩. పసుపు కలిపిన అక్షతలు
౪. పువ్వులు, దొరికితే మామిడి ఆకులు
౫. కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు
౬. పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు
౭. అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షంలో కలశంలో ఉన్న నీరు చాలు)
౮. అభిషేకం కూడా చేయాలనుకుంటే, దాని కోసం పెద్ద పళ్ళెం, అభిషేకం అయ్యక నీళ్ళు/పంచామృతాలు పోయడానికి ఒక గిన్నె
౯. అగరవత్తులు, లేక సాంబ్రాణి, అవి పెట్టడానికి ఒక స్టాండు (ధూపం అన్నప్పుడు వెలిగించాలి)
౧౦. దీపం కుందులు (ప్రమిదలు), నూనె, వత్తులు (దీపాలను వెలిగించడానికి సిద్ధంగా తయారుచేసి ప్రక్కన ఉంచుకోవాలి)
౧౧. నైవేద్యానికి పండ్లు లేక అప్పుడే వండిన సాత్త్విక ఆహార పదార్థాలు, అవి లభ్యం కాని పక్షంలో కొంచెం బెల్లం లేదా చక్కెర
౧౨. తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం)
౧౩. హారతి కర్పూరం, హారతి పళ్ళెం
౧౪. వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె
౧౫. ఘంట
౧౬. పంచాంగం (మాసం, అయనం, తిథి, నక్షత్రం చూసుకోవడానికి)
౧౭. చేయి తుడుచుకోవడానికి శుభ్రమైన వస్త్రం
౧౮. కూర్చోవడానికి దర్భాసనంగానీ, అంచు ఉన్న తెల్లటి వస్త్రంగానీ
పూజా విధానం –
పూజకు ముందు కాలకృత్యలు తీర్చుకుని స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని, పూజా స్థానంలో ముందురోజు నుంచి ఉన్న పవిత్ర నిర్మాల్యాన్ని తీసేసి, ఆ స్థానం మరియు దేవతా మూర్తులను శుభ్రం చేయాలి. నిశ్చయించుకున్న దేవతా స్వరూపం యొక్క మూర్తిని పూజ చేయడానికి వీలుగా మనం కూర్చునే స్థానానికి ఎదురుగా ఏర్పాటు చేసుకోవాలి. కావలసిన పూజ సామగ్రిని చేతికి అందుబాటులో ఉంచుకుని కూర్చోవాలి. దుర్ముహూర్తం, వర్జ్యం కాని సమయం చూసుకుని పూజ మొదలు పెట్టలి.
ప్రతి పూజకు ప్రారంభంలో పూర్వాంగం ఉంటుంది. ఇది అన్ని పూజలకు సామాన్యంగా ఉంటుంది.
౧. శుచిః – పంచపాత్రలో నీళ్ళు ఉద్ధరిణతో కుడిచేతిలో పోసుకుని తలమీద జల్లుకోవాలి.
౨. ప్రార్థన – ఇక్కడ కొన్ని శ్లోకాలు ఉంటాయి. వాటిని చెప్తూ చేతులు జోడించాలి.
౩. ఆచమ్య – అంటే ఆచమనం. కుడి చేతిని గోకర్ణాకృతిలో పెట్టి, మొదటి మూడు నామాలకు ఎడమ చేతితో పంచపాత్రలో నీళ్ళను ఉద్ధరిణతో తీసుకుని కుడి అరచేతిలో పోసుకుని శబ్దం రాకుండా త్రాగాలి. నాలుగవ నామానికి నీళ్ళు విడిచిపెట్టి, తర్వాతి నామాలకు నమస్కారం చేయాలి. సాంప్రదాయాన్ని బట్టి మిగిలిన నామాలకు శరీర అంగములను స్పృశించవచ్చు.
౪. దీపారాధనం – దేవతా మూర్తికి రెండు వైపులా చెరియొక దీపం వెలిగిస్తూ ఈ శ్లోకం చెప్పాలి. మూడవ దీపం ఉపచార పూజలో వేరే శ్లోకం చెప్పి వెలిగించాలి. దీపానికి గంధం, కుంకుమ బొట్టు పెట్టి ఒక పువ్వు, కొన్ని అక్షతలు వేయాలి.
౫. భూతోచ్ఛాటనం – ఈ శ్లోకం చెప్పి అక్షతలు ముక్కు దగ్గర పెట్టుకుని కళ్ళుమూసుకుని వాసన చూసి ఎడమ భుజం ప్రక్కగా వెనక్కి వేయాలి.
౬. ప్రాణాయామం – ఈ శ్లోకం చదివి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం కనీసంగా మూడుసార్లు చేయాలి. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. ఇవి నాలుగు సెకండ్ల చప్పున చేయాలి.
౧. పూరకం – కుడి చేతి బొటనవేలితో కుడి ముక్కుపుటం మూసి, ఎడమ ముక్కుపుటం ద్వారా శ్వాస తీసుకోవాలి.
౨. కుంభకం – కుడి ఉంగరం, చిటికిన వేళ్ళతో ఎడమ ముక్కుపుటం మూసి, బొటన వేలితో కుడి ముక్కుపుటం మూసి, శ్వాసని ఆపాలి.
౩. రేచకం – కుడి ఉంగరం, చిటికిన వేళ్ళతో ఎడమ ముక్కుపుటం మూసి, కుడి ముక్కుపుటం తెరిచి దాని ద్వారా శ్వాసని వదలాలి.
౭. సంకల్పం – అక్షతలు కుడి చేతిలో తీసుకుని సంకల్పం చదువుకోవాలి. పంచాంగం దొరకని పక్షం లో దేశకాల సంకీర్తనం లో “శుభ” అని చెప్పుకోవచ్చు. చివరిలో “కరిష్యే” అన్నప్పుడు ఎడమ చేతితో ఉద్ధరిణతో పంచపాత్రలో నీళ్ళు తీసుకుని కుడి చేతి వేళ్ళమీదుగా అక్షతలు జారిపడేడట్టు అరివేణం లో విడిచిపెట్టాలి.
౮. కలశారాధనం – కలశానికి పెట్టిన చెంబుకి గంధం, కుంకుమ తో బొట్టు పెట్టాలి. ఒకటిగానీ, మూడుగానీ, అయిదు గానీ బొట్లు పెట్టవచ్చు. తర్వాత కలశం నీళ్ళలో గంధం, అక్షతలు వేసి ఒక పువ్వు వేయాలి. మామిడి ఆకులు ఉంటే అవి ౩ కానీ ౫ కానీ తీసుకుని, తొళ్ళిక నీటిలో, కొస ఆకాశానికి ఉండేలా వేయాలి. వేసిన పువ్వునిగానీ మామిడాకులను కానీ కుడి చేతివేళ్ళతో పట్టుకుని కలశాన్ని స్పృశిస్తూ శ్లోకం చెప్పాలి. “ఆపోవా ఇదగం” అన్నప్పుడు కలశంలో నీళ్ళను కుడిచేతి ఉంగరం వేలితో స్పృశించాలి. “సంప్రోక్ష్య” అన్నప్పుడు నీళ్ళను పూజా సామాగ్రి మీద, దేవతా ప్రతిమ మీద, మీ తలమీద జల్లుకోవాలి.
౯. శంఖపూజ – శంఖం అందుబాటులో ఉంటేనే ఇది చేయండి. ప్రత్యేకంగా అభిషేకం చేయాలనుకుంటే శంఖం ముందుగా తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకోండి. కలశంలోని నీళ్ళను కొంచెం శంఖంలోకి తీసుకుని, శంఖానికి గంధం, కుంకుమ తో బొట్టు పెట్టి, శంఖం నీటిలో గంధం మరియు అక్షతలు వేసి, శంఖం మీద ఒక పువ్వు పెట్టి ఈ శ్లోకం చదవాలి. తర్వాత ఆ నీళ్ళను తిరిగి కలశంలో పోసి, శంఖాన్ని దేవతా ప్రతిమ వద్ద ఉంచండి.
౧౦. ఘంటపూజ – ఘంటకి గంధం, కుంకుమ తో బొట్టు పెట్టి ఒక పుష్పం, అక్షతలు వేసి ఈ శ్లోకం చదవాలి.
౧౧. ఘంటానాదం – ఘంటకి నమస్కారం చేసి కుడిచేతిలో తీసుకుని ఈ శ్లోకం చదువుతూ వాయించాలి.
తరవాత గణపతి పూజ ఉంటుంది. లఘు పూజకానీ, షోడశోపచార పూజ కానీ చేయవచ్చు. పిమ్మట ప్రధాన దేవతార్చన ఉంటుంది.
————–
ఉపచారాలు – వాటి పద్ధతులు
ఉపచారం అంటే సేవ. చేసే ప్రతి ఉపచారానికి భావన ముఖ్యం. భావన బలంగా ఉంటే కేవలం అక్షతలు వేసినా దేవతకు విశేష ఉపచారం చేసినట్లే. దేవతకి మనం దాసులం అని భావన చేస్తూ ఈ ఉపచారాలు చేయాలి. షోడశోపచార పూజలో పదహారు ఉపచారాలు ఉంటాయి. వాటిలో అయిదు ఉపచారాలు పంచోపచారాలలో కూడా వస్తాయి.
పంచోపచారాలు-
౧. గంధం
౨. పుష్పం
౩. ధూపం
౪. దీపం
౫. నైవేద్యం
పంచోపచార పూజ చేయాలనుకుంటే సంకల్పం లో “పంచోపచార పూజాం కరిష్యే” అని చదువుకోవాలి. తర్వాత ధ్యాన శ్లోకాలు చదివి పైన ఇచ్చిన అయిదు ఉపచారాలు చేయాలి. ఉపచార విధానం ఈ క్రింద ఇవ్వబడింది.
షోడశోపచారాలు –
౧. ధ్యానం – దేవతా స్వరూపాన్ని పూర్ణంగా ఊహచేసి, కుడి చేతిలో అక్షతలు పట్టుకుని మీరు పూజ చేయాలనుకున్న దేవాతా స్వరూపాన్ని వర్ణించే ధ్యానశ్లోకాలు చెప్పుకోవాలి. తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
౨. ఆవాహనం – ధ్యానంలో గోచరమైన స్వరూపాన్ని మన కళ్ళకు ఎదురుగా ఉన్న ప్రతిమలోకి వచ్చినట్టు భావన చేయాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి, తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
౩. ఆసనం – ఆవాహన చేసిన దేవతా స్వరూపానికి మన ఎదురుగా ఒక స్థానంలో కూర్చుని ఉండడానికి వీలుగా ఒక సింహాసనం ఊహించి, మన ఎదురుగా దాన్ని వేసినట్టు, దేవతా స్వరూపం ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు ఊహించాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి భావన చేసి, తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
౪. పాద్యం – సింహాసనం లో కూర్చుని ఉన్న దేవతా స్వరూపం కాళ్ళ క్రింద పెద్ద పళ్ళెం పెట్టి గంగాది సర్వతీర్థాలలోంచి మంచి నీరు తెచ్చి దానిలో గంధం కలిపి ఆ పాదాలమీద పోసినట్టు, తర్వాత ఆ నీళ్ళు తల మీద పోసుకున్నట్టు భావన చేయాలి. తర్వాత శ్లోకం చదువుకుని కలశం లోని నీళ్ళు దేవతా మూర్తి పాదాల మీద జల్లాలి.
౫. అర్ఘ్యం – మన ఎదురుగా ఉన్న దేవతా స్వరూపానికి మన దోసిట నిండా నీళ్ళు తీసుకుని, ఆ దేవతా స్వరూపం యొక్క చేతులలో పోసినట్టు భావన చేయాలి. తర్వాత శ్లోకం చదువుకుని కలశం లోని కొద్ది నీరు తీసుకుని అరివేణంలో విడవాలి.
౬. ఆచమనీయం – పూజ పూర్వాంగం లో మనం ఆచమనం చేసినట్టు, దేవతా స్వరూపం కూడా ఆచమనం చేస్తున్నట్టు భావన చేయాలి. కుడి చేతితో కలశం లో నీళ్ళు ఉద్దరిణతో తీసుకుని, దేవతా స్వరూపం నోటికి అందించినట్టు భావన చేసి, అరివేణంలో మూడుసార్లు విడవాలి.
౭. అభిషేకం (స్నానం) – అభిషేకం లో మూడుభాగాలు – పంచామృత అభిషేకం, ఫలోదక అభిషేకం, శుద్ధోదక అభిషేకం. పంచామృత అభిషేకానికి ఐదు పదార్థాలు కావాలి – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార లేదా చక్కెర. ఇవి కలిపికానీ విడివిడిగా కానీ అభిషేకం చేయవచ్చు. ఫలోదకం కోసం కొబ్బరినీళ్ళు కానీ పళ్ళరసాలు గానీ వాడవచ్చు. శుద్ధోదకం కోసం కలశం నీళ్ళు వాడాలి. దేవతా మూర్తిని ఒక పెద్ద పళ్ళెం లో పెట్టి, ఉన్న పదార్థాలతో అభిషేకం చేయాలి. పంచామృత స్నానం, ఫలోదక స్నానం సాధ్యం కాకపోతే కలశంలోని నీళ్ళతో అభిషేకం చేయవచ్చు. విడిగా అభిషేకం చేయడం కుదరకపోతే, కలశంలోని నీళ్ళను అందులో ఉన్న పువ్వుతోగానీ మామిడాకులతో గానీ తీసుకుని దేవతా మూర్తి మీద చిలకరించవచ్చు. బ్రహ్మాండం మొత్తం వ్యాప్తమైన దేవతస్వరూపానికి అభిషేకం చేస్తున్నట్టు భావన చేయాలి.
స్నానం అయ్యాక కలశంలో నీళ్ళను ఉద్ధరిణతో తీసుకుని మూడుసార్లు అరివేణంలో విడవాలి. ఇది “స్నానానంతరం శుద్ధాచమనీయం” అన్నప్పుడు చేయాలి.
అభిషేకం జరిగిన తరువాత దేవతామూర్తిని శుభ్రంగా తుడిచి గంధం, కుంకుమతో బొట్టు పెట్టి తిరిగి సింహాసనంలో పెట్టాలి.
యజ్ఞోపవీతం – దేవతా మూర్తికి యజ్ఞోపవీతం వేసినట్టు భావన చేయాలి. కుడి చేతిలో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి భావన చేసి, తర్వాత ఆ అక్షతలు దేవతా ప్రతిమ పాదాల వద్ద వేయాలి.
౮. వస్త్ర యుగ్మం – సింహాసనం లో ఉన్న దేవతకి దివ్య వస్త్రాలు సమర్పించినట్టు భావన చేయాలి. పురుష స్వరూపానికి శ్రేష్ఠమైన పంచె, కండువ ఇచ్చినట్టు, స్త్రీ స్వరూపానికి నాణ్యమైన చీర, రవిక ఇచ్చినట్టు భావన చేయాలి. ఇక్కడ శ్లోకం చెప్పాలి. కుదిరితే నిజమైన వస్త్రాలు, లేకపోతే ప్రత్తితో చేసిన వస్త్రాలు, లేకపోతే అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి. ఇచ్చిన వస్త్రాలను ఆ దేవతా స్వరూపం వేసుకున్నట్టు భావన చేయాలి. భావన మాత్రం ఉన్నతంగా ఉండాలి.
౯. ఆభరణం – మంచి బంగారు ఆభరణాలతో దేవతను అలంకరించినట్టు భావన చేయాలి. కుదిరితే ఆభరణం చూపాలి, లేదా కుడి చేతితో అక్షతలు తీసుకుని, శ్లోకం చదివి, దేవత మూర్తి పాదాల వద్ద వేయాలి.
౧౦. గంధం – దేవతా స్వరూపం యొక్క చేతులకు, కాళ్ళకు, కంఠానికి గంధం రాసినట్టు భావన చేయాలి. కుడి చేతితో ఒక పువ్వు తీసుకుని, దానిని గంధంలో ముంచి, శ్లోకం చదివి, దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
౧౧. పుష్పం – మంచి పువ్వులతో చేసిన మాలని దేవతా స్వరూపం మెడలో వేసినట్టు, దోసిట నిండా పరిమళం విరజిమ్ముతున్న పువ్వులు తీసుకుని ఆ పాదాల మీద వేసినట్టు భావన చేయాలి. అంగ పూజలో ఒక్కొక్క అంగానికి పువ్వు వేస్తున్నట్టు భావన చేయాలి. అష్టోత్తరనామావళి గానీ సహస్రనామావళి గానీ చదువుకోవచ్చు.
నోటితో నామాలు చెప్తూ కుడి చేతితో పువ్వులను మూర్తి పాదాల వద్ద వేస్తూ అలంకారం చేయాలి.
౧౨. ధూపం – శ్లోకం చెప్పి అగరవత్తులు, లేక సాంబ్రాణి వెలిగించి దేవతకు చుట్టూ తిప్పి, పక్కన పెట్టాలి. ఆ పరిమళం పూజా ప్రాంతం మొత్తం వ్యాపించినట్టు భావన చేయాలి.
౧౩. దీపం – వెలిగించిన దీపాన్ని దేవతకు చూపాలి. మూడవ దీపం పెట్టడానికి కుదిరితే పెట్టాలి లేకపోతే మొదట వెలిగించిన దీపాలనే చూపాలి. కుడి చేతితో అక్షతలు దీపానికి చూపి అవి దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
౧౪. నైవేద్యం – నివేదన కోసం తెచ్చిన పదార్థాలను ఒక పళ్ళెం లో పెట్టి, శ్లోకం చెప్తూ కలశం లోని నీళ్ళను వాటిపై చిలకరించాలి. కలశంలోని పువ్వుని కానీ మామిడాకులను కానీ కుడి చేతితో పట్టుకుని, గాయత్రీ మంత్రం చదివిన తరువాత నైవేద్యం చుట్టూ తిప్పి “స్వాహా” అన్నప్పుడు దేవతా మూర్తి నోటికి అందివ్వాలి. దేవతా స్వరూపం అవి తిన్నట్లు భావన చేయాలి.
తినడం అయ్యాక చేతులు, కాళ్ళు, ముఖం (నోరు) కడిగినట్టు భావన చేసి, కలశంలో నీళ్ళను ఉద్దరిణతో అరివేణంలోకి విడవాలి. తర్వాత ఆచమనీయం అన్నప్పుడు మూడుసార్లు కలశం లోని నీరు అరివేణంలోకి విడవాలి.
౧౫. తాంబూలం – నివేదన అయ్యక తమలపాకును చుట్టి దేవత స్వరూపనికి ఇచ్చినట్టు, అది ఆ దేవత నోటిలో పెట్టుకుని నమిలినట్టు భావన చేయాలి. శ్లోకం చెప్పి, కుడి చేతితో తాంబూలం ఆకులు, వక్కలు తీసుకుని దేవతా మూర్తికి ఒక ప్రక్కగా ఉంచాలి. తాంబూలం లభ్యం కాని పక్షంలో అక్షతలు తీసుకుని శ్లోకం చదివి, ఆ దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
౧౬. నీరాజనం – లేచి నిలబడి, హారతి వెలిగించి, ఘంట వాయిస్తూ, దేవతా స్వరూపానికి పాదాల నుంచి మూర్తికి కుడి చేతి వైపుగా మూడుమార్లు తిప్పాలి. హారతి తిప్పుతున్నప్పుడు ఆ దీప కాంతిలో మీరు అలంకరించిన దేవతా మూర్తిని పరిశీలించి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత హారతిపళ్ళెం పక్కన పెట్టి, దానికి ఒక ప్రక్క కలశంలోని నీళ్ళను చిలకరించి, హారతిని కళ్ళకు అద్దుకుని, కలశంలో నీళ్ళు ఉద్ధరిణతో తీసుకుని మూడుసార్లు అరివేణంలో విడవాలి.
మంత్రపుష్పం – అక్షతలు, పువ్వులు చేతిలోకి తీసుకుని, ఇచ్చిన శ్లోకం గానీ మంత్రపుష్పంగానీ చదివి, దేవతా మూర్తి పాదాలవద్ద వేసి నమస్కారం చేయాలి.
ప్రదక్షిణ – మళ్ళీ అక్షతలు తీసుకుని, శ్లోకం చెప్తూ, మనకు కుడివైపుగా మూడుసార్లు ప్రదక్షిణగా తిరగాలి. చేతిలోని అక్షతలు దేవతా మూర్తి పాదాలవద్ద వేసి నమస్కారం చేయాలి.
పునః పూజ – రాజయోగ్యమైన ఉపచారాలు చేస్తున్నట్టు భావన చేయాలి. శ్లోకాలు చెప్పి అక్షతలని కుడి చేతితో తీసుకుని దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
అర్పణ – అక్షతలు కుడి చేతిలోకి తీసుకుని ఉద్ధరిణతో కలశం లోని నీరు తీసుకుని, శ్లోకం చెప్పి, అరివేణంలోకి విడవాలి.
తీర్థస్వీకరణ – శ్లోకం చదువుకుంటూ అభిషేక జలాన్ని కానీ, లేకపోతే కలశం లోని నీటిని గానీ ఉద్ధరిణతో తీసుకుని, మూడు సార్లు కుడి అరచేతిలో వేసుకుని శబ్దం రాకుండా తాగాలి.
“ఓం శాంతిః శాంతిః శాంతిః” అన్నప్పుడు దేవతా మూర్తి పాదల వద్ద ఉన్న అక్షతలు తీసుకుని శిరస్సు మీద వేసుకుని, కళ్ళుమూసుకుని నమస్కారం చేసి మన చుట్టూ ప్రశాంతత నెలకొన్నట్టు భావన చేయాలి.
———–
ఇది క్లుప్తంగా ఇవ్వబడిన పూజా విధానం. మరింత వివరంగా మీ పెద్దలవల్లగానీ, పురోహితులవల్లగానీ, గురువు వద్దగానీ తెలుసుకోగలరు.
|| స్వస్తి ||
మీ
గోగులపాటి కృష్ణమోహన్
(పలు ముఖ్య గ్రంధాల నుండి సేకరణ)

Saturday, November 12, 2016

పంచ మహా యజ్ఙాలు


పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?
ఇవి ఋత్విక్కులు చేసే యజ్ఞాలు కాదండీ.   శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు.  అవి ఏమిటి?

1. దేవ యజ్ఞం 
పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు.  వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు.   దీనికి ఆహుతం అని పేరు.  అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే.  సృష్టికి మూల కారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం. 

2. పితృ యజ్ఞం 
మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి.  చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి.  ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం.  ఇది పితృ యజ్ఞం. 

3. భూత యజ్ఞం 
గృహస్తు సర్వప్రాణికోటిమీద  దయ కలిగి పుండాలి.  పశు పక్షులు, క్రిమి కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి.  అందుకే మనిషికి భూత దయ వుండాలి.  అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి.  ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి.  ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి.  క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు)  పక్కన పెట్టాలి.  (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు).  జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి.  సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.

4. మనుష్య యజ్ఞం
మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు.  అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు.  రోజులు మారినాయి.  అయినా ఇంటికొచ్చినవారిని మన కులం వారా, మన మతం వారా మన కేవిషయంలో నైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి.  తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి.  అందరితో సఖ్యంగా వుండాలి.  ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి. 

5. బ్రహ్మ యజ్ఞం 
ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రిలని కానీ చదవాలి.  ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ ప్రతి వారూ ఎవరికి వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి.  ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి.  అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి.  

ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం, శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస వున్నాయనుకోండి.  ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.  మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేసించారు మన పెద్దలు.

సేకరణ
మీ
గోగులపాటి కృష్ణమోహన్


పదునెట్టాంబడి - ప్రాముఖ్యత


పదునెట్టాంబడి

కామం - 1వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "గీతా మాత".ఈ మెట్టు ఎక్కడం ద్వారా మనిషికి పూర్వజన్మస్మృతి కలుగుతుంది. గతజన్మలో తాను చేసిన పాపపుణ్యకర్మల విచక్షణాజ్ఞానం కలిగి మనిషి మానసికంగా శుద్ది పొందుతాడు. 

"లైంగిక కోరికను" సంస్కృతంలో "కామము" అని అంటారు. ఇంకా విస్తృతంగా కోరిక, వాంఛ అని కూడా అంటారు.

క్రోధం - 2వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "గంగా దేవి". ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్ధాత్మను అనే జ్ఞానం కలుగ్తుంది.

"తన కోపమే తన శత్రువు". మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. అందుకే క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం.

లోభం - 3వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "గాయత్రీ మాత". ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమగతులు కలుగుతాయి.

అవసరాలకంటే ఎక్కువ కావలనుకునే బుద్ది. కీర్తి కోసం అత్యాశ, తీవ్రమైన మరియు స్వార్థపూరిత కోరిక. దురాశ దుఖాఃనికి చేటు.

మోహం - 4వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "సీతా దేవి". ఈ మెట్టు జ్ఞానయోగానికి ప్రతీక.

ఒక పరిస్థితిని లేక నమ్మకమైన ఒక కారణం, ప్రత్యేకించి ఒక వ్యక్తి పై ప్రేమ /అనుబందం భావన.

మదం - 5వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "సత్యవతీ మాత". ఈ మెట్టు కర్మసన్యాసయోగానికి ప్రతీక. 

4 & 5 మెట్లు స్పర్శించిన గృహములో ఉన్న పశు-పక్ష్యాదులకు సైతం పాపాలు నశించి, ఉత్తమగతులు కలుగుతాయి. 

తాను అనుకున్న లేక నమ్మిన దానినే ఉత్తమమైనదిగా భావించే మనసత్వం.


మాత్స్యర్యం - 6వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "సరస్వాతీ దేవి". ఈ మెట్టు స్పర్శల వలన విష్ణుసాయుజ్యం, సమస్త ధాన ఫలం కలుగుతుంది.

ఇతరుల సంతోషాన్ని కాని ఆనందాన్ని ఒర్వలేని బుద్ది


దంబం - 7వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "బ్రహ్మవిద్యా దేవి". ఈ మెట్టు స్పర్శల వలన విజ్ఞానయోగాధ్యాయం కలిగి పునర్జన్మ కల్గదు.

అహంకారం - 8వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "బ్రహ్మవల్లీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన స్వార్ధం, రాక్షసత్వం నశిస్తాయి.

నాకు మాత్రమే తెలుసు లేక నేనే గొప్ప అనుకునే బుద్ది.

నేత్రములు - 9వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "త్రిసంధ్యా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన అప్పుగాతీసుకున్న వస్తువుల వల్ల సంక్రమించిన పాపం హరిస్తుంది. 

దేవుడు సృష్ఠించిన ఈ లోకాన్ని చూడడానికి ఉపయోగపడే ఇంద్రియమే నేత్రములు (నయనాలు లేక అక్షులు) “సర్వేంద్రియానం నయనం ప్రధానం”

చెవులు - 10వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "ముక్తిగేహినే దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమధర్మ పుణ్యఫలం, జ్ఞానం కలుగుతుంది. ఇవి మంచిని వినుటకు మాత్రమే ఉపయోగించవలెను.

స్వామి కీర్తనలను, నామాలను వినుటకు ఉపయోగపడే ఇంద్రియమే చెవులు.

నాసిక - 11వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "అర్ధమాత్రా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన అకాలమృత్యుభయం ఉండదు. 

వాసనను గ్రహించే ఇంద్రియమే నాసికం.


జిహ్వ - 12వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "చిదానందా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఇష్టదేవతా దర్శనము లభిస్తుంది. దీనిని కఠొరంగా మాట్లాడుటకు ఉపయోగించకూడధు. 

షడ్రుచులను తెలిపే ఇంద్రియమే జిహ్వ (నాలుక). ఈ ఇంద్రియంతోనే స్వామిని కీర్తనలతో, నామాలతో స్మరించి ఆ రుచిని కూడా పొందాలి.


స్పర్శ - 13వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "భవఘ్నీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన వ్యభిచార, మద్య, మాంసభక్షణ, పాపాలు నశిస్తాయి. 

స్వామి పాదములను స్పర్శించుటకు ఉపయోగపడే ఇంద్రియమే స్పర్శ.

సత్వం - 14వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "భయనాశినీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన స్త్రీహత్యాపాతకాలు నశిస్తాయి.

స్వచ్ఛత, ప్రశాంతత, ఆనందం, శక్తి, మంచితనం యొక్క నాణ్యత. కొన్నిసార్లు మంచితనం గా అనువదించబడిన సాత్వ యొక్క దశ తేలిక, శాంతి, పరిశుభ్రత, జ్ఞానం, మొదలైన లక్షణములు కలిగి ఉంటుంది.


తామసం - 15వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "వేదత్రయూ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఆహారశుద్ధి, మోక్షం,కలుగుతాయి. 

అతి నిద్ర , చాలా సోమరి, చీకటి, అజ్ఞానం, మందగతి, విధ్వంసం, భారము, వ్యాధి, మొదలైన లక్షణములు కలిగి ఉంటుంది.


రాజసం - 16వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "పరాదేవి". ఈ మెట్టు స్పర్శ వలన దేహసుఖం, బలం లభిస్తాయి. 

రాజసం యొక్క దశ. చర్య, అభిమానం, సృష్టి, దుడుకు, చురుకు మొదలైన లక్షణములు కలిగి ఉండటం.

విద్య - 17వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "అనంతాదేవి". ఈ మెట్టు స్పర్శ వలన దీర్ఘవ్యాధులు సైతం నశిస్తాయి. 

అభ్యాసం లేదా అధ్యయనం ద్వార సాధించే ఆధ్యాత్మిక అవలంబనే విద్య.


అవిద్య - 18వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "జ్ఞానమంజరీదేవి". ఈ మెట్టు స్పర్శ వలన యజ్ఞాలు చేసిన పుణ్యఫలం, ఆర్ధిక స్థిరత్వం కలుగుతాయి.

విద్య లేకపొవటమే అవిద్య. విద్య లేని వాడు వింత పశువు.

స్వస్తి
సేకరణ
మీ
గోగులపాటి కృష్ణమోహన్



శత గాయత్రి - మంత్రావళి

శతగాయత్రి-మంత్రావళి


సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

-: బ్రహ్మ గాయత్రి :-
1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //
-: విష్ణు గాయత్రి :-
4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
-: శివ గాయత్రి :-
7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//
9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//
10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //
11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
-: వృషభ గాయత్రి :-
13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
-: చండీశ్వర గాయత్రి :-
15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

-: భృంగేశ్వర గాయత్రి :-
17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//
-: వీరభద్ర గాయత్రి :-
18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
-: శిఖరగాయత్రి :-
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//
-: ధ్వజగాయత్రి :-
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//
-: దత్త గాయత్రి :- 
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.// 
-: శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//
-: సుదర్శన గాయత్రి :-
25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//

-: మత్స్య గాయత్రి :-
27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//
-: కూర్మ గాయత్రి :-
28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//
-: వాస్తుపురుష గాయత్రి :-
29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.//
-: శ్రీ గణపతి గాయత్రి :-
30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.// 
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
-: శ్రీ కృష్ణ గాయత్రి :-
32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
-: శ్రీ రామ గాయత్రి :-
35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
-: శ్రీ ఆంజనేయ గాయత్రి :-
37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
-: శ్రీ హయగ్రీవ గాయత్రి :-
39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//
-: శ్రీ స్కంద గాయత్రి :-
40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
-: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-
43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
-: శ్రీ గరుడ గాయత్రి :-
45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//
-: శ్రీ అనంత గాయత్రి :-
46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//
-: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-
47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//
48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//
49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//
50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.//
51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//
52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//
53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//
54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//
-: శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-
55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.//
56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//
57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//
58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//
59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.//
60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//
61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//
62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//
63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//
-: శ్రీ సాయినాథ గాయత్రి :-
64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//
-: శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-
65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//
-: శ్రీ నృసింహ గాయత్రి :-
66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//
-: శ్రీ లక్ష్మణ గాయత్రి :-
67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//
-: శ్రీ క్షేత్రపాల గాయత్రి :-
68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//
-: యంత్ర గాయత్రి :-
69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//
-: మంత్ర గాయత్రి :-
70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//
-: శ్రీ సరస్వతీ గాయత్రి :-
71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//
-: శ్రీ లక్ష్మీ గాయత్రి :-
72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
-: శ్రీ గౌరి గాయత్రి :-
74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
-: శ్యామలా గాయత్రి :-
76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.//
77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//
-: భైరవ గాయత్రి :-
78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//
-: శక్తి గాయత్రి :-
79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//
-: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-
80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
-: శ్రీ బాలా గాయత్రి :-
82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//
-: శ్రీ సీతా గాయత్రి :-
83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//
-: శ్రీ దుర్గా గాయత్రి :-
84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//
-: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-
85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.//
-: శ్రీ ధరా గాయత్రి :-
86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//
-: శ్రీ హంస గాయత్రి :-
87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.//
-: శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-
88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//
-: శ్రీ గంగా దేవీ గాయత్రి :-
89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
90. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
-: శ్రీ యమునా గాయత్రి :-
91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.//
-: శ్రీ వారాహీ గాయత్రి :-
92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత్.//
-: శ్రీ చాముండా గాయత్రి :-
93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.//
-: శ్రీ వైష్ణవీ గాయత్రి :-
94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//
-: శ్రీ నారసింహ గాయత్రి :-
95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.//
-: శ్రీ బగాళా గాయత్రి :-
96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//
-: శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-
97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.//
-: శ్రీ సంతోషీ గాయత్రి :-
98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.//
-: శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-
99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
సర్వే జనాః స్సుఖినోభవంతు.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజావిధానం


సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నిత్య పూజ

పూజా విధానం:
గణపతి ధ్యానం:
శ్లో||శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||

శ్లో||ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం |
దేవతాపూజనార్థాయ ఘంటానాదం కరోమ్యహం ||
(అని ఘంటవాయించాలి)

ఆచమనం:
(పై మూడు మంత్రములతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషికేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
(అని పై నామములను స్మరింపవలెను)

శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
      ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.

ప్రాణాయామము:
ఓం భూః, ఓంభువ, ఓగ్ ంసువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ ంసత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.

సంకల్పం:
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ...ఆయనే, .....ఋతౌ, .....మాసే, ....పక్షే , ....తిధౌ, ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతా ముద్దిస్య | శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం ధానా వాహనాది శోడశోపచార పూజాం కరిష్యే|

అని మూడుమార్లు నీటిని ఆకులోగాని, పళ్ళెములోగాని వదలవలయును. ఆ పిదప గంటను ఈ శ్లోకము చదువుచు వాయించవలయును.


ప్రాణప్రతిష్ట:
(నీటిని చల్లుతూ క్రింది మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం ప్రాణస్య శివః ప్రాణేశ స్వాహ ||

ధ్యానం:
శక్తిహస్తం విరూపాక్షం షడాననం దారుణం |
రిషోఘ్నం భావయే కుక్కుట ధ్వజం ||
షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం |
రుద్రస్యసూనుం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే ||
కుమారేశసూనో గుహస్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తి హారిన్ ప్రభో తారకారే సదారక్షమాంత్వం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధ్యాయామి

ఆవాహనం:
ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వ సేవిత |
తారకాసుర సంహారిన్ రక్షోబల విమర్ధన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆవాహయామి

రత్నసింహాసనం:
ఉమాసుతశ్శక్తిధరః కౌమార క్రౌంచదారణ |
ఇదం సింహాసనం దివ్యం గృహ్యతాం శంకరాత్మజ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(పుష్పము ఉంచవలయును)

పాద్యం:
గంగాజల సమాయుక్తం సుగంధం గంధసంయుతం |
పాద్యం చ ప్రతిగృహ్ణాతు పార్వతీ ప్రియనందన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(కలశంలోని నీటిని అమ్మవారి పాదములు కడిగినట్టుగా భావించి చల్లవలయును)

అర్ఘ్యం:
స్కందో గుహష్షణ్ముఖశ్చ ఫాలనేత్ర సుతః ప్రభుః |
అర్ఘ్యం దాస్యామితే దేవ శిఖివాహో ద్విషద్భుజః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి
(మరల ఉదకము చల్లవలయును)

ఆచమనీయం:
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్త వత్సలః |
గంగాసుతశ్శరోద్భూతః ఆచమనం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి
(మరల నీళ్లు చల్లవలయును)

పంచామృత స్నానం:
పయోదధి సమాయుక్తం ఘృత శర్కరయా యుతం |
పంచామృత స్నానమిదం గృహణ సురపూజిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి
(పంచామృతములు పుష్పముతో చల్లవలెను)

శుద్ధోదకస్నానం:
నదీనాం దేవ సర్వాసాం అనీతం నిర్మలోదకం |
స్నాపయామి మహాసేన తథా శాంతిం కురుష్యమే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి
(మంచినీటిని పుష్పముతో చల్లవలయును)

వస్త్రం:
మహాసేనః కార్తికేయః మహాశక్తిధరో గుహః |
వస్త్రం సూక్ష్మం గృహాణత్వం సర్వదేవ నమస్కృతః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(వస్త్రము లేదా అక్షతలు, పుష్పము ఉంచవలెను)

యజ్ఞోపవీతం:
నానారత్న స్వర్ణయుతం త్రివ్ర్తం బ్రహ్మసూత్రకం |
ఉపవీతం మయాదత్తం సంగృహాణ సురేశ్వర ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం:
శ్రీగంధాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దివ్యశ్రీ గంధం సమర్పయామి
(గంధము పుష్పములో అద్ది సమర్పించవలెను)

అక్షతాన్:
శాలీయాంశ్చంద్రవర్ణాభాన్ హరిద్రా మిశ్రితాం స్తథా |
అక్షతాంస్తవ దాస్యేవాహం గృహాణ సురవందిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షంతలు చల్లాలి)

ఆభరణం:
భాషణాని విచిత్రాణి హేమరత్న మయానిచ |
గృహాణ భువనాధార భుక్తిముక్తి ఫలప్రద ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆభరణి సమర్పయామి
(పూలు, అక్షంతలు చల్లాలి)

పుష్పము:
సుగంధీని సుపుష్పాణి కేతకీ చంపకాని చ |
మయాహృతాని పూజార్థం కృపయా ప్రతిహృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పుష్పాణి సమర్పయామి
(పూలు వేయాలి)

అథాంగ పూజ:
ఓం జ్ఞానశక్త్యాత్మాకాయ నమః పాదౌ పూజయామి
ఓం స్కందాయే నమః గుల్ఫౌ పూజయామి
ఓం అగ్నిగర్భాయ నమః జానునీ పూజయామి
ఓం బాహులేయాయ నమః జంఘే పూజయామి
ఓం గాంగేయ నమః ఊరూ పూజయామి
ఓం శరణోద్భవాయ నమః కటిం పూజయామి
ఓం కార్తికేయాయ నమః ఉదరం పూజయామి
ఓం కుమారాయ నమః నాభిం పూజయామి
ఓం షణ్ముఖాయ నమః హృదయం పూజయామి
ఓం తారకారి నమః కంఠం పూజయామి
ఓం సేనానీ నమః వక్త్రం పూజయామి
ఓం గుహాయా నమః నేత్రం పూజయామి
ఓం బ్రహ్మచారిణే నమః కలౌ పూజయామి
ఓం శివతేజాయ నమః లలాటం పూజయామి
ఓం క్రౌంచాధారీ నమః శిరః పూజయామి
ఓం శిఖివాహనాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ పూజ
(ఒకొక్క నామానికి పసుపు/కుంకుమ/పూలు వేస్తూ చదవాలి)

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామవళిః

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి

ఓం స్కందాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షన్ముఖాయ నమః
ఓం ఫాలనేత్ర  సుతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగళాయ నమః
ఓం క్రుత్తికాసూనవే నమః
ఓం సిఖివాహాయ నమః
ఓం ద్విషన్ణే త్రాయ నమః                                        ||10||
ఓం శక్తిధరాయ నమః
ఓం ఫిశితాశ ప్రభంజనాయ నమః
ఓం తారకాసుర సంహార్త్రే నమః
ఓం రక్షోబలవిమర్ద నాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సురసైన్య స్సురక్ష కాయ నమః
ఓం దీవసేనాపతయే నమః
ఓం ప్రాజ్ఞాయ  నమః                                                 ||20||
ఓం కృపాళవే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచ దారణాయ నమః
ఓం సేనానియే నమః
ఓం అగ్నిజన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః                                      ||30 ||
ఓం శివస్వామినే నమః
ఓం గుణ స్వామినే నమః
ఓం సర్వస్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంత శక్తియే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతిప్రియనందనాయ  నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం సరోద్భూతాయ నమః
ఓం అహూతాయ నమః                                          ||40||
ఓం పావకాత్మజాయ నమః
ఓం జ్రుంభాయ నమః
ఓం ప్రజ్రుంభాయ నమః
ఓం ఉజ్జ్రుంభాయ నమః
ఓం కమలాసన సంస్తుతాయ నమః
ఓం ఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వ ర్ణాయ నమః                                       ||50||
ఓం పంచ వర్ణాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం ఆహార్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకారాయ నమః
ఓం వటవే నమః                                                     ||60||
ఓం వటవేష భ్రుతే నమః
ఓం పూషాయ నమః
ఓం గభస్తియే నమః
ఓం గహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
ఓం శంకరాత్మజాయ  నమః                                        ||70||
ఓం విస్వయోనియే  నమః
ఓం అమేయాత్మా నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్టినే నమః
ఓం పరబ్రహ్మయ నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విరాట్సుతాయ నమః
ఓం పుళిందకన్యాభర్తాయ  నమః
ఓం మహాసార స్వతావ్రుతాయ నమః                          ||80||
ఓం ఆశ్రిత ఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయ నమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంత మూర్తయే  నమః
ఓం ఆనందాయ నమః
ఓం శిఖిండికృత కేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమ డంభాయ నమః
ఓం మహా డంభాయ నమః
ఓం క్రుపాకపయే నమః                                              ||90||
ఓం కారణోపాత్త దేహాయ నమః
ఓం కారణాతీత విగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామ పారాయణాయ నమః
ఓం విరుద్దహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్తాస్యాయ  నమః
ఓం శ్యామ కంధరాయ నమః                                                                ||100||
ఓం సుబ్ర హ్మణ్యాయ నమః
ఆన్ గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రాహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయ ఫలదాయ నమః
ఓం వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః                       ||108

 ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్ఠోత్తర శతనామావళిః
పూజా సమాప్తః

శ్రీ సుబ్రమణ్య స్తోత్రం
హే స్వామినాథ! కరుణాకర దీనబంధో శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మ బంధో
శ్రీశాదిదేవగణపూజిత పాదపద్మ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 1 II 

దేవాధిదేవనుత దేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజు పాద
దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీశనాథ మమదేహి కరావలంబం II 2 II 

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్తకామ
శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీశనాథ మమదేహి కరావలంబం II 3 II 

క్రౌంచామరేంద్ర పరిఖండన శక్తి శూల పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 4 II 

దేవాధిదేవ రథమండల మధ్యవేద్య దేవేంద్ర పీఠనగరం ధృఢచాప హస్తం
శూరం నిహత్య సురకోటి భిరీడ్యమాన వల్లీశనాథ మమదేహి కరావలంబం II 5 II 

హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూరకుండల లసత్కవచాభిరామ
హేవీర తారక జయామర బృందవంద్య వల్లీశనాథ మమదేహి కరావలంబం II 6 II 

పంచాక్షరాది మనుమన్త్రిత గాంగతోయైః పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 7 II 

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తమ్
సిక్త్వాతు మామవ కళాధర కాంతి కాంత్యా వల్లీశనాథ మమదేహి కరావలంబం II 8 II 

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః 
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం తత్క్షణా దేవనశ్యతి.

II ఇతి శ్రీసుబ్రహ్మణ్యాష్టకం (సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం) సంపూర్ణం II 

ధూపం:
దశాంగం గుగ్గులోపేతం సుగధం చ మనోహరం |
ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృతః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ధూపం సమర్పయామి
(అగరవత్తులు వెలిగించండి)

దీపం:
అజ్ఞాన నాశనం దేవ జ్ఞాసిద్ధిప్రభో భవ |
సకర్పూరాజ్య దీపం చ గృహాణ సురసేవిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సాక్షాత్ దీపం దర్శయామి
(దీపం చూపించాలి)

నైవేద్యం:
భక్త్యైర్భోజ్యై స్సచోష్యైశ్చ పరమాన్నం స శర్క్రరం |
నైవేద్యం గృహ్యతాం దేవీ శంభుపుత్ర నమోస్తుతే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి
(పిండి వంటలపై నీళ్ళు చల్లాలి)

తాంబూలం:
తాంబూలంచస కర్పూరం నాగవల్లీ దళైర్యుతం |
ఊగీఫల సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి
(తాంబూలం చూపాలి)

నీరాజనం:
కర్పూర వర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం |
ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంగళ నీరాజనం దర్శయామి
(కర్పూరం వెలిగించాలి)

మంత్రపుష్పం:
మంత్రపుష్పం ప్రదాస్యామి గృహాణ వరదో భవ |
పరమేశ్వర పుత్రస్త్వం సుప్రీతోభవ సర్వదా ||
భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేవాయ ధీమహీ తన్నో షణ్ముఖి ప్రచోదయాత్ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారం:
(చేతిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి)
యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్థన
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ప్రదక్షిణం సమర్పయామి

పునః పూజ:
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఛత్రం అచ్చాదయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః చామరం వీజయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నృత్యం దర్శయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః గీతం శ్రావయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అశ్వాన్ ఆరోహయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః గజాన్ ఆరోహయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆందోళికాం ఆరోహయామి
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి

క్షమా ప్రార్థన:
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అర్పణ:
అనయ ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక |
ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ సుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యా స్వామి షోడశోపచార పూజాం సంపూర్ణం

స్వస్తి

(సేకరణ)
మీ 
గోగులపాటి కృష్ణమోహన్